Wednesday, June 16, 2010

పెద్దైతే ఎమోవ్తావు ...?

అశోకుడు చెట్లు నాటించెను , తుఘ్లక్ మల్లి రాజధాని మార్చెను అని మా సోషల్ మాస్టారు చరిత్ర పాటాలు చెప్తున్నాడు. వెనక బెంచిలో కూర్చున్న మేము అది వినకుండా నిన్న చూసిన సినిమా "ఎట్లో కొడితే గూట్లో పడతావ్ " గురించి మాట్లాడుకుంటున్నాం . ఎప్పుడు చూసాడో మమల్ని తెలిదుకాని మా మాస్టారు నా పక్క వాడ్ని లేపి ఏమి చెప్పానురా అని అడిగాడు. వాడికి ఏమి వినిపించిందో తెలిదు కాని నిన్న సినిమాలో రత్నం ఒక ఫైట్ లో ఏటిలో నించొని విలన్ ని కొడితే వాడు ఎగురుకుంటూ వెళ్లి గూట్ల పడ్డాడు సార్ అన్నాడు. క్లాస్సు మొత్తం నవ్వేసింది. లాస్ట్ బెంచ్ వాళ్ళని అందరిని లేచి నుంచో మన్నాడు. ఆ మాట చెప్పేలోపు నేను వెళ్లి పక్క బెంచి లో కూర్చున్న. అందర్నీ సాయంకాలం వరకు గోడ కుర్చీ వేయమన్నాడు. వాళ్ళు బయటకి వెళ్తుంటే కాలర్ ఎగరవెస్తు నవ్వుకున్న . అప్పుడు మాస్టారు నన్ను లేపాడు. నేను టక టక ఆయన ఆ రోజు క్లాస్సులో చెప్పినవి అని చెప్పేసా. బాగా చెప్పావు వారం రోజులు రోజు గోడ కుర్చివెయ్యి అన్నాడు., సార్ .. అన్న . నాకు తెలుసుర నువ్వే పెద్ద దొంగవి అన్నాడు. ఈ సారి నవ్వడం మా వాళ్ళ వంతు అయ్యింది . మా సోషల్ మాస్టారు అప్పుడు మాకు ఒక పని చెప్పాడు మీకు చరిత్ర ,చదువు విలువ తెలియట్లేదు తెలిసే లాగ నేను చేస్తాను. రేపు మీ అందరు, పెద్దయి మీరు ఏమి
అవ్వాలి అనుకుంటున్నారో? ఎలా అవ్వాలి ? ఎందుకు అవ్వాలి? అనే విషయం గురించి రాసుకోరండి . అప్పుడు మాట్లాడదాం అన్నాడు. బెల్లు మోగింది అందరం ఇంటికి వెళ్లి పోయాం .

పక్క రోజు సోషల్ క్లాస్సుకి వచ్చాం . మాస్టారు రాగానే పాఠం చెప్పకుండా నిన్న చెప్పిన పని చేసారా అని అడిగాడు. ఎస్ .. సార్ ర్ ర్ ర్ ..... అని అందరు రాగం తీసారు .



మొదటి అమ్మాయి :
నా పేరు ఎంకమ్మ . నేను ఐదోవ తరగతి చదువుతున్నాను.
నేను పెద్దయ్యి పెళ్లి చేసుకుంటాను
మా అత్తా మామలని బాగా చూసుకుంటాను
ముగ్గురు పిల్లల్ని కంటాను
ఎందుకు అంటే : మా నాన్న అలానే చేయమన్నాడు

మొదటి అబ్బాయి


నా పేరు రాజ చంద్రశేఖర భూపాల్
నేను పెద్దయి ఏమి చేయాను
ఎందుకంటే మా ఇంట్లో అని పనులకి పన్నోలు ఉన్నారు
మా నాన్నని అడిగితే కూడా మా వంశాచారం అదే అని చెప్పాడు
అలా అలా అందారు ఏవో చెప్తున్నారు . అందరిని అడిగిన తర్వాత మా నలుగురి దగ్గరకి వచ్చాడు మా మాస్టారు .

నా లైన్లో అటు చివర చివర ఉన్న వాడ్ని అడిగాడు ఏమిరా చెప్పు ఏమి రాసావు అన్నాడు

నా పేరు రమేష్ . మా నాన్న హెడ్ కానిస్టేబుల్
నేను పెద్దయి మా ఊరికి ఎస్ . ఐ అవుతాను
ఎలా అంటే
బాగా చదివి డిగ్రీ పూర్తి చేసి , ఎస్. ఐ . పరీక్షా రాసి
ఎందుకు అంటే
1) హెడ్ కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్ అయితే బాగుండదు కనుక
2) హెడ్ కానిస్టేబుల్ గా మా నాన్నకి వచ్చే లంచం కన్నా ఎక్కువ సంపాదించడానికి
3) టీచర్ లు కూడా ఎస్ .ఐ కి బయపడుతారు కాబ్బటి

రెండో వాడు
నా పేరు రంగ . మా నాన్న ఆసుపత్రిలో కాంపౌందర్
నేను పెద్దయి డాక్టర్ అవుతాను
ఎలా అంటే

మెడికల్ సీటుకి డబ్బులు కట్టి
ఎందుకు అంటే

1) డాక్టర్ అంటే ప్రాణం పోయడానికి , తీయడానికి డబ్బు
2) డాక్టర్ అయితే తెల్ల కోటు , ఎసి రూము
3) డాక్టర్ అయితే కాంపౌందర్ లాగ కాదు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పని చేయాచు

మూడో వాడు



నా పేరు సూర్య . మా నాన్న మునుసాబు
నేను పెద్దయి మా ఊరికి ఎమ్. ఎల్. ఏ ఆవుతాను
ఎలా అంటే
మా నాన్న పలుకుబడి మా నానా డబ్బు ఉపయోగించుకొని
ఎందుకు అంటే 1) ఎమ్. ఎల్. ఏ దగ్గర మాత్రమె మా నాన్న చేతులు కట్టుకుంటాడు
2) ఎమ్. ఎల్. ఏ అయితే కరెంటు ఫ్రీ, ఫోన్ బిల్ ఫ్రీ, కార్ ఫ్రీ , ఇల్లు ఫ్రీ ఇవ్వని కాకుండా నెలకు జీతం
3) ఎమ్. ఎల్. ఏ అయితే పోలీసుల, డాక్టర్లు మన మాట వింటారు

చివరగా నేను

నా పేరు నారాయణ . మా నాన్న రైతు.
నేను పెద్దయి ఆత్మహత్య చేసుకుంటాను
ఆ మాట వినగానే అందరు నోరు తెరిచి నన్నే చూస్తున్నారు.

ఎలా అంటే
మా నాన్న రైతు కాబట్టి నేను ఆ పొలం చూసుకోవాలి కాబట్టి

ఎందుకు అంటే
1) మా ముతాత వంద ఎకరాలో సాగు చేసాడు
2) సీలింగ్ యాక్టులో నలబాయి మిగిలింది
3) సెజ్ తర్వాత మా తాతకి పది ఎకరాలు మిగిలింది
4) నిన్ననే రెండో సెజ్ ముగిసాక మా నాన్నకి ఒక ఎకరం మిగిలింది
ఇంకో పది ఏళ్ళల్లో నాకు మిగిలేది ఆత్మా హత్యే

అని చెప్పను బెల్ మోగింది అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు .



చివరి మాట:బయటకి వెళ్తున్న నన్ను ఆపి మా మాస్టారు నాకు ఒక కాగితం చూపించాడు. ఆ కాగితంలో మా మాస్టారు పేరు రాసి ఉంది , "కింద నేను పెద్దయి ఆత్మా హత్య చేసుకుంటాను అని రాసి ఉంది"
చదివి ఆయన వైపు తిరగాగానే ఇలా చెప్పాడు జీవితంలో మార్పు తేవాలి అంటే చదువుకోవాలి పది మందిని చదివించాలి అందుకే ఈ ఉద్యోగానికి వచ్చాను అని చెప్పాడు

నా కాగితంలో అన్ని కొట్టేసి పెద్దయి నేను మాస్టారు అవ్తాను అని రాసుకున్న

No comments: