ఇంకా సినిమాలో ఇంజినీర్ల మీద జోక్లు రాని రోజులు అవి. అతి ఉత్సాహంగ పెద్ద విశ్వ విద్యాలయం లో ఇంజనీరింగ్ చేరాను. ఒక మూడు నేల్లలు పరిచయాలు , కొత్త కొత్త ఆటలు. ఆటలో ఒక ఆట మాత్రం నాకు మహా ఇష్టం. మా సీనియర్ ఒక కొవ్వొత్తి వెలిగించేవాడు నన్ను ట్యూబ్ లైట్ వెలిగించామనేవాడు . ఆయన ఉఫ్ అని ఉది కొవ్వొత్తి ఆపేస్తే నేను ఉఫ్ అని ఉది ట్యూబ్ లైట్ ఆపాలి ఎవరు ముందు ఆపేస్తే వాలు గెలిచినట్టు. గెలిచినా వాళ్ళకి ఓడిన వాళ్ళు పార్టీఇవ్వాలి . బాగా ఉంది కదా ఆట. దీని మాముల్గా ఇంగ్లీష్ బాషలో ర్యాగ్గింగ్ అంటారు. ఈ పరిచయాలు మితిమించి మాకు మోక్షం కలగకుండా ఒక చిన్న గ్రిల్ కట్టి దానికో తాళం వేసారు.
అలా మూడు నేల్లలు గడిచేసరికి చాల పరిచయాలు చేసుకున్నాం. కానీ ఒకే క్లాసు లో ఉండే వాళ్ళకి అంత గొప్పగా పరిచయాలు లేవు . అందుకే అందరు కలిసి టూర్ వెళ్ళాలి అని ప్లాన్ వేసారు. ప్రిన్సిపాల్ కాలు గడ్డలు పట్టుకున్నాం. అయన తిట్లకి సిగ్గుపడ్డం , ప్రశ్నలకి ఆయసపడ్డం చివరకి ఒపుకుంటే బయటపడడం. టూర్ అనగానే మేము రాము అనడానికే ఒక టీం ఉంటుంది . ఆ టీమునే తెలుగు బాషలో అమ్మాయిలు అంటారు. నేను రాను మా నాన్న ఒప్పుకోడు , మా పక్కింటాయన ఒప్పుకోడు అని కథలు చెప్తారు.
ఇలాంటి అప్పుడే సిగ్గు. శరం. బుద్ది. జ్ఞానం వదిలేసి చాల పన్లు చేయాల్సి ఉంటుంది. మొదట అమ్మాయిలని ఒప్పించాలి , అంటే హిట్లేర్ లో చిరంజీవి లాగా నేను ఉంటాను మీకు అని నమ్మకం కలిగించాలి. వాళ్ళ అమ్మ బాబుల్ ని ఒప్పించాలి ఇది చెప్పడానికి వీజీయే కానీ మేనేజ్ చేయడమే కష్టం. తలకి నీట్గా కోబరి నూనే పెట్టుకొని నల్ల ప్యాంటు వేసుకొని తెల్ల చొక్కా ఇన్-షర్టు చేసి వెళ్ళాలి. వెళ్ళేది అంత అబ్బాయిలే అయిన మొతం అమ్మాయిలే అన్నటు బిల్డుప్ ఇయాలి. ఇవ్వని అయ్యాక ఒక నాలుగు ఐదు ఫోన్ నుంబెర్స్ ఇవ్వాలి ఎప్పుడు వాళ్ళ బాబుకి మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు మాట్లాడానికి. ఇక్కడితో అయిపోదు ... ఆ అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి లైన్ వేస్తున్న ఆ వీడి రౌడీ గారిని , కాలేజీ లో చేరగానే లైన్ వేయడం మొదలు పెట్టిన సీనియార్ని , పక్క బ్రాంచ్లో లైన్ వేసే అబ్బాయిల్ని ఒప్పించాలి. ఇవ్వని అయ్యి బయల్దేరాపోతుండగా గుర్తుకు వస్తాడు ఒక వ్యక్తి. అ వ్యక్తికి బహునామదేయుడు.. కొందరు ఎ.టి. యం అని కొందరు నస అని కొందరు బోర్ అని అంటుంటారు. వాడుక బాషలో ఆయనే నాన్న అంటారు. అప్పుడు కోడ డబ్బులు ఉంటె గుర్తుకు రాడు , కానీ టూర్ ఉత్సాహం లో ఎని డబ్బులు సరిపోవు కదా. ఇంకో విషయం మేము వెళ్ళే టూర్ ఎక్కడకి ... అరకు. ఎడ్యుకేషనల్ టూర్ కి అరకుకి ఏమి సంబంధం అని అడిగితే మాత్రం చకలగిలి పెట్టి చంపేస్తా.
అని అడ౦కులు దాటి బస్సు ఏక్యం . గోవింద గోవింద అన్న అరుపుల మధ్య బయల్దేరింది బస్సు . ఎప్పుడో గాని స్నానాలు చేయని అబ్బాయిలు స్నానాలు చేసి, ఎప్పుడు మేకప్ చేసుకునే అమ్మాయిలు కొంచెం ఎక్కువ చేసుకొని కూర్చున్నారు బస్సులో. కాలేజీ ఆవరణం దాటింది నా కర్మ కాళింది. ఇప్పటిదాక మనుషులలాగా ఉన్న అబ్బాయిలు కోతులలాగా మారారు. ఒక్కడు కెవ్ అన్ని అరిస్తే ఇంకోడు బో అని అరుస్తున్నాడు. తల్లుపులు కిట్టికిలు పట్టుకొని వేలాడుతుంది ఒక బ్యాచ్. ఇంతలో డ్రైవర్ అరుస్తున్నాడు. విషయం ఏమిటంటే మా వాడు వెళ్లి నేను డబ్బులు ఇచ్చాను మర్యాదగా నీ సీట్ నాకు ఇవ్వు అన్నడు . ఈ తుఫానుకే తట్టుకోలేక పోతుంటే .. 2012 .. అదే తెలుగు లో యుగాంతం మొదలు అయ్యింది. ఇప్పటి దాక ఆకాశ లోకాలలో విహరిస్తున్న అమ్మాయిలు ఈ లోకానికి వచ్చేసారు. ఒక్కకరు వెళ్లి ఒక్కొకో అబ్బాయితో కూర్చున్నారు. టూరుకి పంపడానికి ఇంతమంది ఎందుకు ఒపుకోవలో అప్పుడే అర్థం అయ్యింది నాకు.
ఇక చేసేది లేక నోరుమూసుకొని వెళ్లి క్లీనర్ సీట్లో కూర్చొని ఏమి జరుగుతోందో చూస్తున్న. అమ్మాయిలు వాళ్ళ చిన్నపుడు పోగొట్టుకున్న పాపడి బిళ్ళ దగ్గర మొదలుపెట్టి ఈ మధ్యనే వరదలో కొట్టుకుపోయిన తన ఫేవరెట్ చున్నీ వరకు ఏదో సోది చెప్తున్నారు. అబ్బాయిలు అంత ఎంతో సరదాగా వి౦టునట్టు నట్టిస్తున్నారు. ఇంతలో ఎవరో అమ్మాయికి తన టాలెంట్ చూపించాలి అన్న ఉత్సాహం మొదలు అయ్యింది . వెంటనే అమ్మాయిల చెవిలో ఏదో గుస గుస గుస అంతే అందరు ఏక కంట౦తో అంత్యాక్షరి అన్నారు. ఆ గ్రూప్ లీడర్ వాళ్ళ వీధి చిత్ర అంట మన కర్మ . పాడుతా తీయగా ప్రోగ్రాంకి వెళ్తే పాడుతా చేదుగా పెట్టినప్పుడు పిలుస్తాను అన్నారు అంట అప్పటిదాకా కాలిగా ఉండకుండా ఇలా నలుగురికి వినిపించి పేరు తెచుకోవాలి అని ఆమె ఆశయం . అప్పుడే డ్రైవర్ ఒక ధర్మ సందేహం అడిగాడు ఈ అమ్మాయిలకి అంత్యాక్షరి తప్ప వేరే ఆట రాధా అని. వాళ్ళకి ఆ ఆటకంటే జీవితాలతో ఆడుకోవటం బాగా తెలుసు అని వర్ గారికి తెలియదు లెండి .
ఆ పక్క టీంలో చిత్ర అయితే ఈ పక్క అందరి దగ్గర టాలెంట్ చూపడానికి ముందుకు దుక్యాడు కవి ద్ర బోస్.. టెన్షన్ పడదు చంద్రబోస్ మాతో చదవలేదు .వాడికి ఆ పేరు రావడానికి కారణం ముందు ముందు మీకేతెలుస్తుంది.
మాఘ మాసం ఎపుడ్దోస్తుందో
మౌన రాగాల్లేని ణాలో
మంచు మబ్బు కమ్ము కొస్తుందో
మత్తు మత్తు ఎన్ని ఎల్లో
ఎవరంటే ఏటమ్మా వివరాలే గుట్టమ్మ
చికుబుకు చికు చిన్నోడోయమ్మ
ఆహ ఓహో అని మన చంద్రబోస్ అబో వాయ్యో అన్ని నేను.
ఇక మన చంద్రబోస్ టైం ... "మా" తో "మా" తో పడాలి అన్నారు కోరుస్ లో అమ్మాయిలు అంత
మందాకినీ మందాకినీ .. నీతో కొంచెం ఉందే పని
మందాకినీ ఈ చాందిని.. ఎక్కడికో చెప్పు మనం వేల్లేదని
కొంచెం అల పక్కకొస్తే దారే చెప్తా
కోకో కోలా తాగిపిస్తా నీచేతే ఉడత
ఛీ నా ఫస్ట్ సినిమాకి చక్రి మ్యూజిక్ కొట్ట. లేకపోతే ఈ పాట ఏమిటి ఆ లిరిక్స్ ఏమిటి. మీకు అర్థం అయ్యింది మన వాడికి చంద్రబోస్ అని . ఎక్కడ ఏమి కావాలి అంటే అది పాడేస్తాడు. జనరల్గా మన వాడికి కొంచెం జ్ఞాపక శక్తీ ఎక్కువలె.
త త ... త తో పడాలి అన్నాడు... మన చంద్రబోస్
తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం
అల సాగుతుంటే మేఘాల రాగం ఇల చేరుకుంటే..
తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం
నెక్స్ట్ మా తో..
చంద్రబోస్..
మా ఇంటి పెరటి జామ్ బనులని కుశలం అడిగే
మా తోట కోతేమో నీకోసమే చూసే
నిన్ను చుసేసాక ఇక ఆపలేక ఒంటికే కొవ్వు పట్టిందని
పెద్ద శబ్దం ... సడన్ బ్రేక్ .. క్లినేర్ ఒక పక్క వాంతులు .. ఇట్టు పక్క డ్రైవర్ ఫిట్స్ వచ్చిన వాడిలాగా కొట్టుకుంటున్నాడు. బస్సులో కొంత మంది చెవులు , కొంత మంది కళ్ళు చాల మంది ముకులు మూసుకున్నారు.
ఇక నేను జీవితంలో మల్లి ఆ టూర్ కి వెళ్ళలేదు .. మా క్లాసు లో ఎవరు ఎప్పుడు అంత్యాక్షరి పేరు ఎత్తలేదు
6 comments:
అద్భుతమైన సెటైర్. నాకు చంద్రబోస్ పాటలంటే చెడ్డ చిరాకు. ప్రాస కోసం యే దోషమైనా చేస్తాడు. పూర్వకవులు శృంగారాన్ని క్లిష్టమైన పదాలతో ఆచేదిస్తే, చంద్రబోస్ ఉన్న సభ్యతను బూతు కోసం చేదిస్తాడు.
నా బ్లాగ్ కి మీదే మొదటి కామెంట్. చాల చాల థాంక్స్..
నా బ్లాగ్ కి మీదే మొదటి కామెంట్. చాల చాల థాంక్స్..
బాగా నవ్వించారు.
Anna .. as usual ga... "erragaadesav" asalu.. narration adirindi.frankly..abrupt ga end chesesav anipinchindi.
asalu ammayila paina sattires maatram keeeekaaaaaaaaaaaa annna...
Post a Comment