ఆ రోజులో నాకు మూడు విషయాలు అంటే చాల ఇష్టం ఒకటి అమ్మాయిలు రెండు అమ్మాయిలు మూడు... మూడు అమ్మాయిలు. ఆగండి ఆగండి మీ బొట్లు వేసుకొని వెళ్లిపోకండి ఊహలలోకి . నేను మీరు అనుకున్నటు అమ్మాయిలని లైన్లో వేయలనో , బుట్టలో వేయలనో కాదు. అసలు అయిన అలంటి విషయాలో అమ్మాయిలు మన వెనక పడతారు కాని మనం ఏమిటి.. .. వెనక పడ్డేది. ఇంతకి అసలు విషయంలోకి వస్తే, ఆ రోజులో బేవార్స్ చొక్కాలు , చింపిరి జుట్టు , చిరిగి పోయిన జీన్స్ , బాత్రూం స్లిప్పర్స్ ఇవి మన సింబల్ . దాంతో అమ్మాయిలలో మనకి బాగా ఫాల్లోవింగ్ ఉండేది. అమ్మాయిలు అంత నన్ను చింపిరి,ఒరేయ్ ... చింపిరి, ఛి వెధవ .. చింపిరి అని చాల ముద్దుగా పిలిచే వారు. ఓహ్...! వెయిట్, వెయిట్ మీకు నా పేరు కథ చెప్పలేదు కదా .
అనగనగా హైదర పాలెం అనే ఊరు. ఆ ఊర్లో పిసినారి మంగళయ్య కి తొమ్మిది మంది కూతుర్ల తర్వాత పుట్టాడు ఒక కొడుకు. వాడే నేను. మా నాన్నకి పిసినారితనంతో పాటు కొంచెం శాడిజం కూడా ఉంది. లేకపోతే ముద్దుగా,బొద్దుగా ఉండే నాకు ఎంతో కసిగా చింపిరి రావు అని పేరు పెడతాడ.
ఆ పేరుకి మల్లి ఒక హిస్టరీ చెప్తాడు
చింపిరి లో చి- చిత్రగుప్తుడి నుండి , పి -పిల్ల కాలువ నుండి, రి- రియాజ్
మీ లాగే నాకు అర్థం కాక అడిగా ఎందుకు ఈ మూడు పేర్లు సెలెక్ట్ చేసావు నాన్న అని
అప్పుడు చి-చిత్రగుప్తుడి నెంబర్ వన్ ఇన్ లెక్కలు
పి -పిల్ల కాలువ నెంబర్ వన్ ఇన్ సమానత్వం
రి- రియాజ్ నా నెంబర్ వన్ స్నేహితుడు (కాని ఇప్పటి వరకు నేను చూడలేదు)
అలా కూడా చిపిరి కదా అని మీకు డౌట్ రావాచు , చిపిరి , తట్ట , బుట్ట అని పేరు పెడితే ఇంట్లో ఉన్న జీడి పప్పులు అని తిని ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించింది మా అమ్మ.
అనవసరంగా నీకు నాకు మధ్య జీడిపప్పులు వేస్ట్ చేయడం ఎందుకులే అని “౦” యాడ్ చేసి నన్ను చింపిరి రావు ని చేసాడు.
అది మన చింపిరి పేరు వెనక ఉన్న చింపిరి కథ ... ఆ కథ వినప్పుడల్లా, అదే చెప్పినప్పుడల్లా మా నాన్న కత్తులు ఆకర్లేదురా ఒక పేరుతో చంపేస్త అని బాల్లయ్య లెవెల్లో డైలాగ్ చెప్పి , బ్రహ్మానందం లెవెల్ లో నవ్వినట్టు అనిపిస్తుంది అదే వినిపిస్తుంది . చింపిరి రావు అని పేరుతో చిన్నప్పటి నుండే మన జీవితం మూడు పళ్ళు లేని దువ్వెనలు , ఆరు విరిగిపోయిన రుబ్బెర్ బ్యాండ్లలాగా తాయారు అయ్యింది . ఎందుకు పనికి రాకుండా. అలా ఉన్న నా జీవితంలోకి వచ్చిందే ఇంజనీరింగ్ కాలేజీ. ఈ ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేకత ఏమిటి అంటే నా లాగా తింగరి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ.
ఫస్ట్ డే , అలవాటు ప్రకారం వెళ్లి లాస్ట్ బెంచులో కూర్చున్న , రెండు నిమిషాలలో మాస్టారు వచ్చాడు.. వెంటనే వచ్చేసింది .. అదే అదే నిద్ర.
మంచి నిద్రలో ఉండగా , వినిపించింది ఆ మాట చింపిరి రావు అని ... వెంటనే కోపంగా లేచి
ఏమంటివి ఏమంటివి , చింపిరి రావు అనా
ఎవడురా చింపిరి , ఇది ఇంజనీరింగ్ క్లాసే గాని ఫాషన్ క్లాసు మాత్రము కాదే
కాదు కాకూడదు ఇది డిసిప్లేన్ అందువుగాక , ఆ ప్రిన్సిపాలు తల ఎట్టిది
ధర్మపత్ని స్వహస్తాలతో పీకగా మిగిలిన , అర గ్రౌండ్ తప్ప
అతి జుగుప్సాకరమైన నీ తల ఎట్టిది మట్టికుండ బోర్లించితివి కదా ...
అని డైలాగ్ చెప్పాలి అనుకున్న, కాని లేచి ఎస్ సర్ అని కూర్చున్న. ఇక క్లాస్సుకు మొహం చూపించుకోలెం అనుకుంటూ నిద్రలోకి జారుకున్న. మల్లి కొద్ది సేపటికి వినిపించింది చింపిరి రావు అని. ఈ సారి నా పేరు నాకే కొత్తగా వినిపించింది .ఇన్ని రోజులు చింపిరి చింపిరిగా వుండే నా పేరు ఏందో అందమైన చింపిరిగా వినిపించింది . వెంటనే తల ఎత్తి చూసా . ఒక అమ్మాయి ఏదో చెప్తోంది, నాకు మాత్రం ఏమి విన్పించట్లేదు. ఇందాక ఆ అమ్మాయి పిలిచినా నా అందమైన “చింపిరి రావు” పేరు తప్ప. ఏమి చెప్పిందో తెలిదు కాని సరే అన్నటు తల ఊపెసా మనకి ఏమి పోయిందిలే అని . తర్వాత ఆ అమ్మాయితో అమ్మాయిల హాస్టల్ దగ్గరకి వెళ్తే , సీనియర్ అమ్మాయి కాసేపు రాగ్గింగ్ చేసింది.
రూముకి వచ్చాక నా రూము మేట్ అడిగాడు ఆ పిల్ల నిన్ను ఎందుకు పిలిచింది అని. మనకి ఏమి తెలుసు వింటే కదా. అయిన స్టైల్ గా ఆ పిల్లకి బాగా నచ్చిన పిల్లగాడ్ని తీసుకు రమ్మని సీనియర్ చెప్తే నన్ను తీసుకు వెళ్ళింది ( రాగ్గింగ్ చేయడానికి నన్ను బకరా చేసింది అని గాలి తీస్తాడు ఏమో అని ) అయిన రాగ్గింగ్ చేసేదానికి మాత్రం అని తనకి తెలిదు, అందుకే వచ్చేటప్పుడు పాపం నా పుస్త “కాలు” పట్టుకొని, సారీ నీ లాంటి మంచి వాడ్ని అందగాడ్ని ఇలా రాగ్గింగ్ చేస్తారు అని నాకు తెలిదు అని చెప్పింది. ఇదంతా విని వాడు బాలకృష్ణ మీటింగ్ విన్నాక టీవీ యాంకర్ పెట్టిన ఎక్స్ప్రెషన్ పెట్టాడు . అలా ఒక నెల రోజులు రోజు ఎవరో ఒక అమ్మాయి నన్ను పిలిచేవారు నేను ఓ ఊపుకుంటూ వెళ్లిపోయే వాడ్ని. ఇలా మనం అమ్మాయిల మధ్యలో పాపులర్ అయిపోయాం . పాపులర్ అంటే ప్లస్లతో పాటు మైనస్ కూడా ఉంటాయి. అదే సీనియర్ అబ్బాయిలు , జెలసి ఫెల్లౌస్ తెగ రాగింగ్ చేసారు. బట్టలు ఊతికించారు , ఇస్తిరి చేయించారు , తల కిందలగా తపస్సు చేయించారు ఇంకా చాలా చేయించారు ఒక మాటలో చెప్పాలి అంటే రేపుకి ఎక్కువ మర్డర్ కి తక్కువ. అలా నా జీవితం ముప్పయి మంది అమ్మాయిలు ఆరు వందల రేపులు లాగా ఖుషి ఖుషిగా సాగింది.
ఇలా ఉండగానే పరిక్షాలు వచ్చేసా . అయిన మనం చిన్నప్పటి నుండి పెద్ద పొట్టుగాలం దాంతో పెద్దగ పట్టించుకోలేదు. రోజు నాతో తిరిగే అమ్మాయిలంతా ఫెయిల్ అవతారు అని ఇప్పటి నుండే ఏడుస్తున్నారు. అందరికి మనం దైర్యం చెప్తుంటే నీకు ఏమి నువ్వు చింపిరి రావు వి గ్యారంటీ ఒక 90% వస్తుంది అంటుంటే. అఫ్ కోర్స్ మీకు ఏదో ఒక 60, 70 వస్తుంది భయపడ్డకండి అని దైర్యం చెప్పా. ఎగ్జామ్స్ అయ్యాయి, రిజల్ట్స్ వచ్చాయి ...
ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ సంపాదించే చింపిరి రావు ఫెయిల్
వెంటనే పరిగిస్తూ వెళ్లి బావి దగ్గర ఆగి , అటు ఇటు చూసి
బావి పక్కన ఉన్న హాస్టల్ గేటు లోంచి క్లాసు మేట్ అమ్మాయిని అడిగా ఏమి అయ్యింది అని ఏడుస్తూ 75 అనింది
నీ ఎంకమ్మ , దానికి ఏడుస్తున్నావా అందం అనుకోని ఆగి ఎందుకు ఏడవడం అన్న
అప్పుడు చెప్పింది మా క్లాసు మొత్తం లో ఆ అమ్మాయికే తక్కువ అని మిగత అందరికి 80 పైన వచ్చాయి అని
దాంతో ఆ నీలు లేని బావి లో దూకుదాం అనుకున్న కాని , అమ్మాయిలు ఆ బావిని డస్ట్ బిన్ లాగ వాడుకుంటున్నారు అని ఎప్పుడో మూసేశారు.
రూముకి వచ్చి పరుపు మీద పడ్డుకున్న , కళ్ళు మండుతుంటే పక్కన ఉన్న వాటర్ బాటిల్ తో నీలు చల్లుకున్న మొహం మీద. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మా రూం మేట్ .
నా మొహం మీద తడి చూసి ,
ఓ అర్జున (అంటే నేను) ఎందుకు బ్యాటిల్ ఫీల్డ్ (ఎక్షమ్ హాల్ ) వదిలి ఇక్కడకి వచ్చితివి
అయినాను నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ లో చేసిది ఏమిటి , చూసేది ఏమిటి, కన్నీరు విడిచేది దేనికి
ఏది చేసిన అంత వారే (అమ్మాయిలు) నిన్ను చింపిరి అని పిలిచి నీ బంధువులలాగా కనిపించవచ్చు కాక
పార్టీ లాకి షికార్లకి తీసుకు వెళ్లి బిల్లు నీ చేత కట్టించావచ్చు కాక కాని అది అంత మాయ
(ఒరేయ్ బిల్ కట్టడం కాదు రోయ్ ...) అని పక్కనే ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేసాడు
ఘంటసాల గారు
ఫెయిల్ అయిన వాడు మల్లి పరీక్షా రాయక తప్పదు
రాసిన వాడు మల్లి ఫెయిల్ కాక తప్పదు
తుచ్చేము అశాశ్వతము అయిన ఈ పరీక్షలని తలచి కన్నీరు విడువకు
ఘంటసాల గారు, నా రూం మేట్ కలిసి నా జ్ఞాన కళ్ళు తెరిపించారు . దాంతో వెంటనే అమ్మాయిలకి కటిఫ్ చెప్పేసి , నా పేరులో చింపిరితన్నాని నాలో దాగి ఉన్న గొప్ప తన్నాని వెలికి తీయాలి అని డిసైడ్ అయ్యాను . నేను అమ్మాయిలతో మాట్లాడడం మానేసి హ్యాపీగా క్లాస్స్లో నిద్రపోతే పాటాలు వింటున్న. సెప్టెంబర్ వచ్చింది ఎక్జాంస్ దగ్గరికి వచ్చాయి , అప్పుడే వినిపించింది పక్క బెంచి నుండి చింపిరి అని కోమల కంఠం
ఏమి అయ్యింది ఫెయిల్ అయ్యాను అని బాధతో నాతో మాట్లాడట్లేదా. అయిన నువ్వు ఎందుకు అల ఫీల్ అయ్యేది. నువ్వు ఎంత గొప్ప వెధవవి , సోమ్బెరివి , ఇడియట్ వి (సినిమా టైటిల్ చూసి చెడి పోయారులే అమ్మాయిలు ) నీకు ఎందుకు బాధ.
చేతిలో పుస్తకాలు అని విసిరేసి ఆపు
మొత్తం మన ఊరిలో ఒక మూడు లక్షల మంది నా వయస్సు అబ్బాయిలు
వాళ్ళలో ఇంజనీరింగ్ మూడు వేల మంది
వాళ్ళలో మన కాలేజీ లో మూడు వందల మంది
వాళ్ళలో మన క్లాస్సులో ముప్పయి మంది
వీళ్ళందరినీ వదిల్లి నువ్వు నన్ను నాసం చేయడానికే ఎందుకు బయల్దేరావే రాక్షసి
అని టాగోర్ చిరంజీవి లెవెల్ లో డైలాగ్ చెప్పాలి అనుకున్న కాని ఏమి చెప్పకుండా ఆ పిల్ల మాటలు వింటూ ఉండిపోయా
తర్వాత ఒక వారంలో ఎగ్జామ్స్ రెండు నెలలలో రిజల్ట్స్
రెండు నెల్లల ఒక రోజుకి మా రూముకి ఘంటసాల భగవత్ గీత ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసాయి
ఆ రోజు నుండి నాకు బాగా ఇష్టం అయినవి మూడే ... ఎందుకంటే ఆ పిల్ల అన్ని రోజులు నోరు మూసుకొని నా పరిక్షలప్పుడే వచ్చి ఎందుకు మాట్లాడిందో అర్థం చేసుకోడానికి , నా లాగ బెవర్స్గా తిరిగినా ఆ పిల్లకి అన్ని మార్కులు ఎలా వచ్చాయో తెలుసుకోడానికి , అస్సలు అమ్మాయిలు నా లాంటి బకారాలని ఎలా గుర్తిస్తారో తెలుసుకోడానికి
సమాధానం తెలిస్తే ఘంటసాల గారితో కలిసి మల్లి కలుస్తా .
No comments:
Post a Comment