Monday, July 19, 2010

వంట .. తంటా

ఒకటి రెండు .. మూడు ... నాలుగు .. .... రెండు వందల పదహారు . .. రెండు వేల నూట డబ్బయి ఏడు.. అని నా ముందు క్యూలో ఉన్న వాళ్ళని లెక్కపెట్టుకుంటున్న.

ఇంతలో ఎవడో నారాయాణ్ ... నారాయాణ్ అని అరుస్తూ నన్ను డిస్ట్రబ్ చేస్తున్నాడు. ఒక చేతిలో గిటారు , రెండో చేతిలో ఐపాడ్ ,చెవిలో హెడ్ ఫోన్స్, చిరిగిపోయిన జీన్స్ వేసుకొని అప్పుడే పెంచిన సిక్స్ పాక్స్ చూపించేలా షర్టు లేస్స్లో వస్తునాడు నారాయణ నారాయణ అంటూ. అలా నా ముందు నుండి వెళ్లిపోతున్నాడు .

వెంటనే నా ప్యాంటు చించేసి చొక్కా విప్పేసి " నారాయణ ... శ్రీ చైతన్య .. రత్నం ... " అని అనుకుంటూ అయన వెనకాలే వెళ్ళ , క్యూలో వెయిట్ చేసే పని తప్పుతుంది అని.

ఆ గిటార్ వ్యక్తికి ఏమి అయ్యిందో తెలియదు కాని వెన్నకి తిరిగి "దుష్టుడా ... నా నారాయణుడ్నికాదని ఈ చైతన్య , రత్నం ఎవడు రా అందులో నా వెనక వస్తునావు ఏమిరా పాపి అన్నాడు "

అబ్బా చిలిపి ఇక్కడ నేను ఒకడినే కాదు నువ్వు కూడా పాపివే .. లేకపోతే, నీకు నరకం ఏమైనా అత్తగారి ఇల్లా.

ఆ గిటార్ వ్యక్తి "ఆమంగళము ప్రతిహతమువ్గాక " రేయి పాపి నేను కటిక బ్రహ్మచారినిరా నాకు అత్తవారి ఇల్లు ఏమిటి రా మూర్కుడా అన్నాడు.

బ్రహ్మచారివో కాదో పాపివే కదా…!

కాదురా “పాపి మానవ” నేను నారదుడ్ని రా

ఆబ్బ మేము కూడా చాలా పాత సినిమాలు చూసాం నారదుడు ఏమి గిటార్ పట్టుకొని , సిక్స్ పాక్స్ తో ఉండడు

దానికి నారదుడు, నువ్వు ఎక్కడో విట్టలచారి రోజులోనే ఉండిపోతే ఎలా అది ఓల్డ్ ఫ్యాషను . లేటెస్ట్ మోడల్ గిటార్ , ఆపిల్ ఐపాడ్ అన్నాడు

ఇంతలో ఎవడో రాక్షసుడు వచ్చి ఒక అర గంట లంచ్ బ్రేక్ , లైన్ కదలకుండా ఏమి అయిన తినండి అన్నాడు.

వాడు చెప్పి వెళ్ళగానే ఒక బాచ్ రాక్షసులు వచ్చి "సమోసాలే , జామకాయలే , శేనకాయలే " అని అరుస్తున్నారు ఇంకో బాచ్ వచ్చి " పులిహోర , పెరుగన్నం , బిరియాని " అని అరుస్తున్నారు

మర్యాద కొద్ది "నారదుల వారిని " ఏమి అయిన తింటార సార్ అన్న

వద్దురా అర్బక వైకుంటంలో పార్టీ ఇప్పుడే బాగా తిని వస్తున్నా .

ఆత్రం కొద్ది దేనికి స్వామి పార్టీ అని అడిగా .

ఈ రోజు లక్ష్మి దేవి పుట్టినరోజు రా అన్నాడు. ఒరేయి పాపి , నువ్వు కూడా ఏమి తినకు రోయ్ పాచిపోయిన అన్నం , మాడిపోయిన కూర అవి తింటే మల్లి పోతావ్ అన్నాడు సున్నితంగా. సరే గాని ఈ విషయం చెప్పు నువ్వు చూస్తె ఇంత లేతగా ఉన్నావు , ఒక్కడివే దాసరి నారయణ రావు సినిమాకి వెళ్ళే వయస్సు కూడా రాలేదు నువ్వు ఎలా వచ్చావు, అదే చచ్చావురా

అదా గురువు గారు , నేను పూర్తిగా విషయం తెలుసుకోకుండానే తల దూరుస్తా . అది ఇందాక మీరే గమనించారు . అలాగే ఒక రోజు ఏమి అయ్యింది అంటే అందరు కరెంటు ప్లగ్లో వేలు పెట్టి షాక్ కొడుతుందా లేదా అని చూస్తున్నారు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వు వచ్చింది. ఆపండిరా మీ ఆటలు అన్న

మంచి పని చేసావు కదారా పాపి మరి ఏమి అయ్యింది

ఇంకా ఉంది గురువు గారు , వేలు పెట్టె ముందు స్విచ్ వేయాలి కదారా అని స్విచ్ వేసా .

ఆ తర్వాత .... ! ఏమి అయ్యిందిరా

ఏమో నాకు తెలియదు స్వామి కళ్ళు తెరిచేసరికి ఈ క్యూ చివర ఉన్న.

సరే వచ్చావు , అదే చచ్చావు కాని నరకానికి ఎందుకు వచ్చావురా . ఏమి తప్పులు చేసావు చెప్పు

నేను ఏమి తప్పులే చేయలేదు స్వామి , కాని ఇక్కడకి ఎందుకు వచ్చానో నాకు తెలియట్లేదు అది తెలుసుకుందామనే చూస్తున్న. ఈ లైన్ చూస్తే ఇంత పోడుగుంది.

ఒరేయ్ పాపి నాకు అబద్దాలు చెప్పకు నేను ఇప్పుడే నీ బయో-డేటా మొత్తం సంపాదిస్తా అన్నాడు . 

నిజం స్వామి కావలి అంటే మీరు వెరిఫై చేసుకోండి అన్న.

రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని , హా ఏమి చేయలేదు దుర్మార్గుడా . నిజంగా మంచివాడివి అనుకున్న కదారా .

అలా అర్థం కాకుండా తిట్టకండి, విషయం చెప్పి తిట్టండి స్వామి

నువ్వు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశావా లేదా, రోజు అబద్దాలు మాత్రమే చెప్పవా? లేదా? నీకు తెలుగు వచ్చి కూడా , ఇంగ్లీష్ లోనే మాట్లాడావ లేదా? ఇలా వరసగా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు .…… (నేను ఏమి చెప్పలేదు)ఇంతలో , ఆగు ఆగు ఇవ్వని వార్ని౦గ్స్ మాత్రమే ఇవ్వి పాపల చిట్టాలోకి రావు అన్నాడు. కొంచెం కుద్దుటపడ్డ.

ఇంతసేపు ఏమి చేసిందో నా ప్రాససర్ , సడన్ గా పని చేసింది మరి ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను స్వామి అన్న.


అదే నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సరే నేను చూసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు "సిక్స్ ప్యాక్ నారద"

ఒక పది నిమిషాల తర్వాతా వచ్చి చాలా క్లిష్టం అయిన పని చెప్పాడు ఆ యముడు అది చేస్తే నీ వార్ని౦గ్స్ అని ఎరెజ్ చేస్తాను అన్నాడు

అంటే నేను తిరిగి భూమికి వెళ్ళచా అని అడిగా. అది కూడా ట్రై చేద్దాం కాని .. అని ఆగాడు .

చెప్పండి స్వామి ఏ పని అయిన చేసేస్తా అన్న ఆవేశంగా

సరే నెక్స్ట్ పది రోజులకి నరకం వంట అంత నువ్వు చేస్తే వదిలేస్తాను అన్నాడు

అదేమి ఉంది వీజీ , నాకు వంట బాగా వచ్చు కుమ్మేస్తా అన్న. “కాని..!” అని ఏదో చెప్పబోతుంటే వినకుండా ఆయనని తీసుకొని లోపాలకి వెళ్ళ. అక్కడ ఒక వ్యక్తి రివాల్వింగ్ చైర్ లో కూర్చొని లాప్ టాప్ లో ఏదో పని చేస్తున్నాడు అతనికి కొంచెం దూరంలో , ఒక మెత్తటి సోఫాలో ఒక వ్యక్తి పడుకొని కనిపించాడు. 
వెంటనే స్వామి  ఇదే బాగా ఉంది కదా హ్యాపీగా ఈ సోఫాలో నిద్రపోకుండా కిందకి వెళ్లి ఏమి పీకాలి అన్న. 

గెట్టిగా అరవకు , ఆయన విన్నాడో నానో టెక్నాలజీతో కొడతాడు . ఆయన యముడు, ఈయన చిత్రగుప్తుడు, పాపుల క్వార్టర్స్ వేరేరా సుంటా.

వెంటనే వినయం నటిస్తూ వెళ్లి ఆయన దగ్గర నిలబడ్డ . నమస్కారం సార్ .. యముడు గారు అన్న.

ఆయన లేచి “ఏమి అన్నాడు "

యముడు గారు మీరు చెప్పినట్టే వంట చేస్తాను అన్న.

నారదుల వారికి వంట రూము దారి చూపించమని చెప్పారు ఆయన వంట రూము దాక వచ్చి చెవిలో ఏదో చెప్పారు .ఆ ఉత్సాహంలో సరిగా వినపడలేదు.

సరే ఇక నేను వెళ్తున్న అని వెళ్ళిపోయాడు.

=== మూడు రోజుల తర్వాతా ===
ఒకటి రెండు .. మూడు ... నాలుగు .. .... రెండు వేల పదహారు . .. ఇరవై వేల నూట డబ్బయి ఏడు.. అని నా ముందు క్యూలో ఉన్న వాళ్ళని లెక్కపెట్టుకుంటున్న. ఇంతలో వినిపించింది "నారయణ ....నారయణ " అని. ఆయనకీ కనపడకుండా ఒకడి వెనకాల దా౦కున్న.

జిత్తుల మారి, చూసేసాడు. వచ్చి ఎప్పుడు వచ్చా లైన్లోకి అని అడిగాడు .

ఒక పది నిమిషాలు అయ్యింది స్వామి అన్న.

రెండు రోజులకే ఎలాగారా ??

నా వంట నచ్చి .. అన్న .

అదేమిటిరా .. ?

ఏమి ఉంది స్వామి మామూలు కన్నా నాలుగింతలు తిన్నారు .. దాంతో.

సరేలే ఏమి చేస్తాం గ్రహచారం, తక్కువ శిక్ష వేస్తాడులే .

అయిన మిమ్మల్ని అనాలి స్వామి “వంట అయితే ఎలాగో చేస్తాను. వంట సామన్లు కూడా నన్నే కోనమంటే నేను ఏమి చేస్తాను”.

అందులో పప్పు లేనిదే ముద్దా దిగట్లేదు యముడు గారికి
ఆ చిత్రగుప్తుడికి లాప్ టాప్ పక్కన పెట్టుకొని తాగడానికి దాల్ సుప్
బ్రేక్ బ్రేక్ కి యముడి గారికి జీడి పప్పు ఫ్రై
చిత్రగుప్తుడికి ఫ్రై చేయని బాదం పప్పు

ఈ యమ బట్టులకి టమాటో రసం , ఆ టమాటో ఏమో అరవై రూపాయాలు అయ్యి కూర్చుంది

అయిన నువ్వు రెండు రోజులు ఉన్నావు అంటే గొప్పేరా పోయిన సారి ఒక్కడు ఒక రోజుకే డమాల్

ఎక్కడ స్వామి ఉన్న రెండు కిడ్నీలు అమ్ముకుంటే ఈ పూట గడిచింది లేకపోతే నన్ను తినే వాళ్ళు ఆకలితో

మరి ఈ రోజు ఎలా తప్పించుకున్నావురా .

నాకు వంట నేర్పిన గురువు వచ్చాడు వాడ్ని పెట్టి వచ్చేసా


పక్కని వాళ్ళు చెప్పేది వినవు అని నిరిపించుకున్నావు రా .. ఆ రోజు నేను చెప్తూ ఉంటె పెద్ద పుడింగ్ లాగ ఫోస్  కొట్టావ్ ఇప్పుడు చూడు మళ్లి లైన్లోకి వచ్చావు.

అయిన ఇదేం కక్రుత్తి స్వామి , యముడికి ఫండ్స్ లేవా .

శివుడు కట్ చేసాడు వాళ్ళ డిపార్టుమెంటులో ఉండే వాళ్ళ వల్లే ఇంద్ర లోకం, బ్రహ్మ లోకం ఇలా అని లోకాలలో కరువు వచ్చింది అందుకే ఈ పనిష్మెంట్