Wednesday, February 17, 2010

వార్తలు ... విశ్లేషకులు ... మా కర్మ ( అదే పని )

బావ నీకోసం నా మూడో మొగుడ్ని కూడా వదిలేసి వచ్చేసా నా కోసం నువ్వు కనీసం నీ ఐదో కీపుగా నన్ను ఉంచుకో . లేదా నా ఎదురుగా నువ్వు ఇచ్చిన బొమ్మ తుపాకితో కాల్చుకొని పక్కనే ఉన్న స్పూన్ నీలలో దూకి ఆత్మహత్య చేసుకుంటా. అలా తెలుగు సీరియల్ లో వస్తున్న మాటలు వింటూ ఎప్పుడు మా అమ్మ కరుణిస్తే టీవీ రిమోట్ తీసుకోవాలా అని ఎదురుచూస్తున్న. అప్పుడే మోగింది బుయామ్ బుయామ్ అని మా నాన్న బండి హారన్ . దాంతో మా అమ్మ టీవీ వదిలి వెళ్ళిపోయింది మా నాన్నకి కాఫీ కలపాలి అని. దొరికింది కదా ఛాన్స్ అని ఛానల్ మార్చపోతున్న వచ్చాడు మా నాన్న రిమోట్ లాకొని న్యూస్ ఛానల్ పెట్టాడు. ఎవరో బేతాళ రావు అనే రాజకీయ నాయకుడి తో ఇంటర్వ్యూ వస్తోంది.

యాంకర్ : ఇంతకి మీరు తెలంగాణా కావలి అనే వాళ్ళ కాదు అనే వాళ్ళ
బేతాళ రావు: ఏమి చెప్పకుండా ఉండిపోయాడు
యాంకర్ : చెప్పండి మీరు ఎవరికీ భయపడుతున్నారు.
బేతాళ రావు: మల్లి మౌనం
యాంకర్ : కెసిఆర్ గారికే కదా చెప్పండి. ఏమి పర్వాలేదు . రోశయ్య గారు సెక్యూరిటీ ఇప్పిస్తారు.
బేతాళ రావు : చమట తుడుచుకుంటూ మంచి నీళ్ళు తాగాడు.
యాంకర్ : ఈ సమయంలో మీరు చూడచు ఈయన భయంతో చమటలు పడుతున్నాయి. చెప్పండి చంపేస్తాను అని గాని బెదిరించార.
బేతాళ రావు : తల ఆడించాడు.
యాంకర్ : చూసారా కెసిఆర్ తో ప్రజలకే కాదు రాజకీయ నాయకులకి కూడా కష్టం. ( నాకు మాత్రం ఆయన అవును అని ఆడించినట్టు అనిపించలేదు.) లేక పోతే ఈయన అని ప్రశ్నలకి మౌనం ఎందుకు వహిస్తాడు. వెంటనే కెసిఆర్ ని తీహార్ జైలుకి పంపి తెలుగు వార్తలు చూడకుండా చేయాలి. ( అది శిక్ష కాదురా వరం అని నేను నవ్వుకున్న)
అప్పుడే ఎవరో ఆ స్టూడియోలోకి పరిగితుకుంటూ వచ్చి యాంకర్ చెవిలో ఏదో చెప్పారు . యాంకర్ మమ్మల్ని చూస్తూ, వీళ్ళ పార్టీ వాలు ఈయన మూగవాడు అంటున్నారు. అది ఎంత వరకు నిజమో తేల్చుకునే వరకు చూస్తూనే ఉండండి "కర్మ " టీవీ మీ కర్మ టీవీ.

మా నాన్న తిట్టుకుంటూ వెధవలు ఆయన మూగవాడు అని నాకు తెలుసు వీళ్ళకి తెలియదు అని జంతువులూ కూడా ఆత్మహత్య చేసుకున్నే లెవెల్లో తిట్టాడు.
తిడుతున్నాడు కదా అని ఆనంద పడ్డ ఛానల్ మారుస్తాడు అని.

“సినిమాలో ఆకాశవాణి లాగ ఏదో సౌండ్ వచ్చింది ఆ వైపు తిరిగా , అర్జునా ఈ టీవీ , ఆ టీవీ , మా టీవీ అని నాలోనే ఉన్నాయి. ఛానల్ పెట్టేది నేనే దాని మార్చేది నేనే. అర్జునా నా మాట విను మీ నాన్న ఈ రోజు టీవీ పెట్టింది ఆయన చూడడానికి కాదు నాయన నిన్ను టీవీ చూడకుండా చేయడానికి. కాబట్టి వెళ్లి చదువుకో అన్నాడు. అయిన విన్నకుండా అక్కడే కూర్చున్న .”


మల్లి అదే యాంకర్ వచ్చాడు నమస్తే నేను రావు మీతో తొమ్మిది గంటల న్యూస్ లో . కింద డిస్ప్లేలో అతని పేరు పడింది నస రావు అని. ఇంగ్లీష్ లో ( Narasa Rao ) అని పడింది.

మా అమ్మ అప్పుడే కాఫీ తెచ్చి ఇచ్చింది మా నాన్నకి. యాంకర్ గాడు మల్లి మాట్లాడం మొదలు పెట్టాడు. ఈరోజు మనం మాట్లాడుకో పోయే విషయం ఏమిటి అంటే స్పైడర్ మాన్ నిజంగా ఉన్నాడా. దీని గురించి మనతో మాట్లాడడానికి చాల కాలంగా స్పైడర్ మాన్ కామిక్స్ చదువుతున్న పది ఏళ్ళ రాము స్టూడియో కి వచ్చారు. ఇంకా ఆట జునియార్స్ విన్నర్ అతి పిల్ల , సరిగమప జునియార్స్ విన్నెర్ గర్గర్ సుందరాంగుడు ఫోన్ లైన్ లో ఉన్నారు.
చెప్పు రాము స్పైడర్ మాన్ నిజంగా ఉన్నాడా. తప్పకుండ ఉన్నాడు . ఎలా చెప్తావు రాము. మా ఊర్లో ఒక రైతు చావపోతుండగా స్పైడర్ మాన్ వచ్చి కాపాడాడు. మంచి పాయింట్ ఇప్పుడు మనం మిగతా వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఈ విషయంలో ఏమి అనుకుంటున్నారో.
చెప్పు అతి నువ్వు ఏమి అంటావు దీని గురించి . చూడు అన్నయ నేను ఉన్నాడు అని కచ్చితంగా చెప్పలేను కాని నేను మాత్రం నమ్ముతాను. కారణం చెప్తావా అతి. దానికి మీకు ఒక కథ చెప్పాలి అన్నయ. మేము అంత ఒక సారి కలిసి పక్క ఊరులో ఉన్న మా అతి పెత్తర అన్నయ్య డాన్స్ చూడానికి వెళ్ళాం. అక్కడ ఏమి అయ్యింది అంటే మా అన్నయ్య డాన్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి నవ్వింది. నాకు బాగా కోపం వచ్చింది వెంటనే పక్కనే ఉన్న రాయతో కొట్ట. కొట్టిన తర్వాత బాగా బాధ పాడాను అనుకోండి రాయ కాకుండా కత్తి ఉంటే బాగా ఉండేది అని.
ఆ తర్వాత వస్తుంటే మా కార్ టైర్ పేలిపోయింది. ఆ అప్పుడు వచ్చి స్పైడర్ మాన్ కాపాడాడ. లేదు అక్కడే ఉన్న స్పైడర్ కార్ షాపులో ఉన్న టైరు కొట్టేసి వేసుకొని వచ్చేసాం . ఇంటికి వచ్చే సరికి మా ఇంటికి అంత బూజు పట్టింది దాంట్లో ఒక స్పైడర్ కనిపించింది కాసేపు ఆగి కనిపించలేదు. అప్పటి నుండి నాకు డౌట్ స్పైడర్ ఉందా లేదా అని.
దానికి స్పైడర్ మాన్ కి ఏమి సంబంధం అతి. స్పైడర్ మ్యానా ఇంత సేపు స్పైడర్ గురించి అనుకున్నానే. అంటుండగానే ఏదో సౌండ్ వచ్చి అతి స్క్రీన్లోఛి మాయం అయిపొయింది. సాంకేతిక కారణాల వల్ల లైన్ కట్ అయ్యింది.
నువ్వు చెప్పు గర్గర్ నీ ఉదేశం ఏమిటి. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు.ఎలా చెప్తావు గర్గర్. నేను చెప్పేది ఏమిటి అంటే అంటున్నాడు ఇంతలో యాంకర్ ఆపేసి మనకి ఉండే టైము ఇంతే ఫైనల్ గా ఇద్దరు చెప్పేది ఒకటే స్పైడర్ మాన్ ఉన్నాడు. బ్రేక్ తర్వాత కలుసుకుందాం చూస్తూనే ఉండండి మా కర్మటీవీ.
====
హా ...
బ్లేడ్ తెగింది.
హొ...
చెప్పు కోడక ఏమి అయ్యింది.
బ్లేడ్ తెగింది
రాక్షస బ్లేడ్ వాడు చిన్నప్పుడు నేను అదే వాడే వాడ్ని.
గడ్డం చిక్కకు పెడుతోండా వెంటనే వాడండి రాక్షస బ్లేడ్. గడ్డని అలాగే దాని చుట్టూ ఉన్న చర్మాని మొత్తాని లేపి పారేస్తుంది .ఇక మీ జీవితంలో చర్మం తెగదు.
====
ఏమండి పక్కింటి ఆయన చూడు ఎంత అందంగా ఉన్నాడో.
రాజు ఆ పక్క పొదలో ఉన్న అబ్బాయ్ చూడు ఎంత బాగా ఉన్నాడో.
ఓ నా కొడకా ఆ అబ్బాయి చూడు ఎంత ఎంత అందంగా ఉన్నాడో.
ఈ మాటలు మీ జీవితంలో కూడా వింటున్నారా. వెంటనే కొన్నండి ప్రేమ బ్రాండ్ వారి యాసిడ్ పోయండి పక్క వాడి మీద.
====

బ్రేక్ తర్వాత .. తిరిగా మీ మా కర్మ టీవీ లోకి స్వాగతం అన్నాడు. రెండో విషయం పీ.వీ.నరసింహ రావు ఏమి చేసాడు దేశానికి. దీని గురించి మనతో మాట్లాడానికి మన ముందు ఉన్నారు బి జే పీ నుండి రవి శంకర్ ప్రసాద్ , కాంగ్రెస్ నుండి అభిషేక్ మాను .
చెప్పండి రవి ఏమి చేసాడు పీ వీ దేశానికీ. మనకి చాల ఇచ్చాడు దేశాని ఫైనాన్షీయల్ గా ముందుకి తీసుకు వచ్చాడు. ప్రపంచం అంత తెలుగు వాడి గౌరవానిపెంచాడు. అంటే ఆయన బాబ్రీలో ఏమి చేయలేదు అని మీరు ఒప్పుకుంటున్నార . నేను అల అనలేదే మరి మీరు అడగగానే ఆ విషయం చెప్పలేదు అంటే అది ఆయన చేయలేదు అనే కదా. దానికి కూడా వస్తాం .
మీరు వచ్చేలోపు అభిషేక్ గారిని అడుగుదాం . చెప్పండి ఆయన ఏమి చేసాడు దేశానికి. దేశానికి ఏమి చేసాడో తర్వాతో మాట్లాడదాం.
ముందు ఆయనకీ ఆయన ఏమి చేసుకున్నాడు. ఏమి చేసుకోల అంటే ఇంకా దేశానికీ ఏమి చేస్తాడు. కాంగ్రెస్కి మాత్రం బాగా నాశనం చేసాడు. గ్రూపలు కట్టదు , మీ వాలకి పని చేసుకోవద్దు అని ఎవర్ని తిననివలేదు. చాదస్తం , ఏదో మల్లి మా అమ్మ సోనియా అమ్మ వచ్చింది కాబట్టి ఏదో ఇలా ఉన్నాం. లేకపోతే ఉన్న పది బెంజ్ కార్లలో ఏడు కార్లకి మాత్రం పెట్రోల్ డబ్బులు ఉండేవి నాదగ్గర.
ఇది పాయింటీ మరి ఇక ముందు ఎలా ఉండపోతోంది కాంగ్రెస్. ఏమి ఉంది చిన్న గాంధీ పనిలోకి వచ్చాడుగా ఇక మాకు తిరుగులేదు. నా పరిస్థితికి కూడా డోకాలేదు . అది ఎలా చెప్పగలరు చిన్న గాంధీ కొత్త రక్తం రావాలి అన్నారు కదా. మన ఇద్దరి మధ్య ఉండాలి ఈ సిక్రెట్ చిన్నపుడు నేను ఆయనకీ కడిగాను. సార్ అవ్వని టీవీలో చెప్పకూడదు . ఆయన ఉదేశం చిన్నప్పటి నుండి ఆయన జీవితాని మంచి దారిలో శుబ్రంగా ఉంచుకునేలా చూసుకున్నాను అని.
ఇప్పుడు మీరు చెప్పండి రవి గారు ఏమి అంటారు. నేను చెప్పేది ఏమిటి అంటే ఆయన భాబ్రిలో ఏమి చేసాడో. కీక్ అని ఏదో శబ్దం వచ్చింది రవి గారు సారి టైము అయ్యిపోయింది విన్నారుగా ఆయన ఎవరికీ ఏమి చేయలేదు అని స్టూడియోకి వచ్చిన వారు అంటున్నారు.
ఇక ప్రజలు ఏమి అంటున్నారో పోల్లో చూడం . స్పైడర్ మాన్ ఉన్నాడు అని 95 % మంది ఒప్పుకున్నారు. పీ వీ దేశానికి ఏమి చేయలేదు అని 99 % మంది అంటున్నారు మిగతా వాళ్ళు ఎవరు ఆయన అని అడుగుతున్నారు.
మా నాన్న ఫైనల్గా విరక్తి కలిగి అక్కడ నుండి లేచాడు. నేను హ్యాపీగా ఐ పీ యల్ లో చీర లీడర్స్ ని చూస్తున్న

Sunday, February 7, 2010

గాంధీని కాపాడండి

రోజులాగే ఎనిమిది గంటలకు లేచి పేపర్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళ. పేపర్ తెరిచి చదువుతున్నా ..

"మళ్లీ తెలంగాణా అడిగితే ముక్కు కోస్తా కె సి అర్, జాగ్రత్త - లగడపాటి "
"తిట్లలో కూడా “కోస్తా” .. “తెలంగాణా” తేడ చూపిన లగడపాటి ఏందీ వయ్యా మాట్లాడేది - కె సి అర్"
“రైతులు ఆత్మ హత్యలకి చంద్రబాబు నాయుడిదే బాధ్యత”

ఇలా ఒక ఐదు ఆరు ఏళ్ళగా రోజు చూస్తున్న వార్తలే కనిపించాయి. పేపర్ తిప్పగానే నన్ను ఒక వార్త ఆకర్షించింది. “రాహుల్ గాంధీకి తుమ్మోచింది”. ఆ వార్త చదివి నవ్వుకున్న పని అయిపిచి ఆ పేపర్తో తుడుచుకొని డస్ట్ బిన్ లో పారేసి వచ్చి టీవీ పెట్ట. ఒక న్యూస్ రిపోర్టర్ ఒక స్థలం చూపించి ఇక్కడే ఇక్కడే ఒక పది గంటల క్రితం ఆ దారుణం జరిగింది. ఈ పరిసరాలు ఉన్నాయో చూడండి ఇలాగే వదిలేస్తే తప్పకుండ ఇలాంటి గోరమైన స౦ఘటనలే చూడాల్సి వస్తుంది. అలా చెప్తూ ఏడ్చినంత పని చేసింది. మల్లి ఏదో త్సునామి వచ్చింది మల్లి ఒక రోజు జీతం కట్ చేస్తారు చారిటి పేరు చెప్పి అని నేను టెన్షన్ పడ్డా.
అప్పుడు ఆ ఏడుపు గొంతుతో చెప్పింది మన దేశ కాబోయే ప్రధాన మంత్రే తుమ్మితే మామూలు వాళ్ళ పరిస్థతి ఏమిటి వెంటనే ప్రజలు మారాలి. మీ ఇల్లు శుబ్రం సంగతి పక్కన పెట్టి చీపుర్లు తీసుకొని "రాహుల్ గాంధీ " ఎక్కడకి వెళ్తే అక్కడ క్లీనింగ్ మొదలు పెట్టండి. దేశం గర్విస్తుంది గాంధీ తాత నవ్వుతాడు అని చెప్తోంది . దేశాని దహించే ఈ భయంకరమైన విషయం గురించి మిగత చానల్స్ ఏమి చెప్తున్నాయ అని మార్చ. అని చానల్స్ లో ఒకటే వార్త " రాహుల్ గాంధీకి తుమ్మోచింది " " రాహుల్ గాంధీకి తుమ్మోచింది ".. అని ఆయన తుమ్మిన ఆ వీడియోనే మల్లి మల్లి చూపిస్తున్నారు.
సిస్టం ఆన్ చేసి మెయిల్ ఓపెన్ చేశా. ఈ రోజు అనివారనియ కారణాల వాళ్ళ ఆఫీసు సెలవు అని మెయిల్ కనిపించింది. అనివారనియ కారణాలు అంటే నోరు మూసుకొని ఉండచు కదా ఫోన్ చేసి మరి మా బాస్సుని అడిగా ఏమిటి ఆ కారణాలు అని. చెప్పలేకపోయే వాటినే అనివారనియ కారణాలు అంటారురా గుట్లే . బాష తెలియకపోతే మాణిక్ బాషని అడుగురా చింపాంజీ అని అర్థం కాని బాషలో తిట్టాడు.
సరే ఆఫీసు లేదు కదా అని బయటకి వెళ్దాం అనుకోని బయటకి వచ్చా. రోడ్లు అని ఖాలీ . పట్టించుకోకుండా అలా వెళ్తున్న ఎక్కదించి వచ్చారో తెలిదు కాని ఒక ఇరవై మంది వచ్చారు. ఈరోజు బంద్ బయటకి ఎవరు రమ్మన్నారు అని నా బైక్ అద్దం విరగోట్టేసారు. రా అని నన్ను లాకో పోయి ఒక టెంట్లో కూర్చో పెట్టారు. ఆ టెంటులో కొన్ని బ్యానేర్లు రాసి ఉన్నాయి. రాహుల్ గాంధీ తుమ్మడానికి కారణం అయ్యిన వారిని జైలులో పెట్టె వరకు నిరాహార దీక్ష అని రాసి ఉంది. దాని ముందు నన్ను కూర్చో పెట్టారు .( "చచ్చింది గొర్ర ")
ఆ ఊరి విద్యార్ధి నాయకుడు వచ్చి నా సపోర్ట్ మీకే అని ఒక దండ వేసాడు. ఎవరు అయిన టీవీ వాలు వస్తే దీనికి అంత కారణం ఓడిపోయినా పార్టీ వాలే అని చెప్పమన్నారు. ఇంతలో అక్కడకి వచ్చాడు టీవీ9 రిపోర్టర్. ఇక్కడ వాతావరణం చాల భయంకరంగా ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళకి కారణం తెలిసే వరకు నిరాహార దీక్ష చేస్తాం అంటున్నారు ఝాన్సీ . రవి వెంటనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏమిటో కనుకో అంది ఆ పక్క ఉన్న న్యూస్ యాంకర్. చెప్పండి విద్యార్థులు ఏమిటి మీ డిమాండ్ అన్నాడు. చుట్టూ చూసా ఇక్కడ ఎవడబ్బా విద్యార్ధి అని. మీరే చెప్పండి ఏమిటి మీ డిమాండ్ అన్నాడు. పది ఎల్లగా ఉద్యోగం చేస్తున్న నేను వీడికి విద్యార్ధిలాగ కనిపించాను అన్న ఆనందం తట్టుకోలేక తెగ మాట్లాడం మొదలు పెట్ట.
వెంటనే రాహుల్ గాంధీ తుమ్మడానికి కారణం అయిన అని విషయాలకి రిపోర్ట్ చేయాలి. దాని వెనుక ఉన్న అందరి పేర్లు బయట పెట్టాలి. అవసరం అయితే సిబిఐకి కేసు అప్పగించాలి. నిజాలు నిగ్గు తేలే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం ఏ సమాధానం చెప్పకపోతే ఆత్మ ఆహుతి కూడా రెడీ అన్న. అంత ఆవేశం ఎక్కడ నుండి వచ్చిందో తెలిలేదు కాని మాట్లాడేసి చుట్టూ చూసుకున్న ఎవడి దగ్గర పెట్రోల్ లేదు కదా అని.
అప్పుడే వచ్చాడు ఓడిపోయినా పార్టీ కార్యకర్త మేము కూడా మీకే సపోర్ట్ బాబు అన్నాడు. మేడలో ఒక దండ వేసాడు. పక్కకిరా బాబు మాట్లాడాలి అన్నాడు. ఏమి చెప్తాడూ అనుకున్న , రేయి మీ రాహుల్ కి పబ్లిసిటీ కోసం ఇలాంటి పని చేస్తావ నా..... అని చేతో టైపు చేయలేని బండ బూతులు తిట్టాడు. వెంటనే స్కూల్ మూసేసి వెళ్ళు లేదా ఏ సారి దండ నీ శవం మీద వేస్తాను అన్నాడు. అట్నుంచి అటే పారీపొద్దా౦ అనుకున్న కాని ఎక్కడ నుండి వచ్చాడో ఆ పార్టీ నాయకుడు నన్ను పట్టుకొని లాకొని వెళ్లి మల్లి ఆ డేరాలో కూర్చో పెట్టాడు .
అలా అలా వచ్చిన వాళ్ళకి అ౦దరికి నొట్టికొ వచ్చి౦ది చెప్పెసా. రాత్రి పది అయ్యి౦ది. అందరు పక్కనే ఉన్న హోటల్ నుండి ఏదో తెచ్చుకొని తిన్నారు. ఆకలిరా అంటే కరిచి మిగేసాల చూసారు. ఇక చేసేది లేక అక్కడ పడ్డుకున్న. పడ్డుకో కాని నిద్రపోయావో అయ్యిపోతావ్ అన్నాడు. అలా పడుకొని ఉన్న వాడ్ని ఎప్పుడు నిద్రపోయాన తెలిదు. లేచే సరికి రోడ్ మధ్యలో ఉన్న పైన డేరా లేదు చుట్టూ మనుషులు లేరు మేడలో దండ లేదు. ఏది అయితే అయ్యింది వదిలారురా బాబు అని అక్కడ నుండి బయట పడ్డ . ఇంటికి వెళ్లి మల్లి మాముల్గా పేపర్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళ.
మొదటి పేజిలో తెలంగాణా , రెండో పేజిలో పెట్రోల్ వడ్డన లాంటి మామూలు విషయాలు అయ్యిపోయిన తర్వాత ఎక్కడ మధ్య పేజిలో కనిపించింది నేను వెతుకుతున్న వార్త.
" రాహుల్ గాంధీ తుమ్మాడు - సోనియా గాంధీ చింతించింది".
ఆ కింద రాసారు అస్సలు విషయం తుమ్మింది రాహుల్ గాంధీ , కాని అందరు అనుకున్నటు భావి ప్రధాని కాదు. రాహుల్ గాంధీ అని పేరు పెట్టుకున్న మామూలు వ్యక్తి . రాహుల్ గాంధీ వెనక నిల్లబడి ఉన్నందు వాళ్ళ ఈయన తుమ్మాడు అని అందరు బాధ పడ్డారు. కాని అసలు విషయం తెలియ గానే కుదుటపడ్డారు. ఈ విషయం అంత తెలిసిన సోనియా చాల బాధ పడ్డింది. నిజంగా నా కొడుకు ఎందుకు తుమ్మ లేదా అని. రోశయ్యని సలహా కూడా అడిగింది ఏమి చేయాలా అని. మన తెలుగు వాడి పరువు నిలపెట్టడానికి ఆయన ఒక టన్ ముక్కు పొడి పంపాడు. దాని కవర్ చేయడానికి కాను రేషన్ తగిస్తున్నట్టు ప్రకటన కూడా చేసాడు. రోశయ్య గారు ఇటువంటి వాటి నుంచి మన రాష్ట్రని కాపాడాలి అంటే వెంటనే గాంధీ అనే పేరు ఉండే వాళ్ళు అంత పేరు మార్చుకోవాలి అన్నాడు. కుదిరితే అందరు వై యస్ ఆర్ అని పెట్టుకోవాలి అని కూడాసూచించారు.
సరేలే అయ్యిపోయింది ఒక బాధ అనుకోని ఆ పేపర్ మడిచ తుడుచుకోడానికి . అక్కడే కనిపించింది ఒక కొత్త వార్త “పేరు మార్చుకోలేక ఆత్మ హత్య చేసుకున్న గాంధీ”.