ముక్కంటి అనే నేన్ను మా ఊరి సర్పంచ్ ఉంచుకున్న రంగమ్మ తమ్ముడు రవి గాడి పొలంలో పెరిగి ఎండిపోయిన గడ్డి పరక మీద ప్రమాణం చేసి నాకు నచ్చింది చెప్తాను మీకు నచ్చింది విన్నండి
దీనికి నా స్నేహితులు పంచావతారం , ఏడుకొండలు సాక్షం . ..
ఆ రోజు ఐదు , ఏడు కలిసి పన్నెండు .. ( ఐదు ఏడు కలిస్తే.. పన్నెండు అంట .. ఏమి తెలివో .. హ హ హ ...!) గంటలకి ... నా దగ్గరకి వచ్చారు ..
ఐదు .. ఏడు వచ్చేది ఏమిటి రా....
ఐదు అంటే.. పంచావతారం ... ఏడు అంటే..ఏడుకొండలు గాడు ... మూడు అంటే.. నేను ..
వచ్చి .. రేయ్... ! మూడు ... నీకో భయంకరమైన రహస్యం చెప్పాలి రా అన్నారు...
రహస్యం అనగానే.. ముక్కంటి అయిన నాకు ఇంద్రుడు లాగా ఒళ్ళంతా కల్లోచ్చాయి
ఐదు .. ఏడు ఉన్న రెండు కళ్ళని .. చాటంత చేసుకొని .. గస పెడుతూ ...
రేయ్ .. ఆ సర్పంచ్ ....
ఆ సర్పంచ్ ఆ సర్పంచ్... చెప్పండి రా ..
ఆ సర్పంచ్ .. నిన్ననే ఒక కొత్త కోతి .. కొన్నాడు రా..
ఛి .. కోతి .. కొన్నాడ.. అది పెద్ద రహస్యమ ..
ఇంకా అవ్వలేదు ఆగు రా.. ఆ కోతికి నీ పేరే పెట్టాడు .. మూడు అని ..
సర్పంచ్ గాడికి ఎంత దైర్యం .. మొన్న వాడి చొక్కా లో చీమలు వదిలి తప్పు చేసాం .. ఈ సారి.. వాడు తాగే కాఫీ లో చక్కెర వేస్తె.. షుగర్ వచ్చి సస్తాడు వెధవ..
ఇంకా అసలు విషయం పూర్తి కాలేదు రా.. అక్కడ మీ మామ .. ఏమి అన్నాడో తెలుసా .. కోతికి నీ పేరు పెడితే.. కోతి ఆత్మహత్య చేసుకుంటు౦ది అంట ....
అయన .. బాధ మీకు అర్తం కాలేదు రా.. అయన పేరు పెట్టాలి అని అయన ఆవేశం ..
ఆయినా మనం ఈ దౌర్జన్యాని సహించరాదు. ఏదో చిన్న కోడుకి నా పేరు పెట్టాడు బాగానే ఉంది. వాడికి పిచ్చి అయిన కూడా వదిలేసాం
మన సర్పంచ్ ప్రజలకోసం కట్టించిన ఏకైక కట్టడానికి నా పేరు పెట్టాడు. అది మరుగు దొడ్లు అయిన పర్వాలేదు అనుకున్నాం
కాని పోయి పోయి ఒక కోతికి నా పేరు పెడతాడ కనీసం ఏదో చింపాంజీ అయితే పర్వాలేదు కాని వాడి అంతు చూడాల్సిందే అని నిర్ణయించుకున్నాం
ఇంతలో ఐదు నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. వాళ్ళ కూతురికి ఒక వీక్ పాయింట్ ఉంది కదా అది ఉపయోగించుకొని వాడు తల ఎత్తుకొలేని పని చేద్దాం అన్నాడు. ఆ ఐడియా ఏడుకి నాకు బాగా నచ్చేసి అల చేయడానికి సనద్దం అయ్యాము .
ఆ ప్లాన్ ప్రకారం ఐదు ,ఏడు నిద్రపోతున్న సర్పంచ్ కూతుర్ని ఎత్తుకొని ఊరి బయట ఉన్న పాడు పడ్డ బంగళాకి తీసుకు వచ్చారు.
లోపాలకి వచ్చి కెవ్ వ్..వ్..వ్..వ్.. అని అరుస్తూ బయటకి పరిగితారు. నేను వెనకాల వెళ్ళే కొద్ది , ఇంకా ఫాస్టుగా పరిగిస్తున్నారు. అప్పుడే గుర్తుకు వచ్చింది నేను మోహన్ బాబు మాస్క్ వేసుకున్నాను అని. మాస్క్ తీసేసి వాళ్ళ దగ్గరకి వెళ్ళాను . వాళ్ళు ఆగి నాతో రేయి జాగ్రతరా ఇక్కడ మోహన్ బాబు తిరుగుతున్నాడు అన్నారు. ఓరి పిచ్చోలార అది నేనేరా అని మల్లి మాస్క్ పెట్టుకున్న మోహన్ బాబు, మోహన్ బాబు అంటూ మల్లి పరిగితారు. సరే అమ్మాయిని బయపెట్టేప్పుడు పెట్టుకోవచ్చులే అని పక్కన పెట్ట మాస్కు.
బంగ్లాలోకి వెళ్లి అమ్మాయిని ఒక మంచం మీద పడుకోపెట్టి ఎదురు చూస్తునాం ఎప్పుడు లేస్తుందా అని. ఒక గంట దాటింది , బాగా బోర్ కొట్టి చేతిలో మాస్కు వేసుకొని మా వాళ్ళని కాసేపు ఆడుకుందాం అనుకున్న.
వెన్నకి తిరిగి చూస్తే ఇద్దరు కనిపించలేదు. వెతుకుంటూ ఆ బంగ్లాలో ఒక మూలకి వచ్చా అక్కడ ఏదో కనిపించింది. అమ్మో బాబోయి ... అని అరుచుకుంటూ బయటకి వచ్చా . అక్కడ ఉన్న ఐదు , ఏడు కూడా నాతో పాటు పరిగితారు ఏమి అయ్యింది అని కూడా అడగ కుండానే. మాస్క్ తీసి నా ముందు పోతున్న నా స్నేహితులని ఆపి రేయి లోపల మోహన్ బాబు ఉన్నాడురా అందుకే భయం వేసి పరిగితాను అన్న. వాడు మా వెంట పడ్డాడు కూడా అన్నారు మా వాళ్ళు.
కాసేపు అలాగే ఉండి , సరేలే ఇంక వెళ్ళిపోయి ఉంటాడు పద పోయి చూద్దాం అన్న . ఒకరి చేతులు ఒకరం పట్టుకొని లోపాలకి వెళ్ళాం . ఎందుకు అయిన మంచిది అని లోపల అంత వెతికాం . ఎక్కడ లేడు అని నిశ్చయి౦చుకొని వస్తుంటే కనిపించింది అద్దం , వెంటనే చేతిలో దువ్వెన తీసి దువుకున్న. ఇంతలో అమ్మాయి కదుల్తున్నటు అనిపించాగానే వెళ్ళ మంచం దగ్గరకి. అమ్మ పాలు అంటూ లేచ్చింది ఆ పాప. అప్పటికే తెచ్చిన పాల సీసాతో పాలు పట్టి ఇక మా పని మొదలుపెట్టాం.
ఎలాగో రెండు ఐస్ క్రీంలు అవి పెట్టి మా దారికి తెచ్చుకున్నాం. ఇక మా సర్పంచ్ పరువు పోయినట్టే అని హా హా కారం చేస్తూ బయటకి వచ్చాం. దారిలో నడుస్తూ చేతిలో మాస్కు చూసుకున్న. మాస్కుతో పని లేకుండానే పని అయిపొయింది, అయిన కొన్నాను కదా అని ఒక చివరి సారి పెట్టుకున్న. పక్కనే పోతున్న కుక్క ఇంటి దాక తరుముకుంది . ఇంటికి వచ్చి ఆ మాస్కు పొయిలో వేసేసా
మేము అనుకున్న పని జరిగే రోజు వచ్చేసింది. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళలాగే వెళ్ళే పంచాయాతికి గర్వంగా వెళ్ళాం. అనుకునట్టే సర్పంచ్ కూతురు వచ్చింది పంచాయితీకి. ఆ రోజు సర్పంచ్ మంచి తెల్లటి పంచ కట్టుకున్నాడు. ఒక పది నిమిషాల తర్వాతా నా దగ్గరకి వచ్చి చేసేసా అని చెప్పింది. ఇక ఏమి ఉంది అయ్యిపోయింది సర్పంచ్ పరువు అని నవ్వుకున్నాం . చేసినపనికి ఆనందంగా ఒక చాక్లెట్ ఇద్దాం అని ఆ పాప వైపు తిరిగాను అంతే మా మీద వాంతి చేసుకుంది మా మీద. ఉదయం నుండి మేము పెట్టినవి అని మా మీదే కకేసింది.
అందరు మమల్ని చూసి తెగ నవ్వుకున్నారు.
“వెంటనే నాకు మయసభ సీన్ గుర్తుకు వచ్చింది
ఎంతటి పరాభవం ఎంత అనుమానం
సర్పంచ్ కోతికి నా పేరు పెట్టాడు గాక అది నాకు తెల్వనేలా
తెలిసింది పో నేను నా అతి ఆవేశంతో సర్పంచ్ పై పగ పట్టనేల
పట్టితిని పో మా ఐదు , ఏడు మాటలు విననేల
వింటిని పో దానికోసం మోహన్ బాబు మాస్కు వేసుకునే లేవేల్కి దిగాజారనేల
జారితిని పో ఆ బాలిక తన పని చేసి అందరికి చెప్పక నాకు చెప్పనేల
చెప్పెను పో చెప్పిన ఆ బాలిక నా పై కక్కనేల
కక్కను పో ఈ దూర్ మధందులు అయిన ఈ ఊరి జనం నన్ను చూసి నవ్వనేల “
వెంటనే నేను పంచాయితీ సర్పంచు పంచ వేసుకున్నవే (పాంచాలి పంచ భద్త్రుక )
నన్ను చూసి నవ్వి౦ది కాదు కాని
ఒక సారి నీ పంచె తడిసింది చూసుకో అన్న
అందరు సర్పంచ్ పంచె వైపు ఒక క్షణం చూసి మల్లి నవ్వుతున్నారు. సాధించాం అని మేము నవ్వడం మొదలు పెట్టాం. కాని అందరు ఇంక మా వైపే చూస్తున్నారు.
ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నాను అంటే, సర్పంచ్ పంచ వాడి కూతిరి చేత తడిపించి మీ ముందు పరువు తీయాలి అని మేమే ప్లాన్ వేశాం. అది మీకు అర్థం కాలేదు
అందరు నవ్వారు. అనుకున్నది సాధించాం అని పంచాయితీ నుండి బయల్దేరం .
పక్క రోజు మా సర్పంచ్ ఇంకో రెండు కోతులు కొన్నాడు. పేర్లు....
హా హా హా .......
No comments:
Post a Comment