Monday, September 22, 2014

ఏమిటి గొప్ప

గడ్డం పెంచిన నువ్వా గొప్ప
నామం పెట్టుకున్న నేనా గొప్ప
ఎవడు గొప్ప చెప్పరా ఎవడురా గొప్ప

ధర్మయుద్ధం అధర్మంచేతిలో నలిగిపోతుంటే మూగబోయిన నువ్వా గొప్ప
రామరాజ్యంలో ప్రార్థనలయలా కూలదోస్తే సిగ్గుపడని నేనా గొప్ప
ఏమిటంట గొప్ప చెప్పరా ఏముంది గొప్ప

నల్లముసుగులో స్త్రీమూర్తి స్వాతంత్రం కప్పిపెట్టావే నువ్వా గొప్ప
వరకట్నంతో మగువ మనసు విరిచేసిన నేనా గొప్ప
ఇదేనా గొప్ప చెప్పరా ఇందులో ఏదిరా గొప్ప

పండితులని తరిమేసావే నువ్వా గొప్ప
పక్కన చేరనివ్వక అసహించుకున్నా నేనేనా గొప్ప
ఇలాగే ఉంటె గొప్పా అదే నా మన గొప్ప

నిసిగ్గుగా చెప్పారా మనలో మిగల్లేదు ఏమి గొప్ప 
కళ్ళు మూసుకొని చావు కోసం ఎదురుచూడ్డం తప్ప 

Tuesday, September 16, 2014

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 
ఏమిగిలింది  ఏమిగిలింది  ఏమిగిలింది  మనకి ఇక్కడ 

భీమన చూపిన విప్లవం దాకొందే తలుపు చాటున 
అల్లూరి నేర్పిన ధైర్యం అయ్యిందే ధనవంతుడి కాపలా
ఇక 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 
ఏమిగిలింది  ఏమిగిలింది  ఏమిగిలింది  మనకి ఇక్కడ 

ఒక తలతో పది సీతల చెరుస్తున్న పైశాచకత్వం
మనకెందుకని తలవంచుకొని మూగబోయెను మానవతం 
ఇక 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 
ఏమిగిలింది  ఏమిగిలింది  ఏమిగిలింది  మనకి ఇక్కడ 

తల్లి పొత్తిలి నుండి మట్టి కౌగిలి చేరే దాక ధనమే ధ్యేయం 
లక్షల కోట్లు సంపాదించిన ఆగదా ఈ దాహం 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 
ఏమిగిలింది  ఏమిగిలింది  ఏమిగిలింది  మనకి ఇక్కడ 

రాముడు నీతే ప్రశ్నించే కాలం 
అమ్మ పాలు అమ్మేసే రోజు లేదు ఇక దూరం 
ఇక 

ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా 
ఏమిగిలింది  ఏమిగిలింది  ఏమిగిలింది  మనకి ఇక్కడ