Thursday, February 3, 2011

ముప్పై కోట్ల పంది

ఆ రోజు అమావాస్య , ఆదివారం నేను ఏదో మా ఆవిడ చేసిన అన్నంలో గోంగూర వేసుకొని టీవీలో చూపిస్తున్న ఉల్లిపాయలు నంచుకొని తింటున్నా. ఆ న్యూస్ రీడర్ సీరియస్ గా బాలకృష్ణ సినిమా హిట్ అయ్యింది , బ్లాక్ మనీ లెక్కలు బయటకి వచ్చాయి , ఉల్లిపాయ రేట్ తగ్గింది అని గెట్టిగా చెప్తునాడు



ఎక్కడో వంట రూములో ఉన్న మా ఆవిడ చంద్రముఖిలో రజనికాంత్ లాగా ఎగురుకుంటూ వచ్చి నా పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ ని కాలితో ఫుట్బాల్ కిక్ ఇచ్చి టీవీ తదేకంగా చూస్తోంది.
మీ గుండె మీద చేయి వేసుకొని నిజం చెప్పండి ఈ మాటలు విన్నాలి అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కదా అన్నాడు. నీరసంగా వెన్నకి వెళ్తున్న నా వైఫ్ నే చూస్తున్న. ఒరేయ్ వెధవ ఆశ పెట్టావు కదరా, నేను నిజం ఏమో అని హ్యాపీగా బాలకృష్ణ సినిమాకి వెళ్లి రిటర్న్ లో ఉల్లిపాయలు బాగా వేసిన మిరపకాయ బజ్జి తినాలి అనుకున్నా, నన్ను ఆశ పెట్టవుగా నీకు ఆశ కురుపులు వస్తాయిలే అని తిట్టుకుంటూ వంట రూము లోకి వెళ్ళిపోయింది.



వాడు కంటిన్యూ చేస్తూ.... మనం ఈ పరిస్థితిలో అల్లాడుతుంటే మన ఎం.ఎల్.ఏ గారు పంది కొన్నారు . పంది కొంటె ఏమి అయింది అనుకుంటున్నారా . ఆ పంది ముప్పయి కోట్లు అన్నాడు. బిజీగా భోజనం చేస్తున్న నాకు ముప్పయి కోట్లు అనగానే ద్రుష్టి అంత టీవీ వైపు మారింది. ముప్పయి కోట్ల పంది పై ఫోకస్ కోసం చూస్తూనే ఉండండి నిరంతర వార్త వాహిని "పరమ న. స. టీవీ " అని చెప్పింది టీవీ యాంకర్.



మా ఊర్లో మీ ఊరి మీసాలు తిప్పే అంత దైర్యం వచ్చిందిరా నీకు అని రెండు కళ్ళు ఎర్ర చేసి పరిగిస్తున్నాడు హీరో. కట్ చేస్తే అమ్మ వాడు చూడు మీసాలు తిప్పుతున్నాడు అన్నాడు హీరో .
చరిత్ర తిరగరాసే అమ్మ, కొడుకు సెంటిమెంట్ కోసం చూడండి వామ్మో .. వాయో ... ఓ పెళ్ళామో .



అప్పుడే హాలులోకి వచ్చిన మా నాన్న ఛీ .. దీనమ్మ జీవితం అనే టైపులో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి లోపాలకి వెళ్ళిపోయాడు.

ఇంతలో మళ్ళి వచ్చాడు మన న్యూస్ రీడర్. చూడండి ముప్పయి కోట్ల పండి కథ అన్నాడు. కట్ చేస్తే ఒక పల్లెటూరు . ఆకాశవాణి అనుకుంటా మాట్లాడుతోంది.

అనగనగ చిన్న కుగ్రామం , పేరు తూముగుంటలపాడు . ఆ కుగ్రామంలో తూములు గాని గుంటలు గాని లేవు. ఇంటింటి నుండి వచ్చే నీరు అంత వచ్చి ఒక చోట నిలబడేది . దాని పక్కన ఉన్న ఈ చెట్టే ఒకప్పుడు మన ఎం.ఎల్.ఏ గారి ఇల్లు. మాముల్గా అదృష్టం కుక్కలా తరుముతుంది అంటారు కాని మన ఎం.ఎల్.ఏ గారికి అదృష్టం పంది లాగా వచ్చి బురద చల్లి మరి అంటుకుంది. అప్పుడు మన ఎం. ఎల్. ఏ గారి వయసు పద్నాలుగు . పట్టరాని కోపంతో దాన్ని పట్టుకోవాలి అని దాని వెనుక పరిగితాడు . మన సగటు వోటర్ లా లాగా కాకుండా ఆ పందికి ముందే తెలుసు వీడి చేతిలో పడితే నన్నే కాదు నా పది తరాలను కోసుకొని తింటాడు అని ఎంతో వేగంగా పరిగితింది. కాని డెమోక్రాసి ఎంతో బలీయం అయ్యినది పందిని ఎం.ఎల్.ఏ పాలు చేసింది.

ఇక్కడ మొదలు అయ్యింది ఎం. ఎల్. ఏ జీవిత చక్రం, ఆ పందిని పట్టడం చూసిన ఒక వ్యక్తి దానికి వంద రూపాయలు ఇచ్చి తీసుకు వెళ్ళాడు. అప్పటి దాక ఉపయోగించకుండా దాచి ఉంచుకునా మన ఎం.ఎల్.ఏ గారి బుర్ర పని చేసింది. వెంటనే ఇంకో నాలుగు పంది పిల్లలు తెచ్చి పెంచాడు . నాలుగు నలబై అయ్యాయి , నలబై నాలుగు వందలు అయ్యాయి. మన ఎం.ఎల్.ఏ గారు కోటీశ్వరుడు అయ్యాడు. అలా వయసు గడిచింది పెళ్లి చేసుకున్నాడు ఒక ఇల్లు కట్టాడు .

ఆయన పోయినసారి ఎలక్షన్ లో చెప్పిన వీడియో చూసి తర్వాత ఏమి జరిగిందో తెలిసుకోండి.

డబ్బు వచ్చింది కదా అని వెళ్లి కారు కొందాం అనుకున్న. పట్టణానికి వెళ్ళగానే ఏమి కారు కావలె అన్నారు. నాకు పంది, గంజి తప్ప ఏమి తెలవదు . అదే గోనుకుంటుంటే ఆ అబ్బాయ్య ఉంది సారూ కారు మీరు అడిగిన కారు ఉంది అన్నాడు. ఓరి దీని తల్లి .. ! గంజి కారు కూడా ఉందా అని అదే తీసుకొని ఇంటికి వచ్చు౦డ్లా. ఆ వీడియోలో యాంకర్ కి డౌట్ వచ్చి అడిగింది గంజి కార అది ఏమిటి సార్ అని. బలే దానివే గంజి కారు తెలిదా ఇదిగో అని చూపించాడు ( అది బెంజ్ కి వచ్చిన తిప్పలు) . ఆ యాంకర్ ఎదురుగా ఉన్న వాటర్ గ్లాస్ చూస్తోంది. దాంట్లో దూకి చచ్చిపోవాలి అనే టైపులో ఎక్ష్ప్రెస్సిఒన్ పెట్టి ఒక నవ్వు నవ్వి తర్వాత ఏమి అయ్యింది సార్ అంది. ఆ కారు అక్కడ మొదట కొన్నది నేను అని ఆ పట్నం అంత తెలిసిపోయింది. అప్పటి దాక ఎవరికీ తెలియని మా ఊరు రాష్ట్రము మొత్తం తెలిసింది. వెంటనే మా ఊరికి కూడా ఒక అసెంబ్లీ స్థానం గా మార్చేసి నన్ను ఎం.ఎల్.ఏ గా పోటి చేయమన్నారు . దాంతో నేను ఎం.ఎల్.ఏ అయ్యిపోయిండ్ల. చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కూడా కక్కే లాగా ఎక్స్ప్రషణ్ పెట్టి ఇది ఈరోజు "మీ ఎం.ఎల్.ఏ ని తెలుసుకోండి " ప్రోగ్రాం అని చెప్పింది.

మళ్ళి కట్ చేస్తే , ఈ సారి పెద్ద బంగళా హైదరాబాద్ నగరం. మళ్ళి ఆకాశవాణి (సీరియస్ గా ఈ మాటలు ఎలా వస్తాయో గాలిలో నుండి ) . అలా మన ఎం.ఎల్.ఏ గారు మళ్ళి గెలిచినా తర్వాత మొన్న ప్రజలని ఆదుకోవడానికి ఏమి చెప్పాడో చూడండి. ఏమిటి ఈ ఆకలి చావులు నేను ఎలాగైనా ప్రజలని కాపాడలే . అది ఎలా చేస్తారు సార్ అని అడిగింది ఆ రిపోర్టర్. పంది అన్నాడు. ఎంత నేను ఇరవై కేజీలు ఉంటె మాత్రం మీరు నన్ను పంది అంటారా. కొంచెం ఒళ్ళు చేసాను మళ్ళి జీరో అయిపోతాను లెండి సార్ అంది. నేను నిన్ను పంది అనలేదు అమ్మాయో . పంది తో ప్రజల భవిష్యతు మార్చేస్తా . ఎలా సార్ అంది అమాయకంగా . ఏందీ అమ్మాయో నా కత నీకు తెల్దా ఏంటి. ఓ గుర్తు వచ్చింది సార్ అని కామెర వైపు తిరిగి పందే మీ భవిష్యతు అనింది ఆ యాంకర్.

మళ్ళి ఆకాశవాణి, దానికోసం పది కోట్లు సాంక్షన్ చేసేసా అని కూడా చెప్పాడు ఎం.ఎల్.ఏ. ఇక్కడే అసలు కధ మొదలు . వినండి ఆ ఊరి వారు ఏమి మాట్లాడుకుంటున్నారో



మొదటి వ్యక్తి: మా ఎం.ఎల్.ఏ పందుల పెంపకానికి పది కోట్లు లెక్కలో రాసాడు అమ్మ. సరేలే ఏదో ఒక దారిలో పెళ్ళాం పిల్లలకి కొంచెం గంజి పోద్దాం అనుకున్నాం . మూడు నేల్లలు ఆపీసు చుట్టూ తిరిగాం . ఇస్తాను, ఇస్తాను అని రోజు చెప్పారు .

యాంకర్ : అయితే ఒకరికి కూడా ఇవ్వలేదా

మొదటి వ్యక్తి: ఇచ్చారు అమ్మ ఒక్కటి అదే ఆ రవాణాయ్యకి ఆ స్కీమ్ ఓపెనింగ్ రోజు ఒక పంది ఇచ్చారు.

యాంకర్ : మరి లెక్కలలో పది కోట్లు కర్చుపెట్టాను అని చూపించాడే మరి లెక్కలలో పది కోట్లు కర్చుపెట్టాను అని చూపించాడే

రెండో వాడు : అమ్మ వీడు పెద్ద జాదుగాడు.ఈ పంది దగ్గరకి మొన్న వెళ్లి నా పొలం సెజ్ లో పోతుంది ఏమి అయ్యిన చేయమంటే . పది లక్షలు ఇచ్చి ఇంతే అన్నాడు అదే పొలానికి కోటి రూపాయలు వాడు గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాడు. ఆ పది లక్షలో నాకు రెండు లక్షలు లంచాలు బొక్క.

మళ్ళి కట్ చేస్తే అసెంబ్లీ లో మన పంది ఎం.ఎల్.ఏ గారి ముందు మైకులు .

యాంకర్: సార్ ..! ఆ పది కోట్లు ఏమి అయ్యాయి సార్
పంది ఎం.ఎల్.ఏ : అమ్మ ఆ పది కోట్లకి పందులు కొన్నాం అమ్మ
అక్కడ ఉన్న రిపోర్ట్ స్ అందరు ఒకే సారి : గీ బీ గ్యా బీ ... అని అరుస్తున్నారు

పంది ఎం. ఎల్ .ఏ : నిజమే అవ్వి వాళ్లకి ఇవ్వలేదు
యాంకర్ : అయితే అని పందులు ఏమి అయ్యాయి సార్

పంది ఎం. ఎల్ .ఏ : స్వై న్ ఫ్లూ వచ్చింది కనుకా వాటిని చంపెసం
పంది ఎం. ఎల్ .ఏ : స్వై న్ ఫ్లూ అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వంద కొట్లలో ఇరవై కోట్లు దీనికే ఖర్చు పెట్టాం

ఎప్పుడు వచ్చిందో చూడలేదు కాని నా వైఫు , నోరు తెరుచుకొని అంటే ఒక పంది కోసం ముప్పయి కోట్ల అంది .





పక్క రోజు పేపర్లో “తెలంగాణాకి అందని ద్రాక్ష ముప్పై కోట్ల పంది” ఈ వార్త చూస్తుండా? ముప్పై కోట్ల పందికి ఖర్చు పెట్టి తెలంగాణా వాటా ఏమి రాలేదు అంట. మన తెలంగాణా ఎమ్. ఎల్ . ఏ నిన్న అసెంబ్లీలో దులిపెసాడు. అసెంబ్లీలో ఏమి పన్లు జరగనివలేదు మామ
కొసరు :


ఇది వింటుండగానే , ఉన్నట్టు ఉండి నా మీద ఏదో చెయ్యి పడింది టక్కని చెయ్యి పడిన వైపు తిరిగా. ఎప్పుడు వచ్చాడో తెలిదు కాని మా పోలిటికల్ సైన్సు మాస్టారు నా పక్కనే ఉన్నాడు. రేయి అన్ని వింటున్నావు బాగానే ఉంది కాని ఏమి చేయాలి అనుకుంటూన్నావు అని అడిగాడు. ఆయన ఏమి అడిగాడో కాని నేను మాత్రం "అయోధ్య రామయ్య " సినిమాకి వెళ్తున్న అన్న. ఆకాశంలోకి ఉమ్మివేస్తే అంటూ వెళ్లిపోయాడు. టీ వచ్చింది, తాగేసి సినిమాకి వెళ్ళిపోయాం.

Wednesday, February 2, 2011

నా పెళ్ళాం ఊరెళ్ళిపోయి౦దోచ్

కిటికీ తలుపులు వేసారా , బీరువా తాళాలు వేసారా , పెట్టకు తాళం వేసారా ... ఇలా వరుసుగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది నా ముప్పావాంగి (కలికాలంలో అంతే సమాన భాగాలు ఉండావు ) మేము టాక్సీ లో వెళ్తుంటే. టికెట్ బుక్ చేసిన రోజు నుండి మిలీనియం క్లోక్ లెవెల్ లో కౌంట్ డౌన్ పెట్టుకొని మరి వేచిచూస్తునా ఈ రోజు కోసం. కౌంట్ డౌన్ జీరో అయింది కాని ఇంకా కొత్త మిలీనియం రాలేదు . ఇంతకి విషయం ఏమిటి అంటే పెళ్లి అయిన ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక నెల రోజులు నా ముపావు నన్ను వదిలి ఊరికి వెళ్తోంది.
ఈ మాట చెప్పగానే గొంగురలో ఉల్లిపాయ నంచుకొని తిన్నంత ఆనందం కలిగింది . ఆఫీసుకి వెళ్తూనే టైం టేబుల్ తయారు చేసేసా ఆ ముపై రోజులు ఏమి చేయాలి అని. ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలి , ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడాలి , ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలిచి ఒక మంచి సినిమా చూడాలి .. ఇలా క్యాలెండర్ మొత్తం ని౦పేసా . ఆ ఆనందంతో గెంతుకుంటూ , తుల్లుకుంటూ , గీకుంటూ , గోకుంటూ ఇంటికి వచ్చిన నాకు చేతిలో ఒక కాగితం పెట్టింది నా ముపావు


ఆది- చెత్త బయట వెయ్యాలి, ఎక్సర్ సైజ్, నాకు ఫోన్ చెయ్యాలి, మా అమ్మకి ఫోన్ చెయ్యాలి
సోమ-సాక్స్ ఇన్నర్ వేర్ ఉత్తుకోవాలి,ఎక్సర్ సైజ్ నాకు, ఫోన్ చెయ్యాలి, మా నాన్నకి ఫోన్ చెయ్యాలి
మంగళ-పనిమనిషిని చేతే ఇల్లు క్లీన్ చేయించాలి, ఎక్సర్ సైజ్, నాకు ఫోన్ చెయ్యాలి, మా నాన్న డాక్టర్ కి ఫోన్ చెయ్యాలి
బుధ- బట్టలు ఉత్తుకోవాలి, ఎక్సర్ సైజ్, నాకు ఫోన్ చెయ్యాలి, మా తమ్ముడికి ఫోన్ చెయ్యాలి
గురు- లాండ్రి కి బట్టలు వేయాలి ,ఎక్సర్ సైజ్, నాకు ఫోన్ చెయ్యాలి, మా అమ్మమ్మకి ఫోన్ చెయ్యాలి
శుక్ర- పనిమనిషిని చేతే ఇల్లు క్లీన్ చేయించాలి, ఎక్సర్ సైజ్ ,నాకు ఫోన్ చెయ్యాలి, మా ఇంటి ఓనర్ కి ఫోన్ చెయ్యాలి
శని- కూరగాయలు తెచ్చుకోవాలి, ఎక్సర్ సైజ్, నాకు ఫోన్ చెయ్యాలి, మా కుక్కకి ఫోన్ చెయ్యాలి


అక్కడే ఆ కాగితాని చించేసి ముక్కలు ముప్పావు మీద వేసి , హా హా హా ... హు హు హు .. హి హి హి అని తెలుగు సినిమా విలన్ లాగ నవ్వాలి అనుకున్న. కాని జరిగింది వేరే.
సూపర్ ముప్పావు నువ్వు, ఎంత పద్ధతిగా రాసావు నా కోసం, అని తెలుగు సినిమాలో ఎందుకు పనికిరాని కారక్టర్ ఆర్టిస్ట్ లాగ పళ్ళు ఇకిలిస్తూ ఉండిపోయా.మళ్ళి ఏదో అనుమానం వచ్చి ఆ కాగితం చూస్తూ ఏమిటి ఇది ముప్పావు మీ కుక్కకి కూడా ఫోన్ ఉందా అన్న? కాగితం లాకుంటూ అది కుక్ లెండి. మీరు మరీను కుక్కలకి ఇంక ఫోన్లు రాలేదు అంది. (వస్తే దానికి కూడా ఫోన్ చెయ్యాల ... రామ చంద్రా ... !).
ఆ తర్వాత రోజు ఆ టైం టేబుల్ పెట్టుకొని నా టైం టేబుల్ లో మార్పులు చేశా. ఆఫీసు నుండి రాగానే-- మా నాన్న చిన్ననాటి స్నేహితుడు ఇదే ఊర్లో ఉన్నాడు వచ్చి రోజు మీకు వంట చేసిపెడతాడు అనింది . వండర్ఫుల్ అన్న మాట తప్ప ఏమి రాలేదు నోట్లోనుంచి . (జోబిలో ఉన్న కాగితం తీసి హోటల్ అని ఉన్న అని చోట్ల ఒక పెద్ద ఎర్ర రంగు ఎక్స్ మార్కు కొట్టేసా )
పక్క రోజు, మీకు వారం రోజులో యోగ నేర్పిస్తాను అని నా స్నేహితురాలి వాళ్ళ భర్త ఒప్పుకున్నాడు , సాయంకాలం మీకు బలే కాలక్షేపం (ఈ సారి సైలెంటుగా జేబిలో కాగితం తీసి సాయం కాలం ఆరు ఏడు మధ్య ఉన్న అని ప్రోగ్రామ్స్ కి పెద్ద ఎక్స్ )
పక్క రోజు ఇంటికి రాగానే ఏవండి మీకు రోజు ఇంటికి ఒక సినిమా తెచ్చి ఇవ్వమని సీడీ షాప్ వాడికి చెప్పేసాను . (ఈ సారి కాగితం తీస్తే అన్ని ఎక్స్ లే కనిపించాయి , కోపంగా కెవ్వ్ అని అరిచి ఆ కాగితాని ముక్కలు ముక్కలు గా చించి పైకి విసిరేశా ) . ముప్పావు సీరియస్ గా మీకు బుద్ది ఉందా కాగితం చించేస్తారా అనింది , ఇంకా నా అరుపు విని ఫీల్ అయ్యింది అనుకున్న, కాని కాగితాలు కింద వేసాను అని క్లాసు పీకింది

ఇలా రోజుకి ఒక ప్రాబ్లం గడుపుకుంటూ ఫైనల్ గా ఎయిర్ పోర్ట్ కి వచ్చేసాం . చెక్-ఇన్ అయ్యి లోపాలకి పంపేసి , నా పెళ్ళాం ఊరేలిపోయ్యిందో అని ఎగురుకుంటూ (మనసులో), వస్తున్నా నాకు మళ్ళి ముప్పావు గొంతు వినిపించింది. నా కర్మ కాలి ఫ్లైట్ లేట్. వెంటనే మొదలు పెట్టింది , ఏవండి మీరు ఒక్కరే ఇక్కడ ఎందుకండీ మీరు రావచ్చు కదా, లేకపోతే నేనే వెళ్ళను ఏమి అంటారు . మొదటికే మోసం వచ్చే లాగా ఉంది అని నువ్వు వెళ్ళడం ఇంపార్టంట్ కాబట్టే కదా వెళ్తున్నావు. నేను లీవ్ అప్లై చేసాను కదా అప్ప్రువ్ అవ్వగానే వచ్చేస్తా అని కవరింగ్ ఇచ్చా . ఆ టైం టేబుల్ జగ్రతండి... పొరపాటున మిస్ అయిపోతే బీరువాలో ఇంకో నాలుగు కాపీలు పెట్ట . అలాగే ఆ యోగ మాష్టారు అంటుండగానే అన్నౌన్సుమేంట్ వచ్చింది ముప్పావు ఫ్లైట్ కి , నా నెత్తిన పంచదార ఉన్న పాలు పోసింది.


ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యం. నా ఎదురుగా నిలబడి ఒరేయి ఏమిరా లేట్. నీ కోసం వెయిటింగ్ అంటూ నా స్నేహితులంత తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. అందరం కలిసి క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్ళాం. కూల్ డ్రింక్స్ తాగుతూ , మధ్య మధ్య లో చాక్లెట్స్ తింటూ తెగ ఆడేశాం . ఇంతలో రమేష్ మామ అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలిరా వైఫ్ పిలుస్తోంది అన్నాడు . ఒరేయ్ సోంబేరి నీ పెళ్ళాం ఉర్లోలేదుగా? రమేష్ అవును కదా, సారీ మామ అలవాటులో పొరపాటు టైము చూడగానే అలా తెలియకుండా ఆ మాట వచ్చేసింది. మ్యాచ్ కంటిన్యూ చేస్తున్నాం , నేను బ్యాటింగ్. కష్టపడి బలంగా కొడితే దొర్లుకుంటూ వెళ్లి పిచ్ దాటింది. ఈ సారి ఇలా కాదు అని ఫ్రంట్ - ఫుట్ వేసి మరి లాగి కొట్టా పావురం లాగా పైకి ఎగిరిపోతుంది అని పైకి చూస్తూ ఉంటె కోడి పిల్ల లాగా ఎగురుతూ వెళ్లి విజ్ఞేశ్ గాడి కాళ్ళ దగ్గర పడింది. . అటు వైపు ఉండాల్సిన సాగర్ గాడు నా పక్కకి వచ్చి పరిగితు అని చెవిలో అరిచాడు . వెంటనే అశ్వని నాచాప్పని గుర్తుతెచ్చుకొని క్లైమాక్స్ లో బాలకృష్ణ తరుముతున్న ప్రేక్షకుడి లాగా పరిగెత, పరిగిస్తున్న , పరిగిస్తూనే ఉన్న కాని ఎంత సేపటికి ఆ పక్కకి చేరలేక పోతున్న. ఇంతలో రన్ - అవుట్ అయ్యా.
ఇక మా ఫీల్డింగ్ . మహేష్ సడన్ గా రమేష్ దగ్గరకి వెళ్లి టైము చూసి బాబాయ్ ఇంక నేను వెళ్ళాలి అన్నాడు. అందరు రమేష్ గాడిని చూసి తెగ నవ్వారు. నవ్వేసి వెనకి తిరిగేసరికి మహేష్ గాడి కారు రోడ్ ఎక్కేసింది. ఈ సారి రమేష్ గాడు మమల్ని చూసి నవ్వాడు. బౌలింగ్ వేయడానికి ఒక పది అడుగులు వెనకకి వెళ్లి ఓ...! అంటూ పరిగితి వచ్చి విసిరా. బాట్స్ మెన్ దాటుకొని వెళ్లి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. అంపైర్ కూల్ గా వైడ్ అన్నాడు. ఈ సారి ఇంకా కసిగా పరిగితా , ఫీల్డర్ బాల్ పట్టుకొని నా బ్యాటింగ్ అయిపొయింది బాట్స్మెన్ అక్కడ ఉన్నాడు వాడికి బౌలింగ్ చెయ్యి అన్నాడు. ఇలా మూడు నో బాల్స్ ఆరు వైడ్ల తర్వాత బౌలింగ్ త్రో గా మారింది. ఎట్లో అశుతోష్ గోవారికర్ సినిమా అంత లెంత్ ఉన్న ఓవర్ అయ్యిపోయింది. అలిసిపోయి వెళ్లి నీలు తాగి వచ్చేసరికి గ్రౌండ్ లో జనం సగం అయ్యారు. ఇంకా నాకు ఫీల్డింగ్ చేయక తప్పలేదు . లాస్ట్ ఓవర్ కి వచ్చింది మ్యాచ్. ఇంకా నాలుగు రన్లు కొట్టాలి ఆపొసిట్ టీం లాస్ట్ వికెట్ . బలంగా ఒకటే షాట్ కొట్టాడు , బాలు నా వైపే ఎగురుకుంటూ వస్తుంది, చేతిలు గాలో పెట్ట కనురెప్ప వేసేసరికి ఆకాశం కనిపిస్తోంది. అందరు సూపర్ డైవ్ మామ , మనం గెలిచాం అని గెంతులు వేస్తున్నారు. అసలు విషయం ఏమిటి అంటే బాడీ ఇష్టం వచ్చినట్టు పెరిగి బాలన్సు తప్పింది. గేమ్ అయ్యింది , ఎవరి దారిలో వాళ్ళు ఇంటికి వెళ్లారు. నేను బలవంతంగా నా బాడీని కారులోకి లాగి ఇంటికి చేరా .
ఫుల్ సౌండ్ లో పాటలు పెట్టేసి ఆడియో ప్లేయర్ లో . హ్యాపీగా బాత్రూంలోకి వెళ్ళిపోయ స్నానం చేయడానికి . నీళ్ళు వేడిగా వస్తున్నాయి . మణి శర్మ మంచి మాస్ బీట్లో పాట వాయిస్తునాడు. ఏదో తెలియని అపస్వరం వచ్చింది. ఆడియోలో ఏదో ప్రబ్లామ్లె అని వదిలేసి నా పనిలో . ఇంతలో మళ్ళి అపస్వరం వచ్చింది . మణి సార్ ఆడియో ప్లేయర్ లో నుంచి బయటకి వచ్చి ఓరి దూర్తుడా ఆ పాట వచ్చేది ఈ రాగం దాంట్లో వచ్చేది ఏమి బీటు దానికి నువ్వు అపస్వరం తెస్తావ అన్నటు వినిపించింది. బయటకి వెళ్ళే సరికి ఎవడో చక్రి తమ్ముడు తలుపు కొడుతున్నాడు. తీసే సరికి వచ్చింది చక్రి బామ్మ , అదే పక్కింటి చక్రి గాడి బామ్మ. ఆ సౌండ్ అంత పెడితే పోతాను నాయన కొంచెం తగించు అని వెళ్ళిపోయింది. నన్నే చూస్తునట్టున్న మణి సార్ ఫోటో అటు తిప్పి సౌండ్ తగ్గిచా.
టైము ఆరు అయ్యింది మహేష్ గాడికి ఫోన్ చేశా . హలో మామ ఏమి చేస్తున్నావు అన్న. కాని ఆ వైపు నుండి నో రెస్పాన్స్. కాని ఏవో మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. మళ్ళి హలో అన్న , అప్పుడు అర్థం అయ్యింది మా వాడు ఫోన్ పెళ్ళానికి తెలియకుండా ఎత్తాడు. వాడి పెళ్ళాం ఝాన్సీ , బుద్ది వుందా మీకు మీ వయస్సు ఎంత మీ ఆటలు ఏమిటి. మా వాడు అది కాదె వాడి పెళ్ళాం ఊరు వెళ్ళింది . ఆయన పెళ్ళాం ఊరికి వెళ్తే మీకు ఏమి అయ్యింది. పిలిస్తే చాలు ముడ్డి మీద గుడ్డ నిలబడదు అని తిడుతోంది. కట్ చేసి రమేష్ గాడికి ఫోన్ చేశా, ఈ లైనుకి ఫోన్ చేయాలి అంటే ఉదయం పది నుండి ఆరు దాగ మాత్రమె ప్రయత్నించండి అని టోన్ వచ్చి కట్ అయ్యింది. ఇలా నాలుగు ఫోన్లు చేసాక విరక్తి కలిగి ఎప్పుడో చిన్నప్పుడు పుష్కరాలలో కొన్న నా ఫేవరట్ హీరోయిన్ సినిమా సీడీ చూస్తున్న. హీరోయిన్ ఉన్న పార్ట్ మాత్రం చూసేసరికి ఏడు అయ్యింది.... మళ్ళి రీవైండ్ చేసి చూసేసరికి నిద్ర టైము అయ్యింది. హీరోయిన్ కి మణిశర్మ గారికి గుడ్ నైట్ చెప్పి వెళ్లి నిద్రపోయ


కొసరు :
పడుకుంటే నిద్ర రాలేదు , పక్కన చూస్తే బెడ్ మొత్తం ఖాలిగా ఉంది . రోజు లాగే నేను ఒక మూల పడుకున్న. అప్పటి దాక తెలిలేదు " నా పెళ్ళాం ఊరెళ్ళిపోయి౦దోచ్" లో ఆనందం కంటే ఒంటరి తనం ఎక్కువ ఉంది అని .