Tuesday, November 3, 2009

సిని"మా"యబజార్

ఆ రోజు ఇంటర్వ్యూ , తర్వాత నెంబర్ నాదే . నేను అనుమానంగానే లోపకి వెళ్తున్న. ఇంటర్వ్యూ అంటేనే కష్టం అది నా మొట్ట మొద్దటి “వందవ” ఇంటర్వ్యూ. ఏందో అంత కొత్త కొత్తగా ఉంది. సర్టిఫికేట్ చూడగానే నిద్ర పోతున్నటు ఉన్న ఆ వ్యక్తి కళ్ళు తెలుగు సినిమాలో వచ్చే అర్థం గాని ఇంగ్లీష్ డైలాగ్ విన్న ప్రేక్షకుడిలగా అయ్యాయి. ఏమి క్యామెడిగా ఉందా గెట్ అవుట్ అన్నాడు. నోరు తెరిచేలోపు నా సర్టిఫికేట్లు నా మొహాన పడ్డాయి. ఏందీ అన్ని ఆశ్చర్యపడకండి. ఇది మాములే మనకి.

అసలు విషయం ఏమిటో చెప్పే ముందు మా నాన్న గురించి చెప్పాలి. మా నాన్నకి కొంచెం సినిమాల పిచ్చి. ఆ పిచ్చి చూడడం వరకు అయితే ప్రాబ్లం లేదు. ఆ పిచ్చి ప్రతి చోట ప్రదర్సిస్తాడు.రాజకీయ నాయకులకి ప్రజలకి లేని/అర్థం గాని సంబంద౦లగా ఉంది నువ్వు చెప్పేది. అసలు మీ నాన్న పిచ్చికి నీ ఇంటర్వ్యూ కి ఏమి సంబంధం అనుకుంటున్నారా. అసలు విషయానకే వస్తున్నా. నా పేరు పాతాళ భైరవి, అవును నా పేరు పాతాళ భైరవి. అప్పటికి మా అమ్మ చెప్పింది కనీసం పాతాళ భైరవ అని పెట్టండి మగ పిల్లవాడికి అని (కనీసం పి . భైరవ అన్ని చెప్పుకునేవడ్ని. ) నా అద్రుష్టం కొద్ది మా నాన్న నేను పుట్టిన ముందర రోజే పాతాళ భైరవి సినిమా చూసాడు. మొదటి సారి కాదు వందవ సారి అది నా ఆ పేరుకి కారణం . ఇప్పుడు అర్థం అయ్యిందా తెల్ల జుట్టుకి బోడి గుండుకి సంబంధం.

ఇంటికి రాగానే మా నాన్న రేయి స్టుపిడ్ .. ఎన్ని సార్లు చెప్పనురా అని అరుస్తున్నాడు. నా గురించి కాదులెండి. మా తమ్ముడ్ని. అర్థం అయ్యిందిగా మా తమ్ముడి పేరు “స్టుపిడ్”. నేను రావడం చూసి ఏమిరా “ఏక నిరంజన్” బోని కొట్టావా లేక మాముల్గానే “భీబస్త౦” మా.

ఫస్ట్ ప్రింట్ రాక ఒక్కడు ఏడుస్తుంటే పబ్లిసిటీ కి డబ్బులు అడిగాడంట. ఇంటర్వ్యూ పోయి నేను ఏడుస్తుంటే ఈయన సినిమా గోల ఒకటి. నా మొహం చూసి అర్థం చేసుకొన్నాడు ఇంకా నా కెరీర్ లో మగధీర రాలేదు అని. మా అమ్మని ఒసే .. రాముల్లమ్మ .. ! నీ యువరత్న వచ్చాడు టీ పార్టీ ఇస్తువు రా అన్నాడు. (టీ కి వచ్చిన తిప్పలు ఇవ్వని )

నేను చేసేది లేక ఒక చిన్న వ్యాపారం పెట్యాను. మాటవరసకి మా నాన్న ని పేరు పెట్టమన్నాను . నా సెంటిమెంట్ మీద సెన్సార్ కట్ వెయ్య. షాప్ పేరు బ్రహ్మానందం డ్రామా కంపెనీ. పెట్టిన రోజు నుంచి రోజు ఒక్కడు అయిన వచ్చి పద్యం పాడి ఒక ఛాన్స్ ప్లీజ్ సార్ అనకపోతే ఒట్టు. ఇంతకీ నేను పెట్టిన షాప్ ఏమో కేటరింగ్ అండ్ సెర్వింగ్.

ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడు సార్ ఈ షాప్ మీదేనా అన్నాడు. టైం బాగా లేక అప్పుడు మా నాన్న షాప్లోనే ఉన్నాడు. నేను వినయంగా అవును సార్ అన్నాను. నా పేరు రంగ నేను కోతగా తీస్తున్నా " లేచిపోయిన అత్తా - పారిపోయిన కోడలు " సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ని అని పరిచయం చేసుకున్నాడు. మేము రేపు ఒక్క వంద మందితో షూటింగ్ చేస్తున్నాం అని చెప్పాడు. మీతో ఆ విషయంగా అన్నాడు….. నేను వంద మందికి కేటరింగ్ అనగానే ఎగిరి గంతువేసి కలుతిరిగి కింద పడ్డ.

లేచేసరికి ... మా నాన్న ఆ డైరెక్టర్ ని ఇడియట్ ... ! ఎంత పొగరు నీకు మొదటి సారి చెప్తే సరిపోదా అని తిడుతున్నాడు. నేను లేచే ఆపే లోపల పోరా "సినిమా పక్షి " అన్నాడు. అడ్వాన్సు బూకింగ్ టికెట్లు రిటర్న్ వచినంత భయం వేసింది నాకు. ఫ్లోప్ సినిమాకి పబ్లిసిటీ చేస్తున్న ప్రెస్ రిపోర్టర్ లాగా ఉన్న నా మొహం చూసి మా నాన్న ఇలా అన్నాడు. రేయి వాడు వచ్చింది నీ "బాబాయ్ హోటల్ " ఇడ్లి, దోసల కోసం కాదురా మగధీర సినిమాలో శేతాన్ కా ఫవుజ్ లాగా వంద మంది కావాలి అంట సైడ్ యాక్టర్లు.

అనుకోకుండా ఒక రోజు మా నాన్నగారు .. పరుగున వచ్చి .. రేయి .. అన్నమయ రేపు నీ పెళ్లి పుస్తకానికి నేను తెర తీసానురా అన్నాడు. తెలుగులోకి అనువదించిన హిందీ సినిమాకి తమిళ్ రైటర్ రాసిన డయలాగ్స్ మలయాళీ డబ్బింగ్ చెప్పినట్టు నాకు ఏమి అర్థం కాలేదు . నా బాధ పట్టించికోకుండా మా నాన్న మీ మామగారు ... ఇంద్ర లాగా ఒక ఉరికే అధినేత ,,, అన్నాడు అప్పతకి అర్థం అయ్యింది. నాకు ఎవరో అమ్మాయిని చూసాడు అని. ఓయ్ .. ! మనోరమ .. మన్న అబ్బాయి గారి పెళ్లి నిశ్చయం చేదాం పద్ద అన్నాడు.



నేను మా అక్క "చెంచు లక్ష్మి " , మా తమ్ముడ్లు స్టుపిడ్ , అబ్బధం మా చెల్లలు "పున్నమి నాగు" జయీభవ అని బయల్దేరాం పెళ్లి చూపులకి. రండి లోపలికి రండి అని పిలిచారు. మా మామగారు నా వైపు చూస్తూ ఏమండి టైగర్ హరిశ్చంద్రప్రసాద్ గారు అన్నాడు. చుట్టూ చూసా ఎవర అన్ని . మిమల్నే .. అల్లుడు గారు అన్నాడు. చెప్పండి మామగారు అన్నాడు. ఎలా ఉంది మీ వ్యాపారం? ఎవరైనా ఎపుడైనా గొడవ చేస్తే మీ బావ సమర సింహ రెడ్డి కి చెప్పు తాట తీస్తాడు అని ఏదో చెప్తూ పోతున్నాడు.ఫ్లాప్ సినిమాకి కొట్టిన ఫ్లాప్ సాంగ్కి నంది అవార్డు వచినట్టు అయింది నా పరిస్తితి . ఉన్న మా నాన్న తో సరిపోక ఈ మామ్మ ఒకడు తాయారు. ఇంతలొ అమ్మాయిని పిలిచారు. వచ్చి కూర్చుంది. బాగానే ఉంది అమ్మాయి. రోజా సినిమాలో హీరోయిన్ లాగా పక్కకి వెళ్లి మాట్లాడుకుందాం అన్నింది.

ఏమి మాట్లాడాలి.. మీ పేరు.. ? ఎంత దాక చదివారు ? ఎ కాలేజీ ? మీకు ఇష్టమైన వంట ఏమిటి అని ఆలోచించుకుంటూ వెళ్ళాను ...
నేను నోరు తెరిచే లోపు అమ్మాయి .. ఏమ౦డి శ్రీవారు .. మహాత్మా లాగా మౌనంగా ఉంటారా.. లేక బెండు అప్పరావు లాగా కామెడి చేస్తారా .. దేవదాసు లాగా .. ప్రేమిస్తారా.. లేక అందరికి మస్కా వేస్తారా .. అనింది ..

మెలుకువ వచ్చేసరికి నేను శంకర్దాదా MBBS హాస్పిటల్ లో "నేను మీకు తెలుసా ?" అని అడుగుతున్నా