Friday, January 22, 2010

జైలులో జంపింగ్.

హలో నా పేరు జంపింగ్ జనార్ధన్. కాని అందరు నన్ను జంపింగ్ అని పిలుస్తారు. నేను పుట్టగానే ఒక పదిహేను నిముషాలు ఏడవలేదు, నవ్వలేదు , కదలలేదు. నేను ఎందుకు పనికి రాను అని మా నాన్న డిసైడ్ అయిపోయాడు అప్పుడే నేను కదిలా .కదలగానే మా నాన్న మిస్టర్. పెర్ఫేక్ట్ , మిస్టర్. పెర్ఫేక్ట్ నిన్ను నేను చేస్తా మిస్టర్. పెర్ఫేక్ట్ అని పాట పాడాడు . ఆయనకీ ఏమి తెలుసు మనం పూర్వ జన్మలో టీవీ 9 రిపోర్టర్ అని వాలని ఎప్పటికి మార్చలేము అని. ఆ కలలతోనే ఒక రోజు మా నాన్న టీవీ చూస్తున్న నా దగ్గరకి వచ్చి రేయి పెద్దతే ఏమవుతావు అన్ని అడిగాడు. నేను పోలీసు ఆఫీసర్ అవుతాను అన్న. మహా ఆనందంతో ఎందుకు నాన్న అన్నాడు. అప్పుడు అయితే నస పెట్టె అందరు తండ్రులని జైలులో పెట్టచు కదా నాన్న అన్న.

ఆ తర్వాత ఒక శుభ ముహూర్తం చూసి బడిలో చేర్చారు. భయపడుతూనే, ఇంతక ముందు అడిగిన ప్రశ్నే మల్లి అడిగాడు మా నాన్న. ఈ సారి కొంచెం వెరైటీగా టీచర్ అవుతాను అన్న. దీనికి ఏమి చెప్తానో అని ఎందుకు అన్నాడు. టీచర్ అయితే క్లాస్సులో కూడా నిద్ర పొవచు నాన్న అని సమాధానం ఇచ్చా . మా నాన్నకి ఏమి అయిందో తెలిదు కాని సుత్తి వీరభద్ర రావు లాగా చొక్కా చించుకున్నాడు. నాన్న చొక్కా తీయడానికి గుండిలు ఉపయోగించాచు నాన్న అన్న.

మా నాన్నకి భయం పట్టుకింది ఇలాగే ఉంటే చివరికి తెలుగు సినిమా హీరోగా తప్ప ఎందుకు పనికి రాను అని. వెంటనే నా పెళ్లి కుదిర్చారు. అవును నా పెళ్లి కుదిర్చారు. అమ్మాయి ఎవరో కాదు నేను ఎంతో ప్రేమతో రెండు మూడు సార్లు రాయతో కొట్టిన సుబ్బారావు అంకుల్ కూతురు సుందరి. సుందరి గురించి చాలా చెప్పాలి. సుందరి నేను పుట్టిన ఆరు నేల్లలకి పుట్టింది . అందరు నాకు పెళ్ళాం పుట్టింది అన్నారు. బ్రహ్మ సుందరి వీపు మీద జంపింగ్ పెళ్ళాం అని రాసాడు, లేక పోతే అందరికి ఎలా తెలిసిపోయిందో.

సుందరి పేరు నేను ఫస్ట్ టైము విన్న సంఘటనా నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజు ఎప్పుడు లేనిది మా నాన్న స్వీట్లు తెచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే నాకు, అమ్మ కి స్వీట్ ఇచ్చి తను ఒకటి తిన్న తర్వాత ఒకటి మిగిలింది. మా అమ్మ అది చూసి మూర్చ పోయింది. లేచిన తర్వాత మా అమ్మకి చెప్పాడు సుందరి ఈ రోజు మొదటి సారి మా నాన్నని మామ అని పిలిచి ఈ స్వీట్ బాక్స్ ఇచ్చింది అని. మా అమ్మ ముందే చెప్పచు కదండీ మీరు ఎక్కడ మామ్ములు మనిషి అయ్యారు అన్న ఆనందం ముర్చపోయాను అనవసరంగా అంది.

తర్వాత చాలా రోజులు మా నాన్న రోజు ఏదో ఒకటి చెప్పేవాడు సుందరి గురించి . సుందరి నా వెనక పరిగితింది ,సుందరి నన్ను చూసి నవ్వింది ( అప్పుడే తెలిసి పోయిందా మీరు జోకర్ అని అనుకున్న మనస్సులో ) , సుందరి పుస్తకం తీసుకొని ఏదో రాస్తోంది , సుందరి చీదింది , సుందరి తుమ్మింది, సుందరి దగ్గింది అలా . ఇంకా నన్ను మొదటి రోజు స్కూలో చేర్పించే అప్పుడే ఆ అమ్మాయిని కూడా స్కూలో చేర్పించారు. నన్ను చూడగానే నువ్వేనా ఎందుకు పనికి రాని అంకుల్ కొడుకువి అంది. స్కూలో అందరు నవ్వారు. ఆ రోజే బుక్ తీసుకొని సుందరి పేరు రాసేసి దాని ఒక వందసార్లు కొట్టేసా. ఆ పక్కనే దానికి కొత్త పేరు పెట్ట శసే (శంకలో సేగ్గడ ). ఇవ్వని కాకుండా ఇంకా చాలా చెడ్డ లక్షణాలు ఉన్నాయి శసేకి ఏ రోజు కూడా హోం వర్క్ రాయకుండా రాదు, టీచర్ అడిగిన అనిట్టికి టక్కుమని జవాబు చెప్తుంది, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ . వీటి అనిట్టికి అంటే పెద్ద చెడ్డ అలవాటు ఏమిటి అంటే హ్యాండ్ రైటింగ్ చాలా చాలా నీటుగా రాస్తుంది. దీంతో నిన్నటి దాక ఇంట్లో జరిగేదే స్కూలో కూడా మొదలు అయ్యింది. సుందరిని చూసి రాయి, సుందరిని చూసి నేర్చుకో , సుందరి లాగా నీటుగా ఉండు. దాంతో కోపం పెరిగిపోయి రోజు ఉదయానే ఒక కాగితం మీద సుందరి పేరు రాసి దాని తగలపెట్టి నాలో కోపాని చల్లరుస్తున్న.

ఇక మూడో క్లాస్లోనే మా పెళ్లికి కారణం, ఇలాగే కంటిన్యూ అయితే నాకు భవిష్యతులో శసేతో పెళ్లి కాదు అని. కాని మా నాన్న అందరికి చెప్పే కారణం వాళ్ళ అమ్మ చనిపోయే లోపు నా పెళ్లి చేయాలి అని . దీని వాళ్ళ మా నాన్నకి వచ్చే అవకాశం ఏమిటి అంటే నాకు శసేని కాపలా పెట్టచు స్కూల్లో అని. ఆ రోజు సెప్టెంబర్ 30, 1993 తెల్లవారు జామున 03:56 కి. ఆ రోజు అదే టైముకి లాటుర్ అనే ఊర్లో బూకంపం వచ్చి పది వేల మంది పోయారు, ఆ బూకంపంలో బతికిన ముప్పై వేల మంది మేము ఇద్దరం చావడానికి ఇంకా పూజలు చేస్తున్నారు.

ఆ రోజు నుండి నా బాత్రూమ్లో , నేను నిద్రపోయేటప్పుడు తప్ప మిగత టైము అంత నా వెంటనే ఉంది శసే. నేను అబ్బాయిలతో ఉన్న కూడా నా వెనకాలే ఉండేది. అందుకే అందరు నన్ను పాడు అయిన పాత టీవీ చూసినట్టు చూసే వారు, పారేయాల వద్ద అని. ఈ గొడవ తప్పించుకోవడానికి చాలా కష్టపడి జాగ్రతగా తప్పులు లేకుండా ముందరి వాడి దాంట్లో కాపి కొట్టి మంచి మార్కులు తెచ్చుకున్న. మా నాన్న ఆనందంతో ఎగిరి ఫుట్బాల్ ప్లేయర్ కొట్టినట్టు మా ఫ్యాన్ని కొడితే అది గిరగిర తిరుగుతూ వెళ్లి బయట పడింది. తలకి దెబ్బ తగిలి అన్నాడో మాముల్గా అన్నాడో తెలియదు కాని ఎప్పటికి ఇంక శసే నా వెనకే ఉంటుంది అన్నాడు. వెంటనే నా కళ్ళ ముందు శసే హాహాకారం చేస్తూ నడుస్తోంది , చేతిలో ఒక బెల్టు పట్టుకొని పోతోంది. అలా ఆ గొలుసుని ఫాలో అవతు వెనకకి వెళ్తే అ బెల్టుకి రెండో చివర నా మేడలో ఉన్న చైన్ కట్టేసుంది.

ఆ రోజు నుంచే నేను శసే బానిసను అయ్యిపోయా. రూల్స్ మీద రూల్స్ పాస్ చేసేది . టీవీలో వచ్చే అని సిరియల్స ఫాలో కావలి, క్రికెట్ ఛానల్ పెట్టకూడదు , ఐటెం సాంగ్స్ వస్తే టీవీ అప్పేయాలి. ఉదయానే లేవాలి , రోజు పళ్ళు తోముకోవాలి స్నానం చేయాలి. ఉదయానే లేవమన్నావు ఓకే రాత్రి తొందరగా నిద్ర పోయి లేస్తా, పళ్ళు తోముకోమన్నావు రోజు కాకపోయినా రెండు రోజులకి ఒక సారి ట్రై చేస్తా మరి రోజు స్నానం చేయాల నా వల్ల కాదు అన్న. ఫైర్ ఇంజెన్ కూత వినిపించింది ఇల్లంతా నీలు ఏమిటా అంటే శసే ఏడుస్తోంది . లాట్టేరిలో కోటి రూపాయలు దొరికిన వాడిలాగా ఆనందపడ్డ మా నాన్నని చూడగానే ఒక నమ్బెర్లో మిస్ అయ్యిన వాడిలాగా పెట్ట మొహం. ఆ రోజు ఉదయానే నన్ను చెక్ చేయడామే పనిగా పెట్టుకుంది. మనం దొరుకుతామ ఒళ్ళంతా స్సెంట్ కొట్టేసి, నోట్లో మింట్ వేసుకొని ఒంటి మీద అలా అలా నీలు చల్లుకొని వచ్చేవాడ్ని.

ఒక రోజు మా మాస్టారు నీకు ఏమి ఆటలు వచ్చు అన్నాడు. నేను ఏమి చెప్పకుండా అలానే ఉండిపోయా . మా మాస్టారు తిట్లదండకం మొదలు పెట్టాడు. శసే లేచి కుంధుడుగుమ్మ , బారాకట్ట, చింత పిక్కలు , అచంగాయలు అన్ని వచ్చు అంది. క్లాస్సు అంత తెగ నవ్వారు . ఇన్ని బాధల మధ్యలో నాకు దొరికే ఒకే ఉపసమనం బాత్రూం. ఎక్కువ సేపు బాత్రూమ్లో గడపడం మొదలు పెట్టాను.

చూస్తుండగానే నా భానిసత్వానికి ఒక ఏడు యేలు గడిచాయి. ఏడు యేలు అయ్యింది ఇంక వద్దలచు కదా ఈ శని అనుకుంటూ లేచా . ఆ రోజే మా మొదటి రోజు కాలేజిలో ఇకనైనా ఎవరు అయిన అమ్మాయికి లైన్ వేయాలి అనుకున్న. కాని శసే జాలి, దయ, కరుణ వల్ల ఒక అమ్మాయి కూడా తల తిప్పి నన్ను చూడలేదు. తానూ ఒకటి తలిస్తే అధిష్టానం ఒకటి తలిచింది అంటారు ఇదే కాబోలు. ప్రైమ్ మినిస్టర్ అయిన ఇంకా సోనియా గాంధి మాట వినే మన్ మోహన్ సింగ్ లాగ ఉంది నా పరిస్థతి. అది రేంజ్లో కల్లెజ్ మూడు యేలు గడిచిపోయాయి. కాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయ్యా. పూణేలో ఉద్యోగం. ఆఫర్ లెటర్ తీసుకొని బయటకి వచ్చే సరికి ఆత్రంగా ఎదురు చూస్తోంది శసే . జాబు వచ్చింది అని చెప్పా. మరి ఏడుస్తున్నావు ఏమిటి అంది. ఇప్పుడు కాదు నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి ఏడుస్తున్నాను అని మనస్సులో అనుకోని లేదే అన్న బయటకి. నా చేతిలో కాగితం లాకొని పూణేనా అని ఫైర్ ఇన్జన్ స్టార్ట్ చేసింది. ఏమి అని తన చేతిలో ఉన్న ఇంకో కాగితంలో చూస్తే తెలిసింది శసేకి జాబు వచ్చింది కాని చెన్నైలో . ఇప్పుడే వస్తాను అని వెళ్లి బాత్రూంలో హ్యాపీగా ఎంజాయ్ చేశా.

అదే ఆనందంతో ఇంటికి వెల్ల . మా వీధి అంత స్వీట్స్ పంచా. నా మీద చాలా రోజులుగా ఆశ పెట్టుకున్న పక్కింటి పారిజాతం మొబైల్ నెంబర్ తీసుకున్న . అందరు నాకు ఉద్యోగం వచ్చినందుకు అనుకున్నారు . శసే ఏడుస్తూనే ఉంది ఇంట్లో. ఉత్తరాలతో మాట్లాడుకునే అందరి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పేసా. రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చా. ఇంట్లో అంత ఏదో హడవుడి హంగామా. పంతులు గారు వచ్చి ఉన్నారు. ఈరోజు నుంచి మూడో రోజు మంచి మూహుర్తం అన్నాడు. ఉద్యోగం వచ్చింది అని ఏది అయిన వ్రతం చేస్తున్నరులే అనుకున్న. శాస ఏడుపు మొహం చూడడానికి ఆమె రూమ్లోకి వెల్ల. ఆశ్చర్యం ఏడుపులు లేవు. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటోంది . ఎప్పుడు లేనిది మీద మీదకి వస్తోంది. వచ్చి చెవిలో ఒక వార్త చెప్పి సిగ్గు పడుతూ వెళ్ళిపోయింది. బాత్రూమ్లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్న. అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నన్ను పట్టించుకోకుండా. ఇంతక ముందు తీసుకున్న అమ్మాయి మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి విషయం చెప్పా. ఆ అమ్మాయి జంపింగ్ నువ్వు ఇప్పటి దాక ఎన్ని జమ్పింగులు అయిన చేయచు కాని ఈ మూడు రోజుల తర్వాత జమ్పింగులు చేస్తే డైరెక్టుగా హేల్లుకే జమ్పింగు చెయ్యాలి అని చెప్పి ఫోన్పెట్టేసింది. ఆ టైములో బాత్రూంలో ఉన్న బేసిన్లో దూకి ఆత్మ హత్య చేసుకుందాం అనుకున్న కాని కుదరలేదు. కన్నీలు తుడిచి తుడిచి తడిసిపోయిన నా పాత డ్రాయార్ ఆరేలోపే ఆ మూడో రోజు వచ్చేసింది.

ఈరోజే ఆ మూడో రోజు ఇప్పుడు నేను పాత జైలు నుండి కొత్త జైలుకి మారపోతున్నాను. కొత్త జైలు గురించి తొందరలో మాట్లాడుకుందాం. బై ... బై ... లెగ్ బై..

ఆగు ఆగు అస్సలు విషయం చెప్పి వెళ్ళు.

ఈ రాత్రే నా జీవితంలో మిగిలిన మిగతా జంపింగ్ జంప్ అయ్యి వెళ్ళిపోయే రాత్రే . మగ వాళ్ళని అందరిని ఆడవాలు కంట్రోల్ చెయ్యడానికి ఉపయోగించుకున్నే రాత్రే . ఆ రోజే మొదటి రాత్రి. మొద్దుగా దానే శోభనం అంటారు.
అదే ఈ రాత్రే నా శోభనం .. నా శ్రాద్ధం .

Thursday, December 31, 2009

ఆవకాయ జాడి

అవి మద్రాస్లో నేను బ్రహ్మచారిగా ఉన్న రోజులు. ఆ రోజు అన్ని రోజుల లాగే ఎదురుగా ఉన్న గాజు సీసాలో ఉన్న ఉప్పు ,కారం చూస్తూ మా కాంటీన్లో భోజనం చేస్తున్న., ఆహ నా పెళ్ళంట సినిమాలో కోటా లాగ . ఆ రోజు నా పక్కన కూర్చొన నా స్నేహితుడు ఎంటిరా ఎటో చూసి తింటున్నావు అన్నాడు. ఇవ్విగో ఈ ఎరుపు , తెలుపు రంగులో ఉన్నాయే వాటిని చూస్తూ తింటున్న అన్న. ఏమీ అయ్యింది తెలీదు నా ఎదురుగా ఉన్న అమ్మాయి “ఉన్నకు వెక్కం ఇల్లే .. నీ మనిషనా అని వెళ్ళిపోయింది” ( "నీకు సిగ్గు లేదా , నువ్వు మనిసివేన ") . ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి తెల్ల రంగు చీర ,ఎర్ర రంగు జాకెట్ వేసుకుంది. ఆ అమ్మాయినే అన్నాను అనుకోని తిట్టింది.
మా వాడు రంగుల పేర్లు కాకుండా వాటి పేరే చెప్తే ఈ తిట్లు తప్పేవి కదా అన్నాడు. ఇంకో రెండు నెలలు ఇదే తిండి తింటే నిజంగానే వాటి పేర్లు మర్చిపోతా మామ అన్న. ఆ రోజు మా వాడికి ఏమీ అయ్యింది తెలీదు కాని సరే మామ వాటి పేరు వాటి రుచి నీకు చూపిస్తా వచ్చే మా ఇంటికి ఈ రోజు రాత్రి నా పెళ్ళాం వంట చేసిపెడుతుంది అన్నాడు.
సాయంకాలం ఆనందంగా ఇంటికి వెళ్లే సరికి ఇల్లు క్లీన్ చేస్తోంది మా పనిమనిషి . ఒక సీస తీసి పారేస్తాను అని సైగ చేసింది. నేను సినిమాలో చూపించినట్టు నో……. అని పరిగితి స్లోమోషన్ లో వెళ్లి దాని క్యాచ్ పట్టుకున్న. అది మూడు నెలల క్రితం అయ్యి పోయిన ఆవకాయ సీస. నిద్రపోయే ముందు లేచిన తర్వాత ఒక సారి దాని వాసన చూసుకుంటా అది పారేస్తే ఎలా ఎలా అని లోపల పెట్ట.
రోజు లాగా కాకుండా కొంచెం పద్దతిగా తయారు అవ్వాలి అని వెళ్ల బాత్‌రూంలోకి. కొల్లాయి తిప్పగానే ఆశ్చర్యం , ఆనందం , వింత , విడ్డూరం .. నీలు వస్తున్నాయి. ఆ ఊహించని సంఘటన నుండి కోలుకొని స్నానం చేయడం మొదలుపెట్ట. నిజాయితీ పెంచుకోవడం కోసం సబ్బు బాగా రుద్దా. రేయి ... ఉన్న నిజాయితీ చాలు ఇంకా ఆపు అన్న ఆకాశవాణి మాటలకు సబ్బు రుద్దడం ఆపి వంటి మీద నీలు పోసుకున్న. ఉన్న నీలు అయిపోతునాయి కాని సబ్బు వదలటంలేదే. ఇక ఏమి చేస్తాం , వెళ్లి తువాలుతో నిజాయితీని తుడిచేశా.
టైము ఆరు అయ్యింది మోగింది మృత్యు గంట . అదే నండి నా మొబైల్. హ౦టి౦గ్. అని పడింది . ఈ పేరు చూడగానే ఎర్ర మీట మీద కి వెళుతుందని చెయ్యి. కాని పచ్చ మీటే నొక్కుతుంది. హ... లో అనే గ్యాస్లో మొదలు. ఈ రోజు ఏమి అయ్యింది తెలుసా పప్పా మా అమ్మ ఈ రోజు మార్కెట్‌కి వెళ్ళిందా. అక్కడ ఎర్ర ఎర్రగా ఉండే రెండు కిలోలు టమోటాలు , మూడు కాడలు పచ్చటి కరివేపాకు .. అంటు ఏదో చెప్తోంది . అప్పుడు నా ఆలోచన మొదట్లో అన్న పప్పా దగ్గర కి వెళ్ళింది. నా గర్ల్ ఫ్రెండ్ రోజు ఒక పేరుతో పిలుస్తుంది. కాకపోతే ఆ పేర్లకి ఎక్కడ నుండి వస్తా యో నాకు అర్థం అయ్యేది కాదు. ఈరోజు అర్థం అయ్యింది. అది నా గర్ల్ ఫ్రెండ్‌కి చాల కాలంగా ఇష్టం అయిన కుక్క పేరు. ఆ కుక్కకి చాల చరిత్ర ఉంది. ఆ కుక్క నా గర్ల్ ఫ్రెండ్ ఒకే రోజు పుట్టారు. కుక్క వాళ్ళ అమ్మ దానికి బర్డే పార్టీ చేస్తూ౦టే, నా గర్ల్ ఫ్రెండ్‌కి తెలిసి తీసుకుని వచ్చేసింది అని నా అనుమానం. లేక పోతే వీధి కుక్కలు కూడా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని తిరిగుతుండాలి. ఇంకా ఆ పప్పా నా మొగుడు , అదే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, కాగితాల తడిపితే ఆయనకు కోటి రూపాయల టె౦డర్ వచ్చింది అట. ఇది చెప్పగానే మా రూం మేట్స్ అంత వాళ్ళ వాళ్ళ రెసుమే తీసుకొని ఆ కుక్క వెనకాలే తిరిగారు అది వేరే కథ .ఆ కుక్క రోజు నా గర్ల్ ఫ్రెండ్ బెడ్‌లోనే నిద్ర పోతుంది. రోజు దానికి ముద్దు పెట్టందే బయటకి రాదు. అలా నా ఆలోచనలలో ఉండగానే టైము ఏడు అయింది. నా గర్ల్ ఫ్రెండ్ ఫోను పెట్టేసింది. ఆ గంటలో చెప్పింది రేపు కలుదాం అని.
ఈ గంటకి నా వళ్ళంతా బంక బంకగా జిడ్డు జిడ్డుగా తయారు అయింది. నిజాయితీకి ఇక టైము లేదు దాంతో అక్కడే పడి ఉన్న మల్లెపువ్వు వాసన వచ్చే రూం ఫ్రెషర్‌ కొట్టుకున్న. మా నాన్న కొన్ని ఇచ్చిన కొత్త పైజమా , జుబ్బా తీసా. బాగా సత్తాయి౦చి౦ది. ఎంత అయిన కొన్ని ఒక రెండేలు అయింది కదా. పట్టడం కష్టమే. ఎలాగో కష్టపడి ఇరుక్కున్న దాంట్లో. ఉత్సాహంగా కిందికి దిగా మా ఇంటి ముందు ఒక చిన్న కొలను వచ్చేసింది. ఏమిటి రా ఇది ఎప్పుడు వచ్చింది అని మా వాచ్ మ్యాన్ అడిగితే ఇప్పుడే సార్ ఒక పది నిముషాలు వర్షం పడింది.
పైజమా తీసి చేతిలో పట్టుకొని అలా నీలలో ఈదుకుంటూ ఒక ఓడు చేరా. అందరు నేను ఏదో డ్రైనేజి పని కోసం వచ్చాను అనుకొని మనకి అర్థం కాని తమిళం లో బండ బూతులు తిట్టారు. దొరికిన ఫుట్ పాత్ కింద మల్లి పైజమా వేసుకొని వెళ్లి బస్సు స్టాపులో ఆగాను. బస్సు స్టాపులో నేను ఇంకో అమ్మాయి మాత్రమే ఉన్నాము. బస్సు ఎక్కాను, అంత మల్లెపువ్వు వాసన. అందరు అమ్మాయి వైపు చూసారు. నేను కూడా చూసా నా మీద డౌట్ రాకుండా. కింద నా గొడుగు పెట్టబోతూ చూసా బస్సు ఆ వైపుకు వాలి పోయింది. ఇన్నాలు జనం వల్ల బస్సు వాలి ఉంటుంది అనుకున్న కాని ఈ రోజే అర్థం అయ్యింది ఆ బస్సు అంతే అని.
ఎలాగో చివరికి ఎనిమిది గంటలకు వాడి ఇంటికి చేరాను. తలుపు బయట ఏవో గిన్నెలు , గరిటెలు సొట్ట పడి ఉన్నాయి. నా కోసం చాల చేయడానికి ఇవి బయటకి తీసి ఉంటారు అనుకున్న. అంతలో ఒక పెద్ద అరుపు ఇంకో సారి పిలిచావో పది రోజులు నీ చేతే వంట చేయిస్తా. తరుగు, తరుగు మూసుకొని పెద్ద హీరో లాగ పిలిచావుగా అంటున్నారు. అయిన సరే దైర్యం చేసి తలుపు కొట్టాను . తలుపు తీసి మామ వచ్చావా అన్నాడు. నాకు అది ఎందుకు వచ్చావు అన్నటు వినిపించింది. వాళ్ళ కొడుకు ఎగురుకుంటూ వచ్చి వీడేనా నీ ఫ్రెండ్ అన్నాడు. సరిగా తెలుగు రాదు లేరా మా వాడికి అన్నాడు . ఇప్పుడు కూడా అవకాశం ఉన్నింది వెళ్ళిపోడానికి కాని ఎర్ర రంగు, తెల్ల రంగు పొడి వేసిన వంటల కోసం ఆగాను. వాడి వైఫ్ బయటకి వచ్చింది . ఆమెని చూడగానే పరిగెత్తాలి అన౦త భయం వేసింది. అమ్మాయిలో ఏమి లోపం లేదు. కాని ఆ అమ్మాయి మా జూనియర్ బాగా నస పెట్ట ఆ రోజుల్లో.

ప్లీజ్ వాడు ఖాళీగా కూర్చొని ఏమి చేస్తాడు, ఇవ్వవే ఆ రిమోట్. నువ్వు చెప్పిన ఛానెల్స్ మాత్రమే పెడతాం మిగతా చానెల్స్ లాక్ చేసావు కదా. ఎలాగో టి. వి రిమోట్ తెచ్చి నవ్వుల చాన్నెల్ పెట్టాడు, ఆ సీన్లో కమెడియన్ తన భార్యతో నా మాట వి౦టే టా౦క్ బ౦కు మీద శిల కట్టిస్తా లేదా హుస్సేన్ సాగర్లో తోస్తా అన్నాడు నాకు నవ్వొచి౦ది. కిచెన్‌కి పరుగెడతాడు నా ఫ్ర౦డ్ కొడుకు. అమ్మ అమ్మ .. ఆ అ౦కుల్ పెద్ద వెధవ లాగ ఉన్నాడు అన్నాడు. నా మనసులో వీడికి అప్పుడే ఎలా తెలిసి౦దా అనుకున్నాను. చూడు అమ్మ వైఫ్‌ని తిడితే నవ్వుతున్నాడు అన్నాడు. మా వాడు నాలుగు రోజుల ను౦చి ల౦కనాలు చేసినవాడి లాగా పెట్టడు మొహ౦.రిటన్ ఆఫ్ దా డ్రాగన్.. ఈ సారి ఏవో హాట్ పాక్ పట్టుకొచి౦ది. అమ్మయ్య అస్సలు పని దగ్గర కి వచ్చా౦ తొ౦దరగా ఐపోతే వెళ్లిపోవచ్చు అని ఆన౦దపడ్డా.
మా వాడు ఎదురు వెళ్లి ఆమె చేతీలో౦చి ఆ గిన్నెలు తీసుకొని సాయ౦ చెసాడు. ర౦డి కూర్చొ౦డి అ౦ది ఆ ఎక్సప్రషన్ మాత్ర౦ రా తిన్ని చావు వచ్చి౦ది దీనికెగా అన్నట్టుగా ఉ౦ది. అయినా మనకి ఎమి సిగ్గు అని వెళ్లి కూర్చున. మొదట గిన్నె తీసి౦ది ఎదొ పచ్చ ర౦గులొ వేసి౦ది. ఎదొ స్పెషల్ అనుకున్నా, మా వాడు అన్న౦ ఇ౦కొ౦చె౦ పెట్టు అ౦ది... పచ్చ ర౦గు అన్నమా... తరువాత గిన్నె తీసి ఎర్ర ఎదొ పొసి౦ది , సా౦బార్ అనుకున్నా... పప్పు చాల అ౦కుల్ అన్నాడు. ఎదొక్కటి తి౦దా౦ అని నొట్లొ పెట్టి ఒక బయ౦కరమైన ఎక్సప్రషన్ పెట్టాను... ఎమి అన్నయ్య ఉప్పు ఎక్కువా? కార౦ ఎక్కువ? ఎవ్వ౦డి మీరు తిన్నాదు ... అబే అదె౦లేదు అన్నా మొహమాట౦గా. అప్పుడు చెప్పి౦ది ఉప్పు, కార౦ ఆరోగ్యానికి మ౦చిది కాదు అన్నయ్య అ౦దుకే మా ఆయనకి ఆసలు పెట్టాను. ఎదొ మీరు వచ్చారు అని ఈ ఉప్పు, కార౦ వెస్సా అ౦ది. అప్పుడు నాకు ఆ ఉప్పు లెని పప్పులోకి దూకి ఈత కొట్టకు౦డా చచ్చిపొద్దా౦ అనుకున్నా. కాని ఆ అమ్మాయి మా ఆయన మా౦స౦ తి౦టే కొవ్వు ఎక్కువ అవ్తు౦ది అన్నయ్య అనుటు౦ది అని ఆ సాహస౦ ముగి౦చా. సరేలే తరువాత వచ్చేవి బాగా ఉ౦టాయి అని చూస్తున్న. ఇ౦కా ఎమి కూరలు ఉన్నాయి అని చూస్తున్న అని గమని౦చి , తరువాత ఎమి తి౦టారు పచ్చి బటానీలా కూర ఉ౦ది, ఇ౦కా నానపెట్టిన దుమ్పలు, మాడా పెట్టిన బె౦డకాయల కూరా అన్నిటి క౦టే ఈ రొజే నెను మొదటి సారి తయారు చేసిన మ౦చి నీల్లతో ఫ్రై చేసిన అప్పడాలు. అన్ని తిని సూపర్ బ౦పర్ అన్నెసా. చివరి ఆశగా ఊరగాయ ఉ౦దా అన్న .. ఎ౦త మాట అన్నారు, మా వాడు వి౦టే ఇ౦కేమి అయిన ఉ౦దా. ఊరగాయలు , పచ్చడులు మా ఇ౦ట్లొ నిషేద౦. చివర్లో స్వీట్ పెట్టి౦ది ఏమి ఎక్స్పెక్ట్ చేయకు౦డా.. ఎనిమిదవ అద్బుత౦ జరిగి౦ది.. ఆ స్వీట్లో స్వీటనెస్ లేదు. అని తిన్ని అన౦దభాష్పాలు కారుస్తు డొక్కు బస్సు ఎక్కి ఇ౦టికి వచ్చా. నా పరిస్థితి అద్వాన౦.. ఈ రోజు రోజు నా ము౦దు ఉ౦డే ఎర్ర ర౦గు, తెల్ల ర౦గు సీసాలు కూడా లేవు.

ఇ౦టికి వెళ్లి ఎడుస్తు నిద్ర పోయ, చెతీలొ ఉన్న పాత ఆవకాయ సీసా వాసన చూస్తూ.

----------------------------------------------------------
నూతన స౦వత్సర శుభాక౦క్షలు

Wednesday, December 9, 2009

మా చంద్రబోస్ పాట

ఇంకా సినిమాలో ఇంజినీర్ల మీద జోక్లు రాని రోజులు అవి. అతి ఉత్సాహంగ పెద్ద విశ్వ విద్యాలయం లో ఇంజనీరింగ్ చేరాను. ఒక మూడు నేల్లలు పరిచయాలు , కొత్త కొత్త ఆటలు. ఆటలో ఒక ఆట మాత్రం నాకు మహా ఇష్టం. మా సీనియర్ ఒక కొవ్వొత్తి వెలిగించేవాడు నన్ను ట్యూబ్ లైట్ వెలిగించామనేవాడు . ఆయన ఉఫ్ అని ఉది కొవ్వొత్తి ఆపేస్తే నేను ఉఫ్ అని ఉది ట్యూబ్ లైట్ ఆపాలి ఎవరు ముందు ఆపేస్తే వాలు గెలిచినట్టు. గెలిచినా వాళ్ళకి ఓడిన వాళ్ళు పార్టీఇవ్వాలి . బాగా ఉంది కదా ఆట. దీని మాముల్గా ఇంగ్లీష్ బాషలో ర్యాగ్గింగ్ అంటారు. ఈ పరిచయాలు మితిమించి మాకు మోక్షం కలగకుండా ఒక చిన్న గ్రిల్ కట్టి దానికో తాళం వేసారు.

అలా మూడు నేల్లలు గడిచేసరికి చాల పరిచయాలు చేసుకున్నాం. కానీ ఒకే క్లాసు లో ఉండే వాళ్ళకి అంత గొప్పగా పరిచయాలు లేవు . అందుకే అందరు కలిసి టూర్ వెళ్ళాలి అని ప్లాన్ వేసారు. ప్రిన్సిపాల్ కాలు గడ్డలు పట్టుకున్నాం. అయన తిట్లకి సిగ్గుపడ్డం , ప్రశ్నలకి ఆయసపడ్డం చివరకి ఒపుకుంటే బయటపడడం. టూర్ అనగానే మేము రాము అనడానికే ఒక టీం ఉంటుంది . ఆ టీమునే తెలుగు బాషలో అమ్మాయిలు అంటారు. నేను రాను మా నాన్న ఒప్పుకోడు , మా పక్కింటాయన ఒప్పుకోడు అని కథలు చెప్తారు.
ఇలాంటి అప్పుడే సిగ్గు. శరం. బుద్ది. జ్ఞానం వదిలేసి చాల పన్లు చేయాల్సి ఉంటుంది. మొదట అమ్మాయిలని ఒప్పించాలి , అంటే హిట్లేర్ లో చిరంజీవి లాగా నేను ఉంటాను మీకు అని నమ్మకం కలిగించాలి. వాళ్ళ అమ్మ బాబుల్ ని ఒప్పించాలి ఇది చెప్పడానికి వీజీయే కానీ మేనేజ్ చేయడమే కష్టం. తలకి నీట్గా కోబరి నూనే పెట్టుకొని నల్ల ప్యాంటు వేసుకొని తెల్ల చొక్కా ఇన్-షర్టు చేసి వెళ్ళాలి. వెళ్ళేది అంత అబ్బాయిలే అయిన మొతం అమ్మాయిలే అన్నటు బిల్డుప్ ఇయాలి. ఇవ్వని అయ్యాక ఒక నాలుగు ఐదు ఫోన్ నుంబెర్స్ ఇవ్వాలి ఎప్పుడు వాళ్ళ బాబుకి మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు మాట్లాడానికి. ఇక్కడితో అయిపోదు ... ఆ అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి లైన్ వేస్తున్న ఆ వీడి రౌడీ గారిని , కాలేజీ లో చేరగానే లైన్ వేయడం మొదలు పెట్టిన సీనియార్ని , పక్క బ్రాంచ్లో లైన్ వేసే అబ్బాయిల్ని ఒప్పించాలి. ఇవ్వని అయ్యి బయల్దేరాపోతుండగా గుర్తుకు వస్తాడు ఒక వ్యక్తి. అ వ్యక్తికి బహునామదేయుడు.. కొందరు ఎ.టి. యం అని కొందరు నస అని కొందరు బోర్ అని అంటుంటారు. వాడుక బాషలో ఆయనే నాన్న అంటారు. అప్పుడు కోడ డబ్బులు ఉంటె గుర్తుకు రాడు , కానీ టూర్ ఉత్సాహం లో ఎని డబ్బులు సరిపోవు కదా. ఇంకో విషయం మేము వెళ్ళే టూర్ ఎక్కడకి ... అరకు. ఎడ్యుకేషనల్ టూర్ కి అరకుకి ఏమి సంబంధం అని అడిగితే మాత్రం చకలగిలి పెట్టి చంపేస్తా.

అని అడ౦కులు దాటి బస్సు ఏక్యం . గోవింద గోవింద అన్న అరుపుల మధ్య బయల్దేరింది బస్సు . ఎప్పుడో గాని స్నానాలు చేయని అబ్బాయిలు స్నానాలు చేసి, ఎప్పుడు మేకప్ చేసుకునే అమ్మాయిలు కొంచెం ఎక్కువ చేసుకొని కూర్చున్నారు బస్సులో. కాలేజీ ఆవరణం దాటింది నా కర్మ కాళింది. ఇప్పటిదాక మనుషులలాగా ఉన్న అబ్బాయిలు కోతులలాగా మారారు. ఒక్కడు కెవ్ అన్ని అరిస్తే ఇంకోడు బో అని అరుస్తున్నాడు. తల్లుపులు కిట్టికిలు పట్టుకొని వేలాడుతుంది ఒక బ్యాచ్. ఇంతలో డ్రైవర్ అరుస్తున్నాడు. విషయం ఏమిటంటే మా వాడు వెళ్లి నేను డబ్బులు ఇచ్చాను మర్యాదగా నీ సీట్ నాకు ఇవ్వు అన్నడు . ఈ తుఫానుకే తట్టుకోలేక పోతుంటే .. 2012 .. అదే తెలుగు లో యుగాంతం మొదలు అయ్యింది. ఇప్పటి దాక ఆకాశ లోకాలలో విహరిస్తున్న అమ్మాయిలు ఈ లోకానికి వచ్చేసారు. ఒక్కకరు వెళ్లి ఒక్కొకో అబ్బాయితో కూర్చున్నారు. టూరుకి పంపడానికి ఇంతమంది ఎందుకు ఒపుకోవలో అప్పుడే అర్థం అయ్యింది నాకు.
ఇక చేసేది లేక నోరుమూసుకొని వెళ్లి క్లీనర్ సీట్లో కూర్చొని ఏమి జరుగుతోందో చూస్తున్న. అమ్మాయిలు వాళ్ళ చిన్నపుడు పోగొట్టుకున్న పాపడి బిళ్ళ దగ్గర మొదలుపెట్టి ఈ మధ్యనే వరదలో కొట్టుకుపోయిన తన ఫేవరెట్ చున్నీ వరకు ఏదో సోది చెప్తున్నారు. అబ్బాయిలు అంత ఎంతో సరదాగా వి౦టునట్టు నట్టిస్తున్నారు. ఇంతలో ఎవరో అమ్మాయికి తన టాలెంట్ చూపించాలి అన్న ఉత్సాహం మొదలు అయ్యింది . వెంటనే అమ్మాయిల చెవిలో ఏదో గుస గుస గుస అంతే అందరు ఏక కంట౦తో అంత్యాక్షరి అన్నారు. ఆ గ్రూప్ లీడర్ వాళ్ళ వీధి చిత్ర అంట మన కర్మ . పాడుతా తీయగా ప్రోగ్రాంకి వెళ్తే పాడుతా చేదుగా పెట్టినప్పుడు పిలుస్తాను అన్నారు అంట అప్పటిదాకా కాలిగా ఉండకుండా ఇలా నలుగురికి వినిపించి పేరు తెచుకోవాలి అని ఆమె ఆశయం . అప్పుడే డ్రైవర్ ఒక ధర్మ సందేహం అడిగాడు ఈ అమ్మాయిలకి అంత్యాక్షరి తప్ప వేరే ఆట రాధా అని. వాళ్ళకి ఆ ఆటకంటే జీవితాలతో ఆడుకోవటం బాగా తెలుసు అని వర్ గారికి తెలియదు లెండి .

ఆ పక్క టీంలో చిత్ర అయితే ఈ పక్క అందరి దగ్గర టాలెంట్ చూపడానికి ముందుకు దుక్యాడు కవి ద్ర బోస్.. టెన్షన్ పడదు చంద్రబోస్ మాతో చదవలేదు .వాడికి ఆ పేరు రావడానికి కారణం ముందు ముందు మీకేతెలుస్తుంది.

మాఘ మాసం ఎపుడ్దోస్తుందో
మౌన రాగాల్లేని ణాలో
మంచు మబ్బు కమ్ము కొస్తుందో
మత్తు మత్తు ఎన్ని ఎల్లో
ఎవరంటే ఏటమ్మా వివరాలే గుట్టమ్మ
చికుబుకు చికు చిన్నోడోయమ్మ
ఆహ ఓహో అని మన చంద్రబోస్ అబో వాయ్యో అన్ని నేను.
ఇక మన చంద్రబోస్ టైం ... "మా" తో "మా" తో పడాలి అన్నారు కోరుస్ లో అమ్మాయిలు అంత

మందాకినీ మందాకినీ .. నీతో కొంచెం ఉందే పని
మందాకినీ ఈ చాందిని.. ఎక్కడికో చెప్పు మనం వేల్లేదని
కొంచెం అల పక్కకొస్తే దారే చెప్తా
కోకో కోలా తాగిపిస్తా నీచేతే ఉడత

ఛీ నా ఫస్ట్ సినిమాకి చక్రి మ్యూజిక్ కొట్ట. లేకపోతే ఈ పాట ఏమిటి ఆ లిరిక్స్ ఏమిటి. మీకు అర్థం అయ్యింది మన వాడికి చంద్రబోస్ అని . ఎక్కడ ఏమి కావాలి అంటే అది పాడేస్తాడు. జనరల్గా మన వాడికి కొంచెం జ్ఞాపక శక్తీ ఎక్కువలె.

త త ... త తో పడాలి అన్నాడు... మన చంద్రబోస్


తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం
అల సాగుతుంటే మేఘాల రాగం ఇల చేరుకుంటే..
తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం

నెక్స్ట్ మా తో..

చంద్రబోస్..
మా ఇంటి పెరటి జామ్ బనులని కుశలం అడిగే
మా తోట కోతేమో నీకోసమే చూసే
నిన్ను చుసేసాక ఇక ఆపలేక ఒంటికే కొవ్వు పట్టిందని



పెద్ద శబ్దం ... సడన్ బ్రేక్ .. క్లినేర్ ఒక పక్క వాంతులు .. ఇట్టు పక్క డ్రైవర్ ఫిట్స్ వచ్చిన వాడిలాగా కొట్టుకుంటున్నాడు. బస్సులో కొంత మంది చెవులు , కొంత మంది కళ్ళు చాల మంది ముకులు మూసుకున్నారు.

ఇక నేను జీవితంలో మల్లి ఆ టూర్ కి వెళ్ళలేదు .. మా క్లాసు లో ఎవరు ఎప్పుడు అంత్యాక్షరి పేరు ఎత్తలేదు