Wednesday, September 30, 2009

కాల భైరవ

ఆ ఆదివారం తొందరగా లేచి ఇంటి ముందు ఉన్న కాలవలో స్నానం చేసాడు భైరవుడు.
రెండో మూడో పల్లు మాత్రమే మిగిలిన తన దువ్వెన తో బాగా దువ్వాడు .
ఈల వేస్తూ తోక ఉపుతూ పక్కన ఉన్న ఆడ కుక్కలకి కన్ను కొడుతూ ఎక్కడ లేని ఉత్సాహంగ బైల్దేరాడు భైరవుడు .

ఇ౦తలొ

ఎవరో కొట్టి నట్టు లేచాడు, సుల్తాన్ . తన ప్రాణ స్నేహితుడు భైరవుడు చెప్పిన విషయం గుర్తువచ్చి అదుర్తగా లేచాడు. బౌ బౌ బౌ .. బావ్ బావ్ బావ్ .. భో బో .. అన్నాడు అమ్మ తో. అదే అదే నేను తొందరగా లేపమన్నాను కదా అమ్మ ఏమి నన్ను నిద్ర లేప లేదు అని అరిచాడు అమ్మ ని . నిన్ను బౌ బౌ ఆ లేక మీ నాన్న కి వంట చేసేదా భౌ భౌ భౌ అన్నింది వాళ్ళ అమ్మ కుక్క.

సుల్తాన్ కి నిన్ననే దొరికిన గడియారం చూసి, భైరవ వచ్చేస్తాడు నన్ను ఇలా చుస్తే అయిపోతాను అని వాళ్ళ అమ్మ మీద ఇంకా గెట్టిగా భౌ భౌ భౌ .... ఇంతలొ ఛాకు లాంటి ఉపాయం తట్టింది సుల్తాన్ కి . అప్పుడెప్పుడో సినిమా లో చిన్న వేషం వేసినప్పుడు భైరవ అతనికి ఇచ్చిన అత్తరు బుడ్డి తీసుకొని వల్లంతో కొట్టుకొని, చీపురు పుల్లతో దువేసాడు. ఇంతలొ భౌ భౌ భౌ .. సుల్తాన్ అని సబ్దం వినిపించింది ... వస్తున్నా రా భౌ భౌ భౌ .... కాల అన్నాడు సుల్తాన్ . భైరవ నల్లగా వుంటాడు అని సుల్తాన్ ఎప్పుడు వాడ్ని కాల కాల అని పిలుస్తాడు .. సుల్తాన్ తప్ప ఎవరైన ... భైరవుడ్ని కాల అన్ని పిలిస్తే... భౌ భౌ భౌ ... .. . ఆ రోజే ... ఆ కుక్క కి చివరి ... భౌ భౌ భౌ ...

భౌ భౌ భౌ ... కాల అన్ని అరుస్తూ .. వస్తున్నా సుల్తాన్ ని చూడగానే.. ఈ రోజు కోడ .. స్నానం లేదా అన్నాడు కాల భైరవ . భైరవ మాటకి సమాదానం చెప్పకుండానే.. ఏమి ఈరోజు బాగా తయారు అయ్యావు అన్ని మాట మార్చాడు సుల్తాన్.. కాల భైరవ గర్వంగా తోక ఆడిచిడు. ఇంతలొ సుల్తాన్ వాళ్ళ నాన్న అట్టుగా రావడం చూసి ఇద్దరు భయం నటించారు.. సుల్తాన్ వాళ్ళ నాన్న ఆ వీధి కుక్కల అందరికి పెద్ద.
ఏమి రా మీ ఇద్దరు .. నిన్న ఆ పొట్ట మనిషి వాళ్ళ కుక్కని కొట్టారు అంట. అది కాదు నాన్న వాడే భైరవ చెల్లెలిని ఏడిపించాడు ఒకటే అరుపు పరిగితాడు భౌ భౌ .. సుల్తాన్... భౌ భౌ భౌ ...ఎదయిన ఉంటె నాకు చెప్పాలి మీరే చేస్తే మేము ఎందుకు ఆ పొట్టోడు నిన్ను ఏమి ఆయన చేస్తే ఎవరది భాద్యత . నువ్వు చెప్పు భైరవ ఇక నుంచి వీడని గొడవ చేయకుండా నువ్వే చూడాలి అన్నాడు . ఇంతలొ ఎవరో భౌ భౌ భౌ అన్ని పిలిస్తే పంచాయితీకి బయల్దేరాడు

అమ్మ మీ అయన నిజంగా ఎక్కువ చేస్తున్నాడు ... లేక పోతే వాడు తప్పు చేసిన నన్నే అంటునాడు చూడు . దానికి తోడూ వీడా నన్ను అప్పేది. అసలు గొడవ మొదలు పెట్టిందే వీడు . నాకు విషయం తెలిసి నేను గెట్టిగా భౌ భౌ భౌ.. దాంతో ఆ పొట్టోడి కుక్క పారిపోయింది .
అయిన మీ నాన్న మాట ఎందుకు రా మీకు. అసలు పంచాయితీలో మిమ్మల్ని అందరు మేచుకున్నారు అంట తెలుసా . ఎక్కడ మీకు ఏమి అవ్తుందో అని ఆయన అల్లా అన్నాడు లే.. మీరు ఆయన మాట విన్నారు అన్ని ఆయనకి కోడ భౌ భౌ భౌ ... అన్నింది ఆ పిచి తల్లి..

సుల్తాన్ భైరవ కలిసి వాళ్ళ వీధి చివర వున్నా టీ బ౦కు దగ్గరకి వచ్చి అగ్యారు. సుల్తాన్ ఏమో అక్కడ ఇక్కడ దొరికిన కొంచెం టీ తాగాడు. బైరవకి వడ ముక్క తేచి ఇచ్చాడు. ఇద్దరు అక్కడే కాసేపు కూర్చొని అక్కడ మాటలు వింటున్నారు.
ఏమి అయిన చెప్పండి రాజశేఖర రెడ్డి కి వచ్చిన చావూ కుక్కలకు కోడ రాకూడదు అన్నారు. సుల్తాన్ గాడికి బాగా కోపం వచ్చింది భౌ భౌ భౌ అన్ని అరుస్తున్నాడు . భైరవ సుల్తాన్ని అగ్గు అని చెప్పి భౌ భౌ భౌ .
ఈ వార్త చూడర, ఎక్కడో ఒక కుక్క తన యజమానికి గుండె నొప్పి వస్తే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ని పిలిచుక వచ్చింది అంటర అన్నాడు ఒక్కడు . సుల్తాన్ భైరవ గర్వంతో తోక ఎగరేసాయి . ఇంతలొ అక్కడికి ఆ ఉరి పాఠశాల పంతులు వచ్చాడు .. అందరు వినయంగా లేచి నమస్కారాలు చెప్పారు . కూర్చున్న సుల్తాన్ , భైరవ కోడ లేచి భౌ భౌ భౌ. ..


ఆ మాస్టర్ చేతిలో ఉన్న వెండి గ్లాస్ చూడగానే ... అయ్యా నేనే మీ ఇంటికి వస్తా పదండి అయ్యా అన్నాడు ... టీ బంకు వాడు. .. భైరవకి , సుల్తాన్ కి ఏమి అర్థం కాలేదు.. ఎందుకో... ఆయన వెళ్ళగానే .. టీ బంకు లో మల్లి మాటలు మొదలు.. అయ్యవారు ... చాల మంచివోడు రా ... మంచోడికే కదా కష్టాలు అనుకున్నారు... సుల్తాన్ భైరవ వైపు చూసి బౌ బౌ బౌ అన్ని అడిగాడు ఏమి ఆయన అర్థం అయ్యిందా అన్ని .. అర్థం కాలేదు అన్నటు .. తోక ఉపుతూ ... బౌ బౌ బౌ అన్నాడు .. భైరవ ..

ఇంతలొ వాళ్ళు ఎవరికోసం వేచి చూస్తున్నారో ఆ కుక్క వచ్చాడు ... వాడే బిల్లా గాడు. బిల్లా గాడు ..
మై నేమ్ ఇస్ బిల్లా ..
ఈ వీదిలోకల్ల .. నేనేరా పెద్ద తిల్ల ...
నన్ను అప్పితే మీ గతి అల్లా ...
నాతో ఏ కుక్క పెట్టుకోదుర ఎల్ల..
పెట్టుకుంటే ఒళ్ళంతా గుల్లా
మై నేమ్ ఇస్ బిల్లా ..
అని పాడుకుంటూ వస్తున్నాడు .. భైరవని , సుల్తాన్ ని చూడగానే.. ఎక్కడలేని ఉత్సాహంతో వాళ్ళ దగ్గరకి పరిగితాడు... బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ మాత్రమే వస్తోంది ..

అని పాడుకుంటూ వస్తున్నాడు .. భైరవని , సుల్తాన్ ని చూడగానే.. ఎక్కడలేని ఉత్సాహంతో వాళ్ళ దగ్గరకి పరిగితాడు... బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ మాత్రమే వస్తోంది .. (త్యాన్ త్యాన్ .. )

సుల్తాన్ ,భైరవ బిల్లా ని చూడగానే ... వాడు వస్తున్నా వైపు బయల్దేరాయి .
ఏదో చెప్పపోతుంటే .. సుల్తాన్ దాచిపెట్టిన వడ ముక్క బిల్లా వైపు విసిరాడు.
ముగ్గురు కలిసి బయల్దేరారు . బిల్లా వడ ముక్క తినేసి ..
సుల్తాన్ .. భైరవ.. మనకి అందిన ఇన్ఫో కరక్టే రా .. వాడు ఈరోజు చికెన్ చేస్తున్నాడు .. వాడి కూతురి బాగా రెడీ అయ్యింది .. ఏదో కేకు కోస్తాను అని కోడా గొడవ చేసింది .. చికెన్ తినను అమ్మ .. కేకు .. వద్దు అంటున్నాడు .. ఈ మనుషలకి తలకాయ లేదు లేకపోతే చూడు తల కుర కంటే.. తొక్క లో కేకు ఎక్కువ ..

సుల్తాన్ గాడికి .. బిల్లా గాడికి నోర్లు ఉరుతున్నాయి .. భైరవ ఇష్టం లేనట్టు పెట్టాడు మొహం...
సుల్తాన్ .. బౌ బౌ బౌ బౌ... అన్నాడు .. బిల్లా .. సుల్తాన్ .. ఫాస్ట్ గా వాటి గమ్యం వైపు పరిగితాయి..
బిల్లా సుల్తాన్ వైపు చూస్తూ వీడు వెజిటేరియన్ అయ్యి మన ప్రాణం తీస్తున్నాడు .. వీడికోసం మల్లి వేరే చోటకి వెళ్ళాలి.. అసలు పెద్ద టార్చర్ ఏమిటో తెలుసా.. వీడికి రోజు పప్పు కావాలి .. వీడి పప్పు రేట్ చికెన్ రేట్ కంటే ఎకువ అయ్యి సచ్చింది .. పప్పు దొరక పొతే.. మనము ఈరోజు చికెన్ ఎంజాయ్ చెయ్యలేం అన్నాడు బిల్లా .

చికెన్ చెసే వాలా ఇ౦టి ము౦దు కాపు కాసాయి. చాలా సెపు చూసి ఆ ఇ౦టి వాలు భొజన౦ చేసి పారెసిన ఎముకలు తీసుకొని అన౦ద౦గ బైరవ కొసమ్ పరుగున వచ్చారు. బైరవ ప౦తులు గారి ఇ౦టి ము౦దు ఉన్నాడు అన్ని చూసాడు. లొపకి వెల్లబొతు నొత్లొ ఉన్న చికెన్ ఎముక బయట
దాచి పెట్టి. వాడ్నె చూస్తున్న బిల్లా గాడి సైడ్ చూసి
"రెయ్ బిల్లా నేను దాచిపెట్టిన ఎముక తీసుకున్నవొ నీ ఎముకలు పదనాలుగు దేసాల కుక్కలకి దొరకు౦డ చేస్త" అన్ని భౌ భౌ భౌ అన్నాడు

పరిగెతుకు వస్తున బిల్లాకి నెమ్మది అన్నటు సైగ చేసాడు భైరవ. లొపల జరుగుతునది జాగ్రతగ వి౦టున్నాడు భైరవ. లొపల:

అయ్యా గారు ... మీరు అ౦గడి దగ్గర రావదు. ఎమి అయిన అవసర౦ ఐతే బాబుని ప౦పడి నెనే వస్తాను అన్నాడు. చెప్ప౦డి అయ్యగారు ఇప్పుడు ఎమి కావాలొ అన్నాడు. ఈ వె౦డి చె౦బు తీసుకొని ఒక ఐదు వ౦దలు ఇవ్వ౦డి అన్నాడు. ఐదు వ౦దలు తీసుకో౦డి అయ్యాగారు ఈ చె౦బు అవసర౦ లేదు అన్నాడు. ఈ విషయ౦ విన్న సుల్తాన్ గాడికి అన౦ద౦ ఎక్కువ డబుల్ అయి౦ది. ఐదు వ౦దలు ఉ౦టే ప౦తులు గారు ఎమి చెస్తారో సుల్తాన్ గాడికి తెలుసు. ఈ రొజు ప౦డగే అన్నుకున్నాడు మనస్సులో.

ప౦తులు గారు పప్పు తెప్పిచి , సా౦బారు చేయి౦చాడు. ఈ ప౦తులు పిసినారిరా సుల్తాన్ చూడు ఈరొజే పప్పు తెప్పిచాడు మల్లి సా౦బారు చేసాడు. పప్పు చెయ్యచు కదా అన్నాడు. ఎదో ఒకటి దొరికి౦ది అని ఆ సా౦బరే తిని సుల్తాన్ తొ కలిసి ఇ౦టి దారి పటారు.

చికెన్ తిన్న అన౦ద౦ తొ పాట పాడుతు వాల వె౦ట తోక అడిస్తునాడు బిల్ల.

రెయ్ సుల్తాన్ ఈ మనుషలకి అసలు బుర్ర లెదుర. సుల్తాన్ గాదు రెయ్ కాల ఎమిరా అన్నాడు . ఆ ప౦తులు జీవిత౦లొ పప్పు తప్ప తిన్నడు అయనకి పప్పు లేదు. ఆ రైతు ఎమొ రె౦డు నెల్లలకి చికెన్ కొన్నుకొగలిగాడు. ఆ నల్ల కాగితాలు కొస౦ ఎమెమొ చెస్తున్నారు. వీల్లకి చికెన్ , పప్పు చేసుకొవడ౦ కష్ట౦ . ఎవరొ చస్తే కుక్క చావు అ౦టున్నారు పిచ్చి మొహలు.. వీల్ల జీవితమే కుక్కల కన్న హీన౦గ ఉ౦ది

Monday, July 27, 2009

సుర్మా c.o కర్మ టీవీ




జాలము - తెలుగు సైట్ల, బ్లాగుల డైరక్టరీ


నా సైటు రివ్యూ చేయండి


నేను ఒక ప్రముక తెలుగు టీవీ లో రచన విభాగం లో పని చేస్తున్న రోజులో జరిగిని ఒక చిన్న తమాషా . ఆ రోజు నేను రాసిన మాటలే వ్యక్యాత కార్యక్రమంలో మాట్లాడపోతోంది. ఉత్సాహంగ వెళ్లి రంగుల పెట్ట ముందు కూర్చున్న.

బాగా గీకు హైలేసా ... గెట్టిగా గీకు హైలేసా... ఎంత గీకినా అరగదు మా "గోకు గోకు " క్రీం.
వాడండి ... గజ్జికి , దురదలకి దగ్గిరకండి "గోకు గోకు " క్రీం

(ఆ... ! వాడి ఉదేసం ఎంత దగ్గర అయీన వాళ్ళ మందు తో వదుల్తుంది అని కాబోలు.. ఏందో మన కర్మ )

తాళం వేసితిని గోలెం మరిచితిని
ప్రిస్క్రి ప్షన్ తెస్తిని మందులు మరచితిని
పెళ్లి చేసుకుంటిని కట్నం మరచితిని
.... ఇల్లాంటి మతిమరుపుకి కావాలి "జి౦గో -- బ౦గో " జ్యూస్ తాగండి మర్చిపోండి..

( వాళ్ళ జ్యూస్ గుర్తు చేస్తుంది అని కాబోలు )

----- తుస్స్, బుస్, డాం, డమాల్, డుమెల్ -------
( ఇదే మా కార్యక్రమం ... ఆ శబ్దాలు పేర్లు పడేటప్పుడు వచ్చే సంగీతం )

కర్మ టీవీ ప్రేక్షకులకు మీ వ్యా ఖ్యాత సుర్మా నమస్కారం . ఈ రోజు తెలుగు దినం .
( నా తదినం కాదా... ! నేను రాసింది తెలుగు బాష దినం )
అందుకే ఈ రోజు స్క్రిప్ట్ అంత మా రచ తాత తెలుగు లో రాసి సచాడు.
(రచయత తెలుగు లో రాసి ఇచ్చాడు ).
కార్యక్రమం మొదట్లో పెడదామా .
(..మొదలు పెడదామా)
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
"కర్మ టీవీ " మన అందరి "కర్మ" టీవీ
(ఇక్కడ కర్మ ని పని గ అర్ధం చేసుకుంటే.. ఎందుకు రాసారో వీసీగా అర్ధం అవ్తుంది )
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
మన మొదట కాల్ చెయ్య బోయే సంక (సంఖ్య ) రామ రావు గాడిది (గారిది ).
ఆహొ ...! రామ రావు గార ... (బతికించింది ) నేను మీ కర్మ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను ...
హలో ... ! ఎవరు మట్లేడిది . నేను రామ రావు నే అమ్మ.
నేను మీ అమ్మ కి కాదు రామ రావు గారు నేను "మీ కర్మ" టీవీ వ్యా ఖ్యాత .....
"మా కర్మ " దాక అర్ధం అయ్యింది తర్వాత ఏదో ... విక్యత అన్నో సక్యతో అన్నావు అర్ధం కాలేదు..

అదే రామ రావు గారు వ్యా ఖ్యాత అంటే యాంకర్ అని అర్ధం... నా పేరు సుర్మా .. సుర్మా బొపాలి
ఓహ్ ...! మీరా సుర్మా గారు ... నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి...
ఈరోజు తెలుగు దినం అంత తెల్గు లోనే మాట్లాడాలి ... ఫ్యాన్ అనకూడదు .. అభామని అన్నాలి... ( చూసే వాళ్ళ కర్మ.. అదే వినే వాళ్ళ కర్మ )

నేను మీకు రెండు ప్రశ్నలు విసురుత మీరు సమాధానాలు ఇటు ఫోన్లో తోయండి ...
( ఈ తెలుగు దెబ్బకి నేను రాసింది నేనే మర్చిపోయా)


మొదటి ప్రశ్నకి ముందు మీకు మా " కర్మ " టీవీ లో నచ్చిన కరక్రమం ఏమిటో చెప్పండి ...
నాకు అన్ని ఇష్టం సుర్మా గారు..
అల కాదు .. ఒకటి చెప్పండి...
అయితే ఉండడి అల్లోచించి చెప్తా
----మీరు స్కూల్ లో చదువుతూ ... మీ క్లాసు టీచర్ రమేష్ గారికి లైన్ వేస్తారు... ఆ సీరియల్ అంటే ఇష్టం
ఎంత బాగా చేసారండి దాంట్లో మీరు ... నేను నిజంగ మీరు స్కూల్లో చదువుతున్నారు అనుకున్న...తర్వాత తెలిసింది మీ అమ్మాయి మా అమ్మాయి .. కలిసి మెడిసిన్ చేస్తున్నారు అని...
కట్ కట్ ... లాస్ట్ లైన్ ఎడిట్ చేయండి ....

మీ మొదటి ప్రశ్న ... ఆ సీరియల్ లో నుంచే...

౧) రమేష్ గారు నన్ను ఫస్ట్ ఎక్కడ చూసారు ...
అ) మా అమ్మ ఒడిలో ఆ ) నేను చదివే కాలేజీ లో
ఇ) నా పెళ్లి చూపులో ఈ) మా పెళ్ళిలో

మీరు సమాదానం మా ఫోన్ లో తోయడానికి ఒక నిమషం మాత్రమే ఉంది. ...
నాపతి ఐదు ... సెకన్లు మాత్రమే ...
తీస్ సెకన్లు మాత్రమే...
పద హేను సెకన్లు మాత్రమే....

సుర్మా గారు .. ఆన్సర్ "అ )మా అమ్మ ఒడిలో".....

చివరి జవాబా... తాళం వేసేద ...
వేయండి ... గోలెం మరవదు...

మీ జవాబు నోటికి నోటి శాతం ఒప్పు
--- చాల గొప్పగా రాసారు రచయత . మిమ్మల్ని చూడగానే...రమేష్ గారికి పూర్వ జన్మ గుర్తుకు రావడం వెంటే ... మిమ్మల్ని ప్రేమించడం... సూపర్ సీన్ అండి అది...
--- నేను చాల కష్టపడి చేశాను ఆ సీన్ ...
మీ రండో ప్రశ్న ....

అప్పుడు నా వయస్సు ఎంత

అ) ౩ నేల్లలు ఆ) ౩ సంవత్సరాలు
ఇ) ౧౩ సంవత్సరాలు ఈ) ౧౬ సంవత్సరాలు

మీరు సమాదానం మా ఫోన్ లో తోయడానికి ఒక నిమషం మాత్రమే ఉంది. ...
నలబై వైదు ... సెకన్లు మాత్రమే ...
ముప్పు సెకన్లు మాత్రమే...
పద హేను సెకన్లు మాత్రమే....

సుర్మా గారు .. ఆన్సర్ "అ )౩ నేల్లలు".....
(రామ రావు గారు తప్పు చెప్పారు అనుకుంట్ట లేక పోతే .. చూడగానే ప్రేమ అంటే... ఆ సీన్ కి కనీసం ఒక పదహారు సంవత్సరాలు అయ్ వుండాలి కదా. అందులో సుర్మా చేసింది అంటే... ఆ మాత్రం ఉండాలి )
ఇదే చివర జవాబా ... నమకం వుందా...
తాళం వేసేద ...
అలాగే...

మీ జవాబు నోటికి నోటి శాతం ఒప్పు
(ఈ అమ్మాయి ఇందాక ఈ సీన్ తెగ చేశాను అన్నింది అప్పుడు మూడు నేల్లలు అయితే చేసేది ఏందీ. )

మీరు చెప్పిన జవాబులు అన్ని ఒప్పు .. మీకు మా "జి౦గో -- బ౦గో " రసం వాళ్ళు ఇచే జీవితాంతం ... ఉచిత రసం

ఇప్పుడు రామ రావు గారి కోరిక మేరకి .. మా సీరియల్ లోంచి ఒక పాత...

మీ "కర్మ" టీవీ వారి ...

చుం చుం చుం చూస్తాం ...
మీ అందరి అంతం చూస్తాం ....
రామ్ రామ్ రామ్ రాస్తాం ...
రికార్డ్లు తిరగ రాస్తాం...
తీం తీం తీం తీస్తాం ..
పదిహేను వేల ఎపిసోడ్లు తీస్తాం ...
లాస్ట్ లో మా తమ్ముడు కలిపిని పదాలు
=======
చాం చాం చాం చస్తాం ...
చుసిన వాళ్ళం చస్తాం ...
=======

రండో సంక కి కాల్ చేసే ముందు ఒక సారి ఇరగ కొట్టండి ... ( బ్రేక్ )

తలుపు తీస్తే తంతా....
కిటికీ తీస్తే తంతా....
అన్ని మీ భార్య అంటుందా .... వెంటే ఇవ్వండి ... పాయిసన్
ఒక సారి పాయిసన్ వాడితే ఇక్క మీ భార్య మీకు అడ్డం రాదు.....

పాయిసన్ ... దోమల మందు వాడండి ...
చల గాలి ఆనందంగ ఎంజాయ్ చేయండి ...

మీ పిల్లవాడు అన్నం తిన్నట్లేదా....
మీ ఆయనకి అరగడం లేదా ...

వెంటనే వాడండి ... "తుప్పల వారి ఆముదం"
మీ ఆయనకి అరుగుతుంది...
మీ పిల్లవాడికి ఆకలి వేస్తుంది

"తుప్పల వారి ఆముదం"-- తుప్పు వద్దుల్తుంది

----- తుస్స్, బుస్, డాం, డమాల్, డుమెల్ -------
ఇరగ తీసిన తర్వాత ఇదే మా స్వాగతం... మీ సుర్మా బొపాలి ...
రండో సంకకి కలపండి....

ఆహో ..! పుల్లయ్య గార అండి ... నేను మీ "కర్మ " టీవీ నుండి సుర్మా బొపాలి ని ...
హలో ... ! పుల్లయ్య గారు ... సచారు అండి ... మీ ప్రోగ్రాం నుండి ఫోన్ వస్తుంది అని ... చూసి చూసి ..

పుల్లయ్య గారు ,,, చనిపోయిన౦దుకు ... బాధ గ వున్నా ఆయన మా ప్రోగ్రాం కోసం వేచి చూసి చనిపోయారు అని చెప్పారు ఆనందంగ వుంది ..
ప్రోగ్రాం కోసం వేచి చూసి చనిపోలేదు ... ప్రోగ్రాం చూడలేక చనిపోయాడు ... సచ్చినోడు... రిమోట్ పోయిన్నపడి నుంచి ... వద్దన మీ "కర్మ " టీవీ చూసి మా "కర్మ " కాల్చాడు ...

ఆహొ ... ఆహొ ... కట్ అయ్యింది వేరే సంక కి చేదం...

ఆహో ... సుత్తి రావు గార ...
హలో ... నేను వాళ్ళ అబ్బాయి నండి..

నేను మీ "కర్మ" టీవీ నుంచి కాల్ చేస్తున్న ఆయనని పిల్లుస్తారా...
కష్టం అండి... అయన వచ్చే పరిస్థిలో లేరు ...

అయ్యో చాల తక్కువ మందికి వస్తుంది అండి అవకాసం ...పిల్లవండి
మీ కర్మ.... అదే మా ఛానల్ పేరు ...
నాన్న .. నాన్న నీకే ఫోన్...

ఆహొ.. ! పెంటయ్య గార... నేను మీ "కర్మ" టీవీ నుండి కాల్ చేస్తున్నాను ...
చేస్తే.. నాకు ఏమిటి ..
మా "కర్మ" లో కార్యక్రమాల గురించి కొని ప్రశ్నలు వేస్తాం .. చెప్పాలి
మీ కర్మ గురించి ... నేను చెప్పాలా ... అడగండి .. నా కర్మ..

కర్మ టీవీ మీరు ఎప్పుడు చూస్తారు ..

ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ... మద్యహ్నం ఒకటి నుంచి మూడు వరకు ... సాయంకాలం తొమ్మిది నుంచి పడి దాక...

ఆ సమయం లో మా "కర్మ" లో ఏమి రావు కదండీ ...
అందుకే కదా చూసేది...
మీరు బాగా జోక్లు వేస్తారు పెంటయ్య గార.
చిన్నపటి నుంచి నేను అంతే....

మీ జోకులకి ... మీ ఇంట్లో వాళ్ళు బాగా నవ్వుతారా...
లేదు ఏడుస్తున్నారు ... నా టాలెంట్ తెలియక...
ఏమి చేసారు ....
రేయ్ ... ! నేను చెప్ప్తే విన్నావా ... నేను ఇంకా వెళ్ళాను రా..

ఒక రెండు నిముషాలు బాగా శబ్దాలు వచ్చాయి ...
హ్హ ... హూ ... కొరకదు.... అది .. అది .. కత్తి కాదు ... సూది.....

ఆహొ ఆహొ ... ఏమి జరుగుతుంది .. అక్కడ...
హలో ...! మా నాన్న వెళ్ళిపోయారు అండి....
ఏమయింది ... ఆ శబ్దాలు ఏమిటి...
ఏమి లేదు అండి... మా నాన్నని పిచ్చి ఆసుపత్రికి తీసుక వెళ్తున్నారు...

ఎందుకు అన్ని అడ్డగాలి అనుకోని... ఆగిపోయింది ... సుర్మా బొపాలి...

చివరిగా పాత సినిమా పాత విన్నండి...

అయ్యో అయ్యో అయ్యో... ఎందఱో మేచారో అయ్యో
కుయో కుయో కుయో... కొందరు చూసారు అయ్యో
అప్పో అప్పో అప్పో ... అన్నారు పిల్లలో అయ్యో
తుప్పో తుప్పో తుప్పో ... వదిలింది అందరి తుప్పో...






కొస మెరుపు
=======
ఈ కార్యక్రమం చూసాక నేను పుల్లయ్య గార్ని కలిసాను ... పరామర్శించడానికి కాదు... ఆయనతో కలిసి ... శేష జీవితం .. పిచ్చి ఆసుపత్రిలో గడపడానికి

Tuesday, July 21, 2009

ఒక కోడి కధ

అనగననగ ఒక మారు మూలా కుగ్రామం . ఆ ఊరి పేరు నిద్రపాలెం. అదే మా ఊరు.

మా ఊరి కోడి పేరు సునామి.మా ఊరి రైతులకు మంచి ఐకమత్యం. అందరు కలిసి ఒకే సరే మా ఊరు వదిలి పారి పోయారు. ఎక్కడికి పారిపోయారు అంటే కొందరు నరకం అంటారు , కొందరు స్వర్గం అంటారు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళిన మమల్ని మా ఊర్లో కంటే ఆనందంగానే వుంటారు . ఏమి అయిన అనుమానలు వుంటే మా అధ్యక్షుడ్ని అడగండి.. (అద్యక్ష . ఇది నేను తీవ్రంగ కండిస్తున్నాను... ఇది ప్రతిపక్షాల కుట్ర మాత్రమే అని సభా పూర్వకంగ మనవి చేస్తున్నాను )

సరే ఈ రాజకీయం వదిలి మన దారిలో వెళ్దాం. ప్రతిపక్షం కుట్ర కొంచెం , రైతుల నిరసన కొంచెం కలిసి మా ఊరి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టింది. అదే కోడి వేట . మా ఊరి సాకహరులు అంత కలిసి చేపల చెరువు కబ్జా చేసారు. వాలకి ఏదో చిత్రంలో రమాప్రభ గారు అనే మహానటులు వాటిని జల పుష్పాలు అంటారు అని చెప్పింది మేము చచాము ...

ఇక చేసిది లేక వారి దౌర్జన్యం ఆపే దిక్కు లేక మేము కోడి వేట మొదలు పెట్టాం . మిగతా జంతువులు మా రైతులన్కంటే కొంచెం ముందే ఊరి నుంచి బయటకు వెళ్ళే దారి తెలుసుకున్నాయి. అంత మొన్న వచ్చిన కొత్త రోడు మహత్యం. కోడ్లు మాత్రం ఎందుకు మిగిలాయి అని చాల ఆలోచించం . ఎంత ఆలోచించన మాకు అర్ధం కాలేదు. ఇప్పుడు ఆ రోడు వెతుకుతూ వెళ్ళిన ప్రతి వ్యక్తిని మేము ఎంతో ఆనందంగా సాగానంపుతున్నాం. మల్లి కోడి వేటలో పోటి రాడు కదా.

కోడ్లు, కోడు గుడ్లు దొరికినవి దొరికినట్టు తినేసం. అప్పుడు మాకు శాకాహారులకు మధ్య యుధం మొదలయింది . ఇక జలపుష్పలలో మాకు భాగం కావాలి అని మా వర్గం వాలు, కుదరదు అని ప్రతిపక్షం వాళ్ళు.నేను బయట వుండి అందర్నీ ఆ యుధంలోకి తోసాను . అప్పుడు మా అమ్మ నీ తల్లా పెద్దది నీకు తెలివి ఎకువరోయి అన్నింది.

వెంటనే నేను ఊరు అంత అరచుకుంటూ తిరిగా "నాకు తెలిసిపోయిందోచ్" అని. ఏమి తెలిసింది అని ఒక వేదవ కోడా అడగలేదు . సరే మీకు ఆయన చెప్తా వినండి. మా తాత చిన్నపుడు నన్ను కోడి తలకాయ, కోడి తలకాయ అని తిట్టే వాడు అంటే నేను తేలేవి లేని వాడ్ని అని ఆయన అర్ధం. నాది ఇంకా కోడి తల కాదోచ్.....

ఈ యుధం కతులు, కటార్లు, బాణాలు , తుపాకిలు లేకుండ చాల విషయలలో మంచి చేసింది. ఇక నుండి వీరిగాడు , రంగిగాడు , పోల్లమ , వేంకటేశు , రవనయ్య వాళ్ళ ఇళ్ళలో ఎవరికీ భోజనం పని లేదు .... నేనే వీల్లని యుద్ధానికి పంపింది. మరి ఏమి అనుకున్నావు ... ఈ కోడి తల అంటే... (నేను కోడి తల కాకపోయినా , నాకు ఆ పేరు నచ్చింది ... ఎవరైన అడిగితే దానికి అర్ధం నేను ఒక్కడినే చెప్పగలను కదా)

నా తెలివికి నేను ఆనందించే లోపల ఒక భయంకరమైన పరిణామం , అందరు ఒక షరతుకు వచ్చారు.... (నా కోడి మెదడుకు పని లేకుండానే )
అది ఏమిటంటే ....
౧) మేము మా వూర్లో కోడ్లు లేవు అని శాకహారులను నమ్మించాలి, దానికి మాకు ఒక రోజు గడువు . అల నీరుపిస్తే రోజు శాకాహారుల పట్టే ప్రతి నాలుగు పుష్పల్లో మాకు ఒకటి మేము పట్టే ప్రతి నాలుగు పుష్పల్లో వాళ్ళకి రెండు
౨) అల కాక ప్రతిపక్షాలు ఒక కోడి ఆయిన బ్రతికి వుంది అని నిరూపిస్తే మాకు ఏమి దొరకవు.

మా పక్షం వాలు అంత కలిసి ఉరంత తెగతిరిగి ఒక కోడి కోడా లేదు అని తెగేసి చెప్పారు. అప్పుడే ఎవరో మాయల మాంత్రికుడు చేతిలో ఒక పెట్ట పటుకొని మా ముందికి వచ్చాడు. ఆ మాంత్రికుడి చేతిలో ఉన్నది మా భావిష్యతు సర్వనాశనం చేసింది, అది ఏమిటంటే నడుస్తున్న, పరిగెడుతున్న , ఎగురుతున్న ఒక కోడి. నా కోడి మెదడుకి అర్ధం కానీ ఒక భయంకరమైన విషయం ఏమిటంటే ఈ కోడి మా ఎదవలకి ఎందుకు దొరకలేదు . మా ఎదవలది కోడి కంటే చిన్న మెదడ అని .

అప్పుడే నా కోడి మెదడుకి ఒక అపూర్వ మైన ఆలోచన వచ్చింది. ఈ కోడిని పటుకొని నేను తినాలి అని . అప్పుడు పక్కన పోతున వాడు అందుకే నిన్ను కో.మె అనేది అన్నాడు. నా పేరు వీడికి ఎలా తెలుస అని ఒక క్షణం ఆలోచించ. ఈ ఆలోచనలలో నా కో.మె వేడి ఎక్కింది, తటుకోలేక అల ఒక కునుకు తీసా.

నిద్రలేచే సరికి ఉరంత అల్లకల్లోలం. కోడి వేట లో . అది ఎవరికీ దొరకుండా తీరుగుతోంది. ఇక్కడ నేను మీకు మా కోడి గత చరిత్ర అంటే మీ బాష లో "ఫ్లాష్ బ్యాక్ " చెప్పాలి .

ఆ కోడి ఇండోనేసియా లోని తుప్పలపాలెం అనే ఒక పెద్ద నగరం లో పుటింది . అది పుట్టగానే కోడ్ల జాతి అంత ఒక బీకరం అయిన అట్టహాసం చేసాయి. ఇది అర్ధం కానీ ఆ ఊరి ప్రజలు ఆ చుటుపక్కల వున్నా కోడలని అంత చంపేసి పండగ చేసుకున్నారు. వారి కళ్ళు కపి ఒక మూలగ నకి చూస్తున్నదే మన కోడి. అప్పుడే శభద్ధం చేసింది ఎలాగైన పగ తీర్చుకుంటాను అని. రిక్షాతొకి, క్యారెజిలు మోసి రాత్రులు ప్రయోగాలు చేసి ఎంతో కష్ట పడింది . ఆ ప్రయత్నం లోనే ఒక కొత్త విషయాం కనుకుంది. అదే బర్డ్ ఫ్లూ . అంతే ౩ నెల్లల పసి ప్రాయం లోనే ఒక వంద మంది మనుషులని బలి తీసుకుంది .

కొడ్లందరూ కలిసి దాని గౌరవం గ "డాన్" అన్న అని పిల్లవడం మొదలుపెట్టాయి. ఈ డాన్ ని చూసి పాత డాన్ కాలి చికెన్ గా మారి తందూరీ రాత్రులు హోటల్ ప్లేట్ లో తేలింది. ఇది విన్న పాత డాన్ కొడుకు ఆవేశం గా కొత్త డాన్ కి ట్రాప్ పెట్టాడు. వెల్లి సముద్రంలో దూకి దాని అడుగున ఒక పెద్ద బొక్క పెట్టాడు. ఈ విషయం తెలిసన మా కొత్త డాన్

"ఈ డాన్ కోడి ని చంపడం నీకు ఇష్టం కానీ అది చాల కష్టం " ... .. అన్నింది

కళ్ళలో నీలతో "మా డాన్ కోడి నాన్నని చికెన్ గా మార్చిన నిన్ను వదలను" ... అన్నాడు పాత డాన్ కొడుకు

"చిన్న...! నన్ను పట్టు కోవడం పది వీదుల మనుషల వల్లే కాలేదు నువ్వు ఎంత జుజుబి " .. అన్నింది

అప్పుడే ఆవేశం గా తను సముద్రం లో తవిన గుంటలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు పాత డాన్ కొడ్డుకు.

హ హ హ అన్ని నవ్వే లోపలే అక్కడ సునామి వచ్చింది .... ఆ సునామి లో కొట్టుకొని కొట్టుకొని వచ్చి మా వూర్లో పడింది ..

ఈ సునామి, ఆ కోడి వచ్చిన తర్వాతే... మా ఉరిలో ప్రజలు గుంపులు గుంపులుగా పారిపోయారు ( నా కో. మె కి తెల్లిసిన౦ త వరకు నరకానికి ) . అందుకే దీనికి సునామి అని పేరు.

ఈ డాన్ కోడి ని పట్టు కోవడమే మా జీవిత ఆశయం ఇప్పుడు . భారతం లో లాగా పద్మవ్యూ హాలు , ఇక్బాల్ లో లాగా చక్ర వ్యూహాలు అని చేస్తున్నారు. నేను మాత్రం ఏమి చేయాలో నా కో. మె తో అల్లోచిస్తున్న. ఇలాంటి విషయలో నా కో. మె పామ్ఆయిల్ కంటే ఫాస్ట్ గా పని చేస్తుంది.

నేను ఎలాగైన దాని నా దగ్గరకి ఆకర్షించాలి అని ప్లాన్ వేసా. అది దగ్గరకి రాగానే నేను చిన్ననాటి నుంచి ఉ తకుండా వాడుతున్న నా అంగ వస్త్రం వేసి దాని మతులోకి పంపిస్తా. (ఊరంతా కో. మె కో. మె కో. మె కో. మె అని ఎకో వినిపిస్తున్ది అప్పుడు )

చక్రవ్యుహాలు , పద్మవ్యుహాలు దేనికి చిక్కకుండా వుంది సునామి . నేను నా ప్లాన్ ఆచరణలో పెట్టడానికి సంసిద్దమయను. ఉరంత సౌండ్ సెట్ లు అర్రంజే చేశా. నన్ను పిచ్చోడి లాగా చూసారు అందరు.

ఆ మైక్ ఈ చివర నిల్లపడి స్లో గా...
"కో కో కో ఇక్కడ కోడి వెయిటింగ్ ఒక పుంజు కోసం
రా రా రా ముందుకు రా ఇది నిజం కోడె పాడేది నీ కోసం
లే లే లే లేట్ చేయకు ఓ నా ప్రాణం " అని పాట పాడ ... "పుంజును పిలిచేటప్పుడు కోడి లాగా"
నా ప్లాన్ పని చేసింది నాకు సమాధానం వచ్చింది .. ...
" ఇక్కడ వుంది పుంజు కాదు ....ఓ కో మె ఇది ఒక కోడి రా" అని ...

ఇప్పుడు మల్లి కోడి కి పాట రాయాలి అంటే చంద్ర బోస్ అన్న కావాలి అని పాట ప్లాన్ మార్చేసా. ...

" నీకు దమ్ముంటే నువ్వు వచ్చింది తుప్పలపాలెం నుంచే ఐతే నువ్వు ఆ ఊరు డాన్ వె అయితే నా ముందుకు రా " అన్ని ఒక భయంకరమైన ఛాలెంజ్ చేశా.... ఈ ఐడియా కి నాకే ముచ్చటవేస్తోంద

ఒక గంట వెయిట్ చేశా నో రిప్లై .ఛా .... ఈ కోడి డాన్ కి రూల్స్ తెలియవు ... తెలుగు సినిమా చూపించాలి అన్నుకున్న...

ఇంకా కోపం తో నా నేతురు కరిగి పోతుంది . (మరిగి పోతుంది అని ఏమో లే వీడి బాధ )

కోడి గురించి వున్నా అన్ని పాటలు గ్యాప్ లేకుండా వినిపిస్తున్న .... ఏదో ఒక రాక్షస ప్రయత్నం గా . ...

ఎంత అయిన కో మె కదా నా లాగే తెలివి ఎక్కువ . అప్పుడే నాకు భయంకరమైన ఐడియా వచ్చింది . వెంటనే

మైక్ దగ్గరకి పరిగితుకుంటూ వెల్లి ....

"డాన్ కోడి గారికి నేను ఒక లాయర్ ని .... నాకు తెలిసిన౦తవరుకు .. మీ ఫ్లాష్ బ్యాక్ లో "తుప్పలపాలెం" లో మీకు జరిగిన ఎన్నో విషయాలు హిందీ సినిమా డాన్ లోను తెలుగు డాన్ లోను వాడు కున్నారు అందుకని మీ తరఫున వాదించటానికి నాకు అవకాసం ఇవ్వ వలసిందిగా కోరుతున్నాను " అన్ని అన్నౌన్సుమేంట్ ఇచ్చి తిరిగి చూసే లోపల డాన్ కోడి నా ముందర ప్రత్యక్షం అయ్యింది.

"ఈ డాన్ కొడినే మోసం చేస్తారా ... ఎక్కడ పెట్టాలి సంతకం అన్నింది "
ఇక్కడ అని ... చూపిస్తూ పట్టేస కోడిని....

డాన్ కోడిని పట్టిన నన్ను డాన్ మనిషి గా మా వాళ్ళు బిరుదు ఇచ్చి ఆ రోజు పండగ చేసుకున్నారు...

రేపటి నుంచి నేను కోడా " జల పుష్పాలు " తిన్నచు అన్ని ఆన౦దగ నిద్ర పోయా ....


కొస మెరుపు:
------------------------
పక్క రోజు కోడి కుతకు నిద్ర లేచిన నాకు ... మా వాలు, శాకహరులు మల్లి గొడవ పడే దృశ్యం కనిపించింది ... చివరి కోడి చచ్చింది కదా ఇంకా ఎందుకు గొడవ అని నా కో.మె ఆలోచిస్తోంది... అప్పుడే మా మామ లేచి ఎవడ్రా నన్ను లేపింది అని అరుస్తున్నాడు ... అవును ఎక్కడిది ఈ కోడి కూత అన్ని వేతుకుంటున్న నాకు ఒక మెసేజ్ వచ్చింది ... "మా అమ్మ ని చంపిన నిన్ను వురికే వదలను .. వదల కో. మె. వదల " --- డాన్ II