Monday, July 27, 2009

సుర్మా c.o కర్మ టీవీ




జాలము - తెలుగు సైట్ల, బ్లాగుల డైరక్టరీ


నా సైటు రివ్యూ చేయండి


నేను ఒక ప్రముక తెలుగు టీవీ లో రచన విభాగం లో పని చేస్తున్న రోజులో జరిగిని ఒక చిన్న తమాషా . ఆ రోజు నేను రాసిన మాటలే వ్యక్యాత కార్యక్రమంలో మాట్లాడపోతోంది. ఉత్సాహంగ వెళ్లి రంగుల పెట్ట ముందు కూర్చున్న.

బాగా గీకు హైలేసా ... గెట్టిగా గీకు హైలేసా... ఎంత గీకినా అరగదు మా "గోకు గోకు " క్రీం.
వాడండి ... గజ్జికి , దురదలకి దగ్గిరకండి "గోకు గోకు " క్రీం

(ఆ... ! వాడి ఉదేసం ఎంత దగ్గర అయీన వాళ్ళ మందు తో వదుల్తుంది అని కాబోలు.. ఏందో మన కర్మ )

తాళం వేసితిని గోలెం మరిచితిని
ప్రిస్క్రి ప్షన్ తెస్తిని మందులు మరచితిని
పెళ్లి చేసుకుంటిని కట్నం మరచితిని
.... ఇల్లాంటి మతిమరుపుకి కావాలి "జి౦గో -- బ౦గో " జ్యూస్ తాగండి మర్చిపోండి..

( వాళ్ళ జ్యూస్ గుర్తు చేస్తుంది అని కాబోలు )

----- తుస్స్, బుస్, డాం, డమాల్, డుమెల్ -------
( ఇదే మా కార్యక్రమం ... ఆ శబ్దాలు పేర్లు పడేటప్పుడు వచ్చే సంగీతం )

కర్మ టీవీ ప్రేక్షకులకు మీ వ్యా ఖ్యాత సుర్మా నమస్కారం . ఈ రోజు తెలుగు దినం .
( నా తదినం కాదా... ! నేను రాసింది తెలుగు బాష దినం )
అందుకే ఈ రోజు స్క్రిప్ట్ అంత మా రచ తాత తెలుగు లో రాసి సచాడు.
(రచయత తెలుగు లో రాసి ఇచ్చాడు ).
కార్యక్రమం మొదట్లో పెడదామా .
(..మొదలు పెడదామా)
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
"కర్మ టీవీ " మన అందరి "కర్మ" టీవీ
(ఇక్కడ కర్మ ని పని గ అర్ధం చేసుకుంటే.. ఎందుకు రాసారో వీసీగా అర్ధం అవ్తుంది )
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
మన మొదట కాల్ చెయ్య బోయే సంక (సంఖ్య ) రామ రావు గాడిది (గారిది ).
ఆహొ ...! రామ రావు గార ... (బతికించింది ) నేను మీ కర్మ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను ...
హలో ... ! ఎవరు మట్లేడిది . నేను రామ రావు నే అమ్మ.
నేను మీ అమ్మ కి కాదు రామ రావు గారు నేను "మీ కర్మ" టీవీ వ్యా ఖ్యాత .....
"మా కర్మ " దాక అర్ధం అయ్యింది తర్వాత ఏదో ... విక్యత అన్నో సక్యతో అన్నావు అర్ధం కాలేదు..

అదే రామ రావు గారు వ్యా ఖ్యాత అంటే యాంకర్ అని అర్ధం... నా పేరు సుర్మా .. సుర్మా బొపాలి
ఓహ్ ...! మీరా సుర్మా గారు ... నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి...
ఈరోజు తెలుగు దినం అంత తెల్గు లోనే మాట్లాడాలి ... ఫ్యాన్ అనకూడదు .. అభామని అన్నాలి... ( చూసే వాళ్ళ కర్మ.. అదే వినే వాళ్ళ కర్మ )

నేను మీకు రెండు ప్రశ్నలు విసురుత మీరు సమాధానాలు ఇటు ఫోన్లో తోయండి ...
( ఈ తెలుగు దెబ్బకి నేను రాసింది నేనే మర్చిపోయా)


మొదటి ప్రశ్నకి ముందు మీకు మా " కర్మ " టీవీ లో నచ్చిన కరక్రమం ఏమిటో చెప్పండి ...
నాకు అన్ని ఇష్టం సుర్మా గారు..
అల కాదు .. ఒకటి చెప్పండి...
అయితే ఉండడి అల్లోచించి చెప్తా
----మీరు స్కూల్ లో చదువుతూ ... మీ క్లాసు టీచర్ రమేష్ గారికి లైన్ వేస్తారు... ఆ సీరియల్ అంటే ఇష్టం
ఎంత బాగా చేసారండి దాంట్లో మీరు ... నేను నిజంగ మీరు స్కూల్లో చదువుతున్నారు అనుకున్న...తర్వాత తెలిసింది మీ అమ్మాయి మా అమ్మాయి .. కలిసి మెడిసిన్ చేస్తున్నారు అని...
కట్ కట్ ... లాస్ట్ లైన్ ఎడిట్ చేయండి ....

మీ మొదటి ప్రశ్న ... ఆ సీరియల్ లో నుంచే...

౧) రమేష్ గారు నన్ను ఫస్ట్ ఎక్కడ చూసారు ...
అ) మా అమ్మ ఒడిలో ఆ ) నేను చదివే కాలేజీ లో
ఇ) నా పెళ్లి చూపులో ఈ) మా పెళ్ళిలో

మీరు సమాదానం మా ఫోన్ లో తోయడానికి ఒక నిమషం మాత్రమే ఉంది. ...
నాపతి ఐదు ... సెకన్లు మాత్రమే ...
తీస్ సెకన్లు మాత్రమే...
పద హేను సెకన్లు మాత్రమే....

సుర్మా గారు .. ఆన్సర్ "అ )మా అమ్మ ఒడిలో".....

చివరి జవాబా... తాళం వేసేద ...
వేయండి ... గోలెం మరవదు...

మీ జవాబు నోటికి నోటి శాతం ఒప్పు
--- చాల గొప్పగా రాసారు రచయత . మిమ్మల్ని చూడగానే...రమేష్ గారికి పూర్వ జన్మ గుర్తుకు రావడం వెంటే ... మిమ్మల్ని ప్రేమించడం... సూపర్ సీన్ అండి అది...
--- నేను చాల కష్టపడి చేశాను ఆ సీన్ ...
మీ రండో ప్రశ్న ....

అప్పుడు నా వయస్సు ఎంత

అ) ౩ నేల్లలు ఆ) ౩ సంవత్సరాలు
ఇ) ౧౩ సంవత్సరాలు ఈ) ౧౬ సంవత్సరాలు

మీరు సమాదానం మా ఫోన్ లో తోయడానికి ఒక నిమషం మాత్రమే ఉంది. ...
నలబై వైదు ... సెకన్లు మాత్రమే ...
ముప్పు సెకన్లు మాత్రమే...
పద హేను సెకన్లు మాత్రమే....

సుర్మా గారు .. ఆన్సర్ "అ )౩ నేల్లలు".....
(రామ రావు గారు తప్పు చెప్పారు అనుకుంట్ట లేక పోతే .. చూడగానే ప్రేమ అంటే... ఆ సీన్ కి కనీసం ఒక పదహారు సంవత్సరాలు అయ్ వుండాలి కదా. అందులో సుర్మా చేసింది అంటే... ఆ మాత్రం ఉండాలి )
ఇదే చివర జవాబా ... నమకం వుందా...
తాళం వేసేద ...
అలాగే...

మీ జవాబు నోటికి నోటి శాతం ఒప్పు
(ఈ అమ్మాయి ఇందాక ఈ సీన్ తెగ చేశాను అన్నింది అప్పుడు మూడు నేల్లలు అయితే చేసేది ఏందీ. )

మీరు చెప్పిన జవాబులు అన్ని ఒప్పు .. మీకు మా "జి౦గో -- బ౦గో " రసం వాళ్ళు ఇచే జీవితాంతం ... ఉచిత రసం

ఇప్పుడు రామ రావు గారి కోరిక మేరకి .. మా సీరియల్ లోంచి ఒక పాత...

మీ "కర్మ" టీవీ వారి ...

చుం చుం చుం చూస్తాం ...
మీ అందరి అంతం చూస్తాం ....
రామ్ రామ్ రామ్ రాస్తాం ...
రికార్డ్లు తిరగ రాస్తాం...
తీం తీం తీం తీస్తాం ..
పదిహేను వేల ఎపిసోడ్లు తీస్తాం ...
లాస్ట్ లో మా తమ్ముడు కలిపిని పదాలు
=======
చాం చాం చాం చస్తాం ...
చుసిన వాళ్ళం చస్తాం ...
=======

రండో సంక కి కాల్ చేసే ముందు ఒక సారి ఇరగ కొట్టండి ... ( బ్రేక్ )

తలుపు తీస్తే తంతా....
కిటికీ తీస్తే తంతా....
అన్ని మీ భార్య అంటుందా .... వెంటే ఇవ్వండి ... పాయిసన్
ఒక సారి పాయిసన్ వాడితే ఇక్క మీ భార్య మీకు అడ్డం రాదు.....

పాయిసన్ ... దోమల మందు వాడండి ...
చల గాలి ఆనందంగ ఎంజాయ్ చేయండి ...

మీ పిల్లవాడు అన్నం తిన్నట్లేదా....
మీ ఆయనకి అరగడం లేదా ...

వెంటనే వాడండి ... "తుప్పల వారి ఆముదం"
మీ ఆయనకి అరుగుతుంది...
మీ పిల్లవాడికి ఆకలి వేస్తుంది

"తుప్పల వారి ఆముదం"-- తుప్పు వద్దుల్తుంది

----- తుస్స్, బుస్, డాం, డమాల్, డుమెల్ -------
ఇరగ తీసిన తర్వాత ఇదే మా స్వాగతం... మీ సుర్మా బొపాలి ...
రండో సంకకి కలపండి....

ఆహో ..! పుల్లయ్య గార అండి ... నేను మీ "కర్మ " టీవీ నుండి సుర్మా బొపాలి ని ...
హలో ... ! పుల్లయ్య గారు ... సచారు అండి ... మీ ప్రోగ్రాం నుండి ఫోన్ వస్తుంది అని ... చూసి చూసి ..

పుల్లయ్య గారు ,,, చనిపోయిన౦దుకు ... బాధ గ వున్నా ఆయన మా ప్రోగ్రాం కోసం వేచి చూసి చనిపోయారు అని చెప్పారు ఆనందంగ వుంది ..
ప్రోగ్రాం కోసం వేచి చూసి చనిపోలేదు ... ప్రోగ్రాం చూడలేక చనిపోయాడు ... సచ్చినోడు... రిమోట్ పోయిన్నపడి నుంచి ... వద్దన మీ "కర్మ " టీవీ చూసి మా "కర్మ " కాల్చాడు ...

ఆహొ ... ఆహొ ... కట్ అయ్యింది వేరే సంక కి చేదం...

ఆహో ... సుత్తి రావు గార ...
హలో ... నేను వాళ్ళ అబ్బాయి నండి..

నేను మీ "కర్మ" టీవీ నుంచి కాల్ చేస్తున్న ఆయనని పిల్లుస్తారా...
కష్టం అండి... అయన వచ్చే పరిస్థిలో లేరు ...

అయ్యో చాల తక్కువ మందికి వస్తుంది అండి అవకాసం ...పిల్లవండి
మీ కర్మ.... అదే మా ఛానల్ పేరు ...
నాన్న .. నాన్న నీకే ఫోన్...

ఆహొ.. ! పెంటయ్య గార... నేను మీ "కర్మ" టీవీ నుండి కాల్ చేస్తున్నాను ...
చేస్తే.. నాకు ఏమిటి ..
మా "కర్మ" లో కార్యక్రమాల గురించి కొని ప్రశ్నలు వేస్తాం .. చెప్పాలి
మీ కర్మ గురించి ... నేను చెప్పాలా ... అడగండి .. నా కర్మ..

కర్మ టీవీ మీరు ఎప్పుడు చూస్తారు ..

ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ... మద్యహ్నం ఒకటి నుంచి మూడు వరకు ... సాయంకాలం తొమ్మిది నుంచి పడి దాక...

ఆ సమయం లో మా "కర్మ" లో ఏమి రావు కదండీ ...
అందుకే కదా చూసేది...
మీరు బాగా జోక్లు వేస్తారు పెంటయ్య గార.
చిన్నపటి నుంచి నేను అంతే....

మీ జోకులకి ... మీ ఇంట్లో వాళ్ళు బాగా నవ్వుతారా...
లేదు ఏడుస్తున్నారు ... నా టాలెంట్ తెలియక...
ఏమి చేసారు ....
రేయ్ ... ! నేను చెప్ప్తే విన్నావా ... నేను ఇంకా వెళ్ళాను రా..

ఒక రెండు నిముషాలు బాగా శబ్దాలు వచ్చాయి ...
హ్హ ... హూ ... కొరకదు.... అది .. అది .. కత్తి కాదు ... సూది.....

ఆహొ ఆహొ ... ఏమి జరుగుతుంది .. అక్కడ...
హలో ...! మా నాన్న వెళ్ళిపోయారు అండి....
ఏమయింది ... ఆ శబ్దాలు ఏమిటి...
ఏమి లేదు అండి... మా నాన్నని పిచ్చి ఆసుపత్రికి తీసుక వెళ్తున్నారు...

ఎందుకు అన్ని అడ్డగాలి అనుకోని... ఆగిపోయింది ... సుర్మా బొపాలి...

చివరిగా పాత సినిమా పాత విన్నండి...

అయ్యో అయ్యో అయ్యో... ఎందఱో మేచారో అయ్యో
కుయో కుయో కుయో... కొందరు చూసారు అయ్యో
అప్పో అప్పో అప్పో ... అన్నారు పిల్లలో అయ్యో
తుప్పో తుప్పో తుప్పో ... వదిలింది అందరి తుప్పో...






కొస మెరుపు
=======
ఈ కార్యక్రమం చూసాక నేను పుల్లయ్య గార్ని కలిసాను ... పరామర్శించడానికి కాదు... ఆయనతో కలిసి ... శేష జీవితం .. పిచ్చి ఆసుపత్రిలో గడపడానికి

2 comments:

sumanth said...

baagundi.......chaala bagundi.....

Sunset SriKrishna V2.0 said...

Thank you Sumanth