అనగననగ ఒక మారు మూలా కుగ్రామం . ఆ ఊరి పేరు నిద్రపాలెం. అదే మా ఊరు.
మా ఊరి కోడి పేరు సునామి.మా ఊరి రైతులకు మంచి ఐకమత్యం. అందరు కలిసి ఒకే సరే మా ఊరు వదిలి పారి పోయారు. ఎక్కడికి పారిపోయారు అంటే కొందరు నరకం అంటారు , కొందరు స్వర్గం అంటారు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళిన మమల్ని మా ఊర్లో కంటే ఆనందంగానే వుంటారు . ఏమి అయిన అనుమానలు వుంటే మా అధ్యక్షుడ్ని అడగండి.. (అద్యక్ష . ఇది నేను తీవ్రంగ కండిస్తున్నాను... ఇది ప్రతిపక్షాల కుట్ర మాత్రమే అని సభా పూర్వకంగ మనవి చేస్తున్నాను )
సరే ఈ రాజకీయం వదిలి మన దారిలో వెళ్దాం. ప్రతిపక్షం కుట్ర కొంచెం , రైతుల నిరసన కొంచెం కలిసి మా ఊరి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టింది. అదే కోడి వేట . మా ఊరి సాకహరులు అంత కలిసి చేపల చెరువు కబ్జా చేసారు. వాలకి ఏదో చిత్రంలో రమాప్రభ గారు అనే మహానటులు వాటిని జల పుష్పాలు అంటారు అని చెప్పింది మేము చచాము ...
ఇక చేసిది లేక వారి దౌర్జన్యం ఆపే దిక్కు లేక మేము కోడి వేట మొదలు పెట్టాం . మిగతా జంతువులు మా రైతులన్కంటే కొంచెం ముందే ఊరి నుంచి బయటకు వెళ్ళే దారి తెలుసుకున్నాయి. అంత మొన్న వచ్చిన కొత్త రోడు మహత్యం. కోడ్లు మాత్రం ఎందుకు మిగిలాయి అని చాల ఆలోచించం . ఎంత ఆలోచించన మాకు అర్ధం కాలేదు. ఇప్పుడు ఆ రోడు వెతుకుతూ వెళ్ళిన ప్రతి వ్యక్తిని మేము ఎంతో ఆనందంగా సాగానంపుతున్నాం. మల్లి కోడి వేటలో పోటి రాడు కదా.
కోడ్లు, కోడు గుడ్లు దొరికినవి దొరికినట్టు తినేసం. అప్పుడు మాకు శాకాహారులకు మధ్య యుధం మొదలయింది . ఇక జలపుష్పలలో మాకు భాగం కావాలి అని మా వర్గం వాలు, కుదరదు అని ప్రతిపక్షం వాళ్ళు.నేను బయట వుండి అందర్నీ ఆ యుధంలోకి తోసాను . అప్పుడు మా అమ్మ నీ తల్లా పెద్దది నీకు తెలివి ఎకువరోయి అన్నింది.
వెంటనే నేను ఊరు అంత అరచుకుంటూ తిరిగా "నాకు తెలిసిపోయిందోచ్" అని. ఏమి తెలిసింది అని ఒక వేదవ కోడా అడగలేదు . సరే మీకు ఆయన చెప్తా వినండి. మా తాత చిన్నపుడు నన్ను కోడి తలకాయ, కోడి తలకాయ అని తిట్టే వాడు అంటే నేను తేలేవి లేని వాడ్ని అని ఆయన అర్ధం. నాది ఇంకా కోడి తల కాదోచ్.....
ఈ యుధం కతులు, కటార్లు, బాణాలు , తుపాకిలు లేకుండ చాల విషయలలో మంచి చేసింది. ఇక నుండి వీరిగాడు , రంగిగాడు , పోల్లమ , వేంకటేశు , రవనయ్య వాళ్ళ ఇళ్ళలో ఎవరికీ భోజనం పని లేదు .... నేనే వీల్లని యుద్ధానికి పంపింది. మరి ఏమి అనుకున్నావు ... ఈ కోడి తల అంటే... (నేను కోడి తల కాకపోయినా , నాకు ఆ పేరు నచ్చింది ... ఎవరైన అడిగితే దానికి అర్ధం నేను ఒక్కడినే చెప్పగలను కదా)
నా తెలివికి నేను ఆనందించే లోపల ఒక భయంకరమైన పరిణామం , అందరు ఒక షరతుకు వచ్చారు.... (నా కోడి మెదడుకు పని లేకుండానే )
అది ఏమిటంటే ....
౧) మేము మా వూర్లో కోడ్లు లేవు అని శాకహారులను నమ్మించాలి, దానికి మాకు ఒక రోజు గడువు . అల నీరుపిస్తే రోజు శాకాహారుల పట్టే ప్రతి నాలుగు పుష్పల్లో మాకు ఒకటి మేము పట్టే ప్రతి నాలుగు పుష్పల్లో వాళ్ళకి రెండు
౨) అల కాక ప్రతిపక్షాలు ఒక కోడి ఆయిన బ్రతికి వుంది అని నిరూపిస్తే మాకు ఏమి దొరకవు.
మా పక్షం వాలు అంత కలిసి ఉరంత తెగతిరిగి ఒక కోడి కోడా లేదు అని తెగేసి చెప్పారు. అప్పుడే ఎవరో మాయల మాంత్రికుడు చేతిలో ఒక పెట్ట పటుకొని మా ముందికి వచ్చాడు. ఆ మాంత్రికుడి చేతిలో ఉన్నది మా భావిష్యతు సర్వనాశనం చేసింది, అది ఏమిటంటే నడుస్తున్న, పరిగెడుతున్న , ఎగురుతున్న ఒక కోడి. నా కోడి మెదడుకి అర్ధం కానీ ఒక భయంకరమైన విషయం ఏమిటంటే ఈ కోడి మా ఎదవలకి ఎందుకు దొరకలేదు . మా ఎదవలది కోడి కంటే చిన్న మెదడ అని .
అప్పుడే నా కోడి మెదడుకి ఒక అపూర్వ మైన ఆలోచన వచ్చింది. ఈ కోడిని పటుకొని నేను తినాలి అని . అప్పుడు పక్కన పోతున వాడు అందుకే నిన్ను కో.మె అనేది అన్నాడు. నా పేరు వీడికి ఎలా తెలుస అని ఒక క్షణం ఆలోచించ. ఈ ఆలోచనలలో నా కో.మె వేడి ఎక్కింది, తటుకోలేక అల ఒక కునుకు తీసా.
నిద్రలేచే సరికి ఉరంత అల్లకల్లోలం. కోడి వేట లో . అది ఎవరికీ దొరకుండా తీరుగుతోంది. ఇక్కడ నేను మీకు మా కోడి గత చరిత్ర అంటే మీ బాష లో "ఫ్లాష్ బ్యాక్ " చెప్పాలి .
ఆ కోడి ఇండోనేసియా లోని తుప్పలపాలెం అనే ఒక పెద్ద నగరం లో పుటింది . అది పుట్టగానే కోడ్ల జాతి అంత ఒక బీకరం అయిన అట్టహాసం చేసాయి. ఇది అర్ధం కానీ ఆ ఊరి ప్రజలు ఆ చుటుపక్కల వున్నా కోడలని అంత చంపేసి పండగ చేసుకున్నారు. వారి కళ్ళు కపి ఒక మూలగ నకి చూస్తున్నదే మన కోడి. అప్పుడే శభద్ధం చేసింది ఎలాగైన పగ తీర్చుకుంటాను అని. రిక్షాతొకి, క్యారెజిలు మోసి రాత్రులు ప్రయోగాలు చేసి ఎంతో కష్ట పడింది . ఆ ప్రయత్నం లోనే ఒక కొత్త విషయాం కనుకుంది. అదే బర్డ్ ఫ్లూ . అంతే ౩ నెల్లల పసి ప్రాయం లోనే ఒక వంద మంది మనుషులని బలి తీసుకుంది .
కొడ్లందరూ కలిసి దాని గౌరవం గ "డాన్" అన్న అని పిల్లవడం మొదలుపెట్టాయి. ఈ డాన్ ని చూసి పాత డాన్ కాలి చికెన్ గా మారి తందూరీ రాత్రులు హోటల్ ప్లేట్ లో తేలింది. ఇది విన్న పాత డాన్ కొడుకు ఆవేశం గా కొత్త డాన్ కి ట్రాప్ పెట్టాడు. వెల్లి సముద్రంలో దూకి దాని అడుగున ఒక పెద్ద బొక్క పెట్టాడు. ఈ విషయం తెలిసన మా కొత్త డాన్
"ఈ డాన్ కోడి ని చంపడం నీకు ఇష్టం కానీ అది చాల కష్టం " ... .. అన్నింది
కళ్ళలో నీలతో "మా డాన్ కోడి నాన్నని చికెన్ గా మార్చిన నిన్ను వదలను" ... అన్నాడు పాత డాన్ కొడుకు
"చిన్న...! నన్ను పట్టు కోవడం పది వీదుల మనుషల వల్లే కాలేదు నువ్వు ఎంత జుజుబి " .. అన్నింది
అప్పుడే ఆవేశం గా తను సముద్రం లో తవిన గుంటలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు పాత డాన్ కొడ్డుకు.
హ హ హ అన్ని నవ్వే లోపలే అక్కడ సునామి వచ్చింది .... ఆ సునామి లో కొట్టుకొని కొట్టుకొని వచ్చి మా వూర్లో పడింది ..
ఈ సునామి, ఆ కోడి వచ్చిన తర్వాతే... మా ఉరిలో ప్రజలు గుంపులు గుంపులుగా పారిపోయారు ( నా కో. మె కి తెల్లిసిన౦ త వరకు నరకానికి ) . అందుకే దీనికి సునామి అని పేరు.
ఈ డాన్ కోడి ని పట్టు కోవడమే మా జీవిత ఆశయం ఇప్పుడు . భారతం లో లాగా పద్మవ్యూ హాలు , ఇక్బాల్ లో లాగా చక్ర వ్యూహాలు అని చేస్తున్నారు. నేను మాత్రం ఏమి చేయాలో నా కో. మె తో అల్లోచిస్తున్న. ఇలాంటి విషయలో నా కో. మె పామ్ఆయిల్ కంటే ఫాస్ట్ గా పని చేస్తుంది.
నేను ఎలాగైన దాని నా దగ్గరకి ఆకర్షించాలి అని ప్లాన్ వేసా. అది దగ్గరకి రాగానే నేను చిన్ననాటి నుంచి ఉ తకుండా వాడుతున్న నా అంగ వస్త్రం వేసి దాని మతులోకి పంపిస్తా. (ఊరంతా కో. మె కో. మె కో. మె కో. మె అని ఎకో వినిపిస్తున్ది అప్పుడు )
చక్రవ్యుహాలు , పద్మవ్యుహాలు దేనికి చిక్కకుండా వుంది సునామి . నేను నా ప్లాన్ ఆచరణలో పెట్టడానికి సంసిద్దమయను. ఉరంత సౌండ్ సెట్ లు అర్రంజే చేశా. నన్ను పిచ్చోడి లాగా చూసారు అందరు.
ఆ మైక్ ఈ చివర నిల్లపడి స్లో గా...
"కో కో కో ఇక్కడ కోడి వెయిటింగ్ ఒక పుంజు కోసం
రా రా రా ముందుకు రా ఇది నిజం కోడె పాడేది నీ కోసం
లే లే లే లేట్ చేయకు ఓ నా ప్రాణం " అని పాట పాడ ... "పుంజును పిలిచేటప్పుడు కోడి లాగా"
నా ప్లాన్ పని చేసింది నాకు సమాధానం వచ్చింది .. ...
" ఇక్కడ వుంది పుంజు కాదు ....ఓ కో మె ఇది ఒక కోడి రా" అని ...
ఇప్పుడు మల్లి కోడి కి పాట రాయాలి అంటే చంద్ర బోస్ అన్న కావాలి అని పాట ప్లాన్ మార్చేసా. ...
" నీకు దమ్ముంటే నువ్వు వచ్చింది తుప్పలపాలెం నుంచే ఐతే నువ్వు ఆ ఊరు డాన్ వె అయితే నా ముందుకు రా " అన్ని ఒక భయంకరమైన ఛాలెంజ్ చేశా.... ఈ ఐడియా కి నాకే ముచ్చటవేస్తోంద
ఒక గంట వెయిట్ చేశా నో రిప్లై .ఛా .... ఈ కోడి డాన్ కి రూల్స్ తెలియవు ... తెలుగు సినిమా చూపించాలి అన్నుకున్న...
ఇంకా కోపం తో నా నేతురు కరిగి పోతుంది . (మరిగి పోతుంది అని ఏమో లే వీడి బాధ )
కోడి గురించి వున్నా అన్ని పాటలు గ్యాప్ లేకుండా వినిపిస్తున్న .... ఏదో ఒక రాక్షస ప్రయత్నం గా . ...
ఎంత అయిన కో మె కదా నా లాగే తెలివి ఎక్కువ . అప్పుడే నాకు భయంకరమైన ఐడియా వచ్చింది . వెంటనే
మైక్ దగ్గరకి పరిగితుకుంటూ వెల్లి ....
"డాన్ కోడి గారికి నేను ఒక లాయర్ ని .... నాకు తెలిసిన౦తవరుకు .. మీ ఫ్లాష్ బ్యాక్ లో "తుప్పలపాలెం" లో మీకు జరిగిన ఎన్నో విషయాలు హిందీ సినిమా డాన్ లోను తెలుగు డాన్ లోను వాడు కున్నారు అందుకని మీ తరఫున వాదించటానికి నాకు అవకాసం ఇవ్వ వలసిందిగా కోరుతున్నాను " అన్ని అన్నౌన్సుమేంట్ ఇచ్చి తిరిగి చూసే లోపల డాన్ కోడి నా ముందర ప్రత్యక్షం అయ్యింది.
"ఈ డాన్ కొడినే మోసం చేస్తారా ... ఎక్కడ పెట్టాలి సంతకం అన్నింది "
ఇక్కడ అని ... చూపిస్తూ పట్టేస కోడిని....
డాన్ కోడిని పట్టిన నన్ను డాన్ మనిషి గా మా వాళ్ళు బిరుదు ఇచ్చి ఆ రోజు పండగ చేసుకున్నారు...
రేపటి నుంచి నేను కోడా " జల పుష్పాలు " తిన్నచు అన్ని ఆన౦దగ నిద్ర పోయా ....
కొస మెరుపు:
------------------------
పక్క రోజు కోడి కుతకు నిద్ర లేచిన నాకు ... మా వాలు, శాకహరులు మల్లి గొడవ పడే దృశ్యం కనిపించింది ... చివరి కోడి చచ్చింది కదా ఇంకా ఎందుకు గొడవ అని నా కో.మె ఆలోచిస్తోంది... అప్పుడే మా మామ లేచి ఎవడ్రా నన్ను లేపింది అని అరుస్తున్నాడు ... అవును ఎక్కడిది ఈ కోడి కూత అన్ని వేతుకుంటున్న నాకు ఒక మెసేజ్ వచ్చింది ... "మా అమ్మ ని చంపిన నిన్ను వురికే వదలను .. వదల కో. మె. వదల " --- డాన్ II
No comments:
Post a Comment