Thursday, May 27, 2010

అమ్మ నాన్న ఓ డబ్బింగ్ సీరియల్

మనం మాములుగానే తెల్లవారుజామునే పదకొండు గంటలకి లేచి టీవీ పెట్టి ఏదో ప్రోగ్రాం చేస్తున్నాం. ఆ రియాల్టి ప్రోగ్రాంలో ఒక మూడు యేలా అమ్మాయి అప్పుడే డాన్స్ వేసింది. మొదటి జడ్జీ నువ్వు కుమ్మేసావ్ , చంపేసావ్, చి౦పెసావ్ , నలిపెసావ్ , దులిపెసావ్, లేపెసావ్ , ఆపేసావ్ అంది. అన్నిటికి ఆ అమ్మాయి థేంక్స్ అన్నయ అంది. అప్పుడే పక్కన వచ్చి కూర్గున్న మా నాన్న, భూమి చదరంగా ఉంది అన్న రోజులో పుట్టినట్టు ఉన్నాడు వీడు ఆ పిల్లకి అన్న అన్నారు. తర్వాత జడ్జీ అసలు నువ్వు కత్తి , బాకు, రంపం, గన్ను , ఏకే 47 ..... ఏమ్ చేసావ్ ..! అన్నింది. వెంటనే మా నాన్న ఏమీ చేసిందో కూడా తెలియదు అంట ఇంకా ఏమీ జడ్జీ అన్నారు. మా నాన్న నస పడలేక ఛానల్ మార్చా.

ఆ ఛానెల్లో ఒక నాలుగు ఏళ్ళ పిల్లవాడు పాట పాడుతున్నాడు.


రంపంతో కోస్తా నీ బుగ్గ

సో౦ప౦త ఒలికిస్తే ఓయ్ అబ్బ

దానికి ఒక ఆరు ఏళ్ళ అమ్మాయి

"తలుపు కొట్టకుండా వచ్చేయి రామప్ప

కిర్రుమంటే కొడతాడు మా పాపా " అని పాడుతోంది



ఆ పాట అవ్వగానే ఆ యాంకర్ వచ్చి నీ వయస్సు ఏమిటి ఆ పాట ఏమిటి అంది. మా నాన్నకి ఏమీ అర్థం అయ్యిందో తెలియదు కాని అదే కదా నేను చెప్పేది ఆ పిల్లల వయస్సు ఎంత ఆ పాటలో బూతు ఎంత వీళ్ళని కాదు వీళ్ళ అమ్మానాన్నలని అనాలి అన్నారు. ఆ యాంకర్ కంటిన్యూ చేస్తూ ఇరగాదీసావ్ , సూపర్ అన్నింది. మా నాన్న తిరనాళ్ళలో తప్పిపోయిన పిల్లవాడిలాగా పెట్టాడు మొహం , ఆ మొహం చూసి నేను నవ్వుకున్నా.


కోపంగా ఛానల్ మార్చాడు మా నాన్న.ఆ ఛానెల్లో ఒక పెద్ద చింపాంజీ డాన్స్ వేస్తోంది. మా నాన్న ఈ ఛానల్ హ్యాపీ మనుషులు లేరు అన్నారు. ఇంతలో ఏదో పేలింది ఆ చింపాంజీలోంచి ఒక వ్యక్తి బయటకి వచ్చి డాన్స్ వేస్తున్నాడు. మా నాన్న వాడ్ని చూసి వీడికి వేషం ఎందుకురా డబ్బులు దండగా వాడు మాములుగా కూడా అలగానే ఉన్నాడు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్రైజ్ మనీ కింద ఆ చింపాంజీ అదే ఆ డాన్సర్ కి లక్ష రూపాయలు ఇచ్చారు.

అప్పుడే రి-ఏ౦ట్రి ఇచ్చిన మా నాన్నకి ఏమీ అయ్యిందో తెలీదు తిట్టడం మొదలు పెట్టాడు. చూడు చింపాంజీలు కూడా డబ్బులు సంపాదిస్తున్నాయి , నువ్వు ఉన్నావు ఎందుకు అని మొదలు పెట్టి. నువ్వు అంతే రా చిన్నప్పటి నుంచి అని , నా చిన్నప్పుడు మా పక్కింటి అబ్బాయి చాక్లెట్ కొట్టేసే దాక వెళ్ళిపోయాడు. ఇలాగే చూస్తూ౦టే ఆ తర్వాత గుడిలో వడ పప్పు తిని బతకాలి అన్నాడు. అప్పుడు నన్ను ఏ కుక్క కరిసిందో తెలియదు కాని కోపంగా మా నాన్నతో నేను కూడా టీవీలో వస్తా అని మంగయ్య శపథం చేసి బయటకి వచ్చేసా .



శపథం అయితే చేశా ఏమీ చేయాలో అని ఆలోచిస్తుండగానే ఒక బోర్డు కనిపించింది.

దాని మీద ఇలా రాసి ఉంది:

సగం చచ్చిన శవం, ప్రేతాత్మ పరమాత్మా, పురుగు పట్టిన ప్రేమ, గుండు కొట్టున్కున గుర్నాధం, దొమ్మలు కుట్టిన దోమతెర, లేచిపోయిన రమణమ్మ.

ఈ ప్రయోగాత్మక సినిమాలు తీసిన శంక నాకి పోయిన ప్రొడక్షన్స్ వారి కొత్త ప్రయత్నం . మీ ఆలోచన , మీ మాట ... మీ మా " కర్మ " టీవీ లో .

ఇదేదో మన కోసమే అని లోపాలకి వెళ్ళాను ఏమి చేయాలో తెలుసుకోడానికి. నాలాగే చాల మంది ఉన్నారు లోపల . అందరికి ఏదో ఒక కాగితం ఇస్తునారు , నేను ఒక కాగితం తీసుకున్న .

ఆ కాగితంలో ఇలా రాసి ఉంది :

ఇప్పటి వరకు ఏ ఛానల్ లో రాని ఒక ప్రోగ్రాం ఆలోచన తేవాలి
దానికి సంబంధించి వీడియో కాని , ఆడియో కాని తాయారు చేసుకో రావాలి
ప్రోగ్రాం యాంకర్ అయ్యే అవకాశం మీకు ఉంది
అలా కావలి అనుకుంటే దానికి సంభందించిన మేటిరియల్ తీసుకురావాలి

నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అయిన మా నాన్న నేను చేసిన శపథం ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు . ఎందుకు లేని పోనీడి అని ఇంటికి వెళ్లి పోయా. అని రోజులలాగే ఇంటికి వెళ్ళే సరికి మా అమ్మ నాన్న తిట్టుకుంటున్నారు. నన్ను చూడగానే మా నాన్న తిట్లలో నన్ను కూడా చేర్చి తిడుతున్నాడు . మనం ఏమి పట్టించుకోనట్టు వెళ్లి టీవీ ఛానల్ మార్చా , అంతే మా అమ్మ నన్ను తిట్టడం మొదలు పెట్టింది. అది మా అమ్మ సీరియల్ టైము. ఛానల్ మార్చాను మా అమ్మ చూసే ప్రోగ్రాం చూస్తు కూర్చున్న.

తుప్పల ఆముదం సమర్పించు " లేచిపోయిన అక్క - పారిపోయిన బావ "

టైటిల్ సాంగ్: ప్రేమిస్తే తప్ప మా బావని ... . ?
చూపిస్తే తప్ప వంటిలో ప్రేమని.... ?
అడిగితే తప్ప మా అక్కని పెళ్లి చేయమని ... . ?

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.....

తప్పు కాదంది సమాజం .. ముంచింది నా అమాయకత్వం

... దాంతో.. ?
లేచిపోయింది మా అక్క... పారిపోయాడు మా బావ.



ఆ పాట వింటూనే నాకు తెగ నవ్వు వచ్చింది . ఈ సీరియల్ కోసమా ఫైటు అన్నటు మా అమ్మ వైపు చూసా. మా అమ్మ కళ్ళలో కన్నీరు. టెన్షన్ పడాల్సిన పని లేదు అని టీవీ వైపు చూపించాడు మా నాన్న. ఈ తొక్కలో సెంటిమెంట్కి మా అమ్మ ఏడుస్తుంది అని ఆలోచిస్తూ ఆ సీరియల్ చూస్తున్న. అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. వెంటనే నా కేమేరకి పని పెట్టా.



పక్క రోజు ఉదయానే వెళ్ళా శంక నాకి పోయిన ప్రొడక్షన్స్ వారి ఆఫీసుకి. వెళ్లి ఆ రోజు నేను తీసుకు వెళ్ళిన టేప్ చూపించా. దాంతో పాటు యాంకరింగ్ చేయడానికి స్క్రిప్ట్ కూడా చూపించా. పక్క రోజే ప్రోగ్రాం మొదలు అయ్యింది.

రక్త కోలా కూల్ డ్రింక్ వాళ్ళు సమర్పించు " అమ్మ నాన్న ఓ డబ్బింగ్ సీరియల్"

నేను: హలో నేను .. రంగూన్ రౌడి ... ఈ కొత్త ప్రోగ్రాం గురించి మీకు చెప్పడానికి ఇక్కడకి వచ్చాను.
ఇప్పుడు మీరు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి
మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సీరియల్ గురించి కొట్టుకున్నార ?
ఆకలి అంటే మీ అమ్మ సీరియల్ చూడు అన్న సమాధానం ఇచ్చిందా ?
టీవీ చూస్తూ చూస్తూ ఆత్మ హత్య చేసుకోవాలి అని ఆలోచన వచ్చిందా ?



వీటికి మీ సమాధానం అవును అయితే మీ ప్రోగ్రామే ఇది . ఇక ఆలస్యం ఎందుకు చూసేదాం రండి .

ఇప్పుడు మీరు ఒక మామ్ములు స్త్రీ మాట్లాడే పద్ధతి



--

స్త్రీ: ఓ ప్రాణ శక .. ఇదిగో కాఫీ
భర్త : ఏందీ ఈ కాఫీ నీ మొహం లాగ ఉంది. చక్కెర లేదు పో తీసుకురా
స్త్రీ ఏడుస్తూ వెళ్లి చక్కెర తెస్తుంది
స్త్రీ: ఇదిగో ప్రాణ శక చక్కెర .ఈరోజు వంట ఏమి చేయమంటారు శక .
భర్త : ఏదో ఒకటి తగల పెట్టు ఎలాగో అని మాడ్చి చస్తావు
స్త్రీ: నేను ఎప్పుడో ఇరవయి సంవత్సరాల క్రితం కదా కూర మడ్చింది
భర్త : ఏమి నోరు లేస్తోందే
స్త్రీ ఏడ్చుకుంటూ వంట రూములోకి వెళ్లిపోయింది

--

ఇప్పుడు డబ్బింగ్ సీరియల్ చూసేటప్పుడు స్త్రీల ప్రవర్తన.


ముఖ్య గమనిక : తల్లులు మీకు పెళ్లి కాని కొడుకులు ఉంటె వాళ్ళని తర్వాత వచ్చే ప్రోగ్రాం చూడనివద్దు.



ఐదు నిమిషాలో " లేచిపోయిన అక్క - పారిపోయిన బావ "
స్త్రీ: ఏమండి రోజులాగ గొడవ చేయద్దు ఐదు నిమిషాలో సీరియల్ వస్తుంది
భర్త : సరేలే

లేచిపోయిన అక్క - పారిపోయిన బావ స్టార్ట్
స్త్రీ: ఛానల్ మార్చండి
భర్త: ఒక రెండు నిమిషాలు , ఫస్ట్ వాడు ఎలాగో పాట తర్వాత నిన్నటి సీరియల్ చూపిస్తాడు ఒక పది నిమిషాలు పడుతుంది
స్త్రీ: నిన్న కూడా ఇలాగె చేసారు , హీరోయిన్ వచ్చి వెళ్ళిపోయింది
భర్త : వచ్చి వెళ్ళిపోయింది అని నీకు ఎలా తెలిసింది
స్త్రీ: ఈరోజు మధ్యానం మల్లి చూసాను మీ వల్లే
భర్త : ...............................? ఒక నిమిషం
స్త్రీ: ఆల్రెడీ పాట వస్తోంది వెంటనే పెట్టండి లేకపోతే . ఛానల్ చే౦జ్

లేచిపోయింది మా అక్క... పారిపోయాడు మా
బావ.....
ఒక పది నిమిషాల తర్వాత యాడ్స్
భర్త: యాడ్స్ అయిపోయే లోపల పెడతాను రిమోట్ ఇలా ఇవ్వు
స్త్రీ: ... సరే
ఆఫ్టర్ ఐదు నిమిషాలు . ఛానల్ చే౦జ్ బ్యాక్ . అప్పటికే ప్రోగ్రాం స్టార్ట్ అయ్యిపోయింది.
స్త్రీ: రేయి .. మొగుడో .. నీకు రోజు చెప్పాలా చూడు స్టార్ట్ అయ్యిపోయింది
రోజు ఇలాగే చేస్తారు . ఇక నుంచి వారం రోజులు నువ్వు దొడ్లో పడుకో .
ప్రోగ్రాం అయ్యిపోయింది . పక్కింటికి వెళ్లి ఏమి జరిగిందో కనుకోని వచ్చింది ఆమె.
స్త్రీ: అందరు చెప్తుంటే కూడా విన్నకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న . మా అమ్మ మాట విని ఉండాల్సింది.
భర్త: నేను కావాలి అని ఏమి చేయలేదు కన్నా.
స్త్రీ: అయిన ఇప్పుడు ఏమి చేసిన ఏమి లాభం లేదు . నేను మా ఇంటికి వెళ్తాను విడాకులు పంపిస్తా.
భర్త: వద్దు కన్నా. నువ్వు ఏమి చెప్పిన చేస్తాను.
స్త్రీ: మీకు పనిష్మెంట్ ఒక పది రోజులు వంట మీరే చేయాలి.
భర్త: ఓకే
స్త్రీ: నేను ఒక వారం రోజులు వెళ్లి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా
భర్త : ఓకే
స్త్రీ: నెల నాకు పది వేలు డబ్బులు కావలి
భర్త : ఓకే
స్త్రీ: వచ్చే నెల్ల నాకు కొత్త చీర కొనాలి
భర్త : ఓకే

ఇలా ఒక గంట తర్వాత అమాయకపు భర్త వచ్చి కొడుకు రూములో నిద్రపోతున్నాడు.
కొడుకు అడిగాడు ఇంతకి ఏమి అయ్యింది అంటా టైములో.

భర్త ఏడుపు దిగమింగుకుంటూ " హీరొయిన్ .. హీరొయిన్ ఏదో కొత్త చీర కట్టింది అంట "...

ఇది డబ్బింగ్ సీరియల్ తోర్తురే అన్నాడు.. ప్రోగ్రాం అయ్యిపోయింది

మా నాన్న దగ్గరకి వెళ్లి కాల్లర్ ఎగరేసా. మా అమ్మ దిష్టి తీస్తూ నా బంగారమే బల్లె ప్రోగ్రాం చేసావురా . ఆ భార్య ఎవరోగాని సిగ్గుతో చాచిపోతుంది అనింది.

మా నాన్న నేను ఒకరిని ఒకరు చూసుకొని తెగ్గ నవ్వుకున్నాం