అవి మద్రాస్లో నేను బ్రహ్మచారిగా ఉన్న రోజులు. ఆ రోజు అన్ని రోజుల లాగే ఎదురుగా ఉన్న గాజు సీసాలో ఉన్న ఉప్పు ,కారం చూస్తూ మా కాంటీన్లో భోజనం చేస్తున్న., ఆహ నా పెళ్ళంట సినిమాలో కోటా లాగ . ఆ రోజు నా పక్కన కూర్చొన నా స్నేహితుడు ఎంటిరా ఎటో చూసి తింటున్నావు అన్నాడు. ఇవ్విగో ఈ ఎరుపు , తెలుపు రంగులో ఉన్నాయే వాటిని చూస్తూ తింటున్న అన్న. ఏమీ అయ్యింది తెలీదు నా ఎదురుగా ఉన్న అమ్మాయి “ఉన్నకు వెక్కం ఇల్లే .. నీ మనిషనా అని వెళ్ళిపోయింది” ( "నీకు సిగ్గు లేదా , నువ్వు మనిసివేన ") . ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి తెల్ల రంగు చీర ,ఎర్ర రంగు జాకెట్ వేసుకుంది. ఆ అమ్మాయినే అన్నాను అనుకోని తిట్టింది.
మా వాడు రంగుల పేర్లు కాకుండా వాటి పేరే చెప్తే ఈ తిట్లు తప్పేవి కదా అన్నాడు. ఇంకో రెండు నెలలు ఇదే తిండి తింటే నిజంగానే వాటి పేర్లు మర్చిపోతా మామ అన్న. ఆ రోజు మా వాడికి ఏమీ అయ్యింది తెలీదు కాని సరే మామ వాటి పేరు వాటి రుచి నీకు చూపిస్తా వచ్చే మా ఇంటికి ఈ రోజు రాత్రి నా పెళ్ళాం వంట చేసిపెడుతుంది అన్నాడు.
సాయంకాలం ఆనందంగా ఇంటికి వెళ్లే సరికి ఇల్లు క్లీన్ చేస్తోంది మా పనిమనిషి . ఒక సీస తీసి పారేస్తాను అని సైగ చేసింది. నేను సినిమాలో చూపించినట్టు నో……. అని పరిగితి స్లోమోషన్ లో వెళ్లి దాని క్యాచ్ పట్టుకున్న. అది మూడు నెలల క్రితం అయ్యి పోయిన ఆవకాయ సీస. నిద్రపోయే ముందు లేచిన తర్వాత ఒక సారి దాని వాసన చూసుకుంటా అది పారేస్తే ఎలా ఎలా అని లోపల పెట్ట.
రోజు లాగా కాకుండా కొంచెం పద్దతిగా తయారు అవ్వాలి అని వెళ్ల బాత్‌రూంలోకి. కొల్లాయి తిప్పగానే ఆశ్చర్యం , ఆనందం , వింత , విడ్డూరం .. నీలు వస్తున్నాయి. ఆ ఊహించని సంఘటన నుండి కోలుకొని స్నానం చేయడం మొదలుపెట్ట. నిజాయితీ పెంచుకోవడం కోసం సబ్బు బాగా రుద్దా. రేయి ... ఉన్న నిజాయితీ చాలు ఇంకా ఆపు అన్న ఆకాశవాణి మాటలకు సబ్బు రుద్దడం ఆపి వంటి మీద నీలు పోసుకున్న. ఉన్న నీలు అయిపోతునాయి కాని సబ్బు వదలటంలేదే. ఇక ఏమి చేస్తాం , వెళ్లి తువాలుతో నిజాయితీని తుడిచేశా.
టైము ఆరు అయ్యింది మోగింది మృత్యు గంట . అదే నండి నా మొబైల్. హ౦టి౦గ్. అని పడింది . ఈ పేరు చూడగానే ఎర్ర మీట మీద కి వెళుతుందని చెయ్యి. కాని పచ్చ మీటే నొక్కుతుంది. హ... లో అనే గ్యాస్లో మొదలు. ఈ రోజు ఏమి అయ్యింది తెలుసా పప్పా మా అమ్మ ఈ రోజు మార్కెట్‌కి వెళ్ళిందా. అక్కడ ఎర్ర ఎర్రగా ఉండే రెండు కిలోలు టమోటాలు , మూడు కాడలు పచ్చటి కరివేపాకు .. అంటు ఏదో చెప్తోంది . అప్పుడు నా ఆలోచన మొదట్లో అన్న పప్పా దగ్గర కి వెళ్ళింది. నా గర్ల్ ఫ్రెండ్ రోజు ఒక పేరుతో పిలుస్తుంది. కాకపోతే ఆ పేర్లకి ఎక్కడ నుండి వస్తా యో నాకు అర్థం అయ్యేది కాదు. ఈరోజు అర్థం అయ్యింది. అది నా గర్ల్ ఫ్రెండ్‌కి చాల కాలంగా ఇష్టం అయిన కుక్క పేరు. ఆ కుక్కకి చాల చరిత్ర ఉంది. ఆ కుక్క నా గర్ల్ ఫ్రెండ్ ఒకే రోజు పుట్టారు. కుక్క వాళ్ళ అమ్మ దానికి బర్డే పార్టీ చేస్తూ౦టే, నా గర్ల్ ఫ్రెండ్‌కి తెలిసి తీసుకుని వచ్చేసింది అని నా అనుమానం. లేక పోతే వీధి కుక్కలు కూడా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని తిరిగుతుండాలి. ఇంకా ఆ పప్పా నా మొగుడు , అదే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, కాగితాల తడిపితే ఆయనకు కోటి రూపాయల టె౦డర్ వచ్చింది అట. ఇది చెప్పగానే మా రూం మేట్స్ అంత వాళ్ళ వాళ్ళ రెసుమే తీసుకొని ఆ కుక్క వెనకాలే తిరిగారు అది వేరే కథ .ఆ కుక్క రోజు నా గర్ల్ ఫ్రెండ్ బెడ్‌లోనే నిద్ర పోతుంది. రోజు దానికి ముద్దు పెట్టందే బయటకి రాదు. అలా నా ఆలోచనలలో ఉండగానే టైము ఏడు అయింది. నా గర్ల్ ఫ్రెండ్ ఫోను పెట్టేసింది. ఆ గంటలో చెప్పింది రేపు కలుదాం అని.
ఈ గంటకి నా వళ్ళంతా బంక బంకగా జిడ్డు జిడ్డుగా తయారు అయింది. నిజాయితీకి ఇక టైము లేదు దాంతో అక్కడే పడి ఉన్న మల్లెపువ్వు వాసన వచ్చే రూం ఫ్రెషర్ కొట్టుకున్న. మా నాన్న కొన్ని ఇచ్చిన కొత్త పైజమా , జుబ్బా తీసా. బాగా సత్తాయి౦చి౦ది. ఎంత అయిన కొన్ని ఒక రెండేలు అయింది కదా. పట్టడం కష్టమే. ఎలాగో కష్టపడి ఇరుక్కున్న దాంట్లో. ఉత్సాహంగా కిందికి దిగా మా ఇంటి ముందు ఒక చిన్న కొలను వచ్చేసింది. ఏమిటి రా ఇది ఎప్పుడు వచ్చింది అని మా వాచ్ మ్యాన్ అడిగితే ఇప్పుడే సార్ ఒక పది నిముషాలు వర్షం పడింది.
పైజమా తీసి చేతిలో పట్టుకొని అలా నీలలో ఈదుకుంటూ ఒక ఓడు చేరా. అందరు నేను ఏదో డ్రైనేజి పని కోసం వచ్చాను అనుకొని మనకి అర్థం కాని తమిళం లో బండ బూతులు తిట్టారు. దొరికిన ఫుట్ పాత్ కింద మల్లి పైజమా వేసుకొని వెళ్లి బస్సు స్టాపులో ఆగాను. బస్సు స్టాపులో నేను ఇంకో అమ్మాయి మాత్రమే ఉన్నాము. బస్సు ఎక్కాను, అంత మల్లెపువ్వు వాసన. అందరు అమ్మాయి వైపు చూసారు. నేను కూడా చూసా నా మీద డౌట్ రాకుండా. కింద నా గొడుగు పెట్టబోతూ చూసా బస్సు ఆ వైపుకు వాలి పోయింది. ఇన్నాలు జనం వల్ల బస్సు వాలి ఉంటుంది అనుకున్న కాని ఈ రోజే అర్థం అయ్యింది ఆ బస్సు అంతే అని.
ఎలాగో చివరికి ఎనిమిది గంటలకు వాడి ఇంటికి చేరాను. తలుపు బయట ఏవో గిన్నెలు , గరిటెలు సొట్ట పడి ఉన్నాయి. నా కోసం చాల చేయడానికి ఇవి బయటకి తీసి ఉంటారు అనుకున్న. అంతలో ఒక పెద్ద అరుపు ఇంకో సారి పిలిచావో పది రోజులు నీ చేతే వంట చేయిస్తా. తరుగు, తరుగు మూసుకొని పెద్ద హీరో లాగ పిలిచావుగా అంటున్నారు. అయిన సరే దైర్యం చేసి తలుపు కొట్టాను . తలుపు తీసి మామ వచ్చావా అన్నాడు. నాకు అది ఎందుకు వచ్చావు అన్నటు వినిపించింది. వాళ్ళ కొడుకు ఎగురుకుంటూ వచ్చి వీడేనా నీ ఫ్రెండ్ అన్నాడు. సరిగా తెలుగు రాదు లేరా మా వాడికి అన్నాడు . ఇప్పుడు కూడా అవకాశం ఉన్నింది వెళ్ళిపోడానికి కాని ఎర్ర రంగు, తెల్ల రంగు పొడి వేసిన వంటల కోసం ఆగాను. వాడి వైఫ్ బయటకి వచ్చింది . ఆమెని చూడగానే పరిగెత్తాలి అన౦త భయం వేసింది. అమ్మాయిలో ఏమి లోపం లేదు. కాని ఆ అమ్మాయి మా జూనియర్ బాగా నస పెట్ట ఆ రోజుల్లో.
ప్లీజ్ వాడు ఖాళీగా కూర్చొని ఏమి చేస్తాడు, ఇవ్వవే ఆ రిమోట్. నువ్వు చెప్పిన ఛానెల్స్ మాత్రమే పెడతాం మిగతా చానెల్స్ లాక్ చేసావు కదా. ఎలాగో టి. వి రిమోట్ తెచ్చి నవ్వుల చాన్నెల్ పెట్టాడు, ఆ సీన్లో కమెడియన్ తన భార్యతో నా మాట వి౦టే టా౦క్ బ౦కు మీద శిల కట్టిస్తా లేదా హుస్సేన్ సాగర్లో తోస్తా అన్నాడు నాకు నవ్వొచి౦ది. కిచెన్‌కి పరుగెడతాడు నా ఫ్ర౦డ్ కొడుకు. అమ్మ అమ్మ .. ఆ అ౦కుల్ పెద్ద వెధవ లాగ ఉన్నాడు అన్నాడు. నా మనసులో వీడికి అప్పుడే ఎలా తెలిసి౦దా అనుకున్నాను. చూడు అమ్మ వైఫ్‌ని తిడితే నవ్వుతున్నాడు అన్నాడు. మా వాడు నాలుగు రోజుల ను౦చి ల౦కనాలు చేసినవాడి లాగా పెట్టడు మొహ౦.రిటన్ ఆఫ్ దా డ్రాగన్.. ఈ సారి ఏవో హాట్ పాక్ పట్టుకొచి౦ది. అమ్మయ్య అస్సలు పని దగ్గర కి వచ్చా౦ తొ౦దరగా ఐపోతే వెళ్లిపోవచ్చు అని ఆన౦దపడ్డా.
మా వాడు ఎదురు వెళ్లి ఆమె చేతీలో౦చి ఆ గిన్నెలు తీసుకొని సాయ౦ చెసాడు. ర౦డి కూర్చొ౦డి అ౦ది ఆ ఎక్సప్రషన్ మాత్ర౦ రా తిన్ని చావు వచ్చి౦ది దీనికెగా అన్నట్టుగా ఉ౦ది. అయినా మనకి ఎమి సిగ్గు అని వెళ్లి కూర్చున. మొదట గిన్నె తీసి౦ది ఎదొ పచ్చ ర౦గులొ వేసి౦ది. ఎదొ స్పెషల్ అనుకున్నా, మా వాడు అన్న౦ ఇ౦కొ౦చె౦ పెట్టు అ౦ది... పచ్చ ర౦గు అన్నమా... తరువాత గిన్నె తీసి ఎర్ర ఎదొ పొసి౦ది , సా౦బార్ అనుకున్నా... పప్పు చాల అ౦కుల్ అన్నాడు. ఎదొక్కటి తి౦దా౦ అని నొట్లొ పెట్టి ఒక బయ౦కరమైన ఎక్సప్రషన్ పెట్టాను... ఎమి అన్నయ్య ఉప్పు ఎక్కువా? కార౦ ఎక్కువ? ఎవ్వ౦డి మీరు తిన్నాదు ... అబే అదె౦లేదు అన్నా మొహమాట౦గా. అప్పుడు చెప్పి౦ది ఉప్పు, కార౦ ఆరోగ్యానికి మ౦చిది కాదు అన్నయ్య అ౦దుకే మా ఆయనకి ఆసలు పెట్టాను. ఎదొ మీరు వచ్చారు అని ఈ ఉప్పు, కార౦ వెస్సా అ౦ది. అప్పుడు నాకు ఆ ఉప్పు లెని పప్పులోకి దూకి ఈత కొట్టకు౦డా చచ్చిపొద్దా౦ అనుకున్నా. కాని ఆ అమ్మాయి మా ఆయన మా౦స౦ తి౦టే కొవ్వు ఎక్కువ అవ్తు౦ది అన్నయ్య అనుటు౦ది అని ఆ సాహస౦ ముగి౦చా. సరేలే తరువాత వచ్చేవి బాగా ఉ౦టాయి అని చూస్తున్న. ఇ౦కా ఎమి కూరలు ఉన్నాయి అని చూస్తున్న అని గమని౦చి , తరువాత ఎమి తి౦టారు పచ్చి బటానీలా కూర ఉ౦ది, ఇ౦కా నానపెట్టిన దుమ్పలు, మాడా పెట్టిన బె౦డకాయల కూరా అన్నిటి క౦టే ఈ రొజే నెను మొదటి సారి తయారు చేసిన మ౦చి నీల్లతో ఫ్రై చేసిన అప్పడాలు. అన్ని తిని సూపర్ బ౦పర్ అన్నెసా. చివరి ఆశగా ఊరగాయ ఉ౦దా అన్న .. ఎ౦త మాట అన్నారు, మా వాడు వి౦టే ఇ౦కేమి అయిన ఉ౦దా. ఊరగాయలు , పచ్చడులు మా ఇ౦ట్లొ నిషేద౦. చివర్లో స్వీట్ పెట్టి౦ది ఏమి ఎక్స్పెక్ట్ చేయకు౦డా.. ఎనిమిదవ అద్బుత౦ జరిగి౦ది.. ఆ స్వీట్లో స్వీటనెస్ లేదు. అని తిన్ని అన౦దభాష్పాలు కారుస్తు డొక్కు బస్సు ఎక్కి ఇ౦టికి వచ్చా. నా పరిస్థితి అద్వాన౦.. ఈ రోజు రోజు నా ము౦దు ఉ౦డే ఎర్ర ర౦గు, తెల్ల ర౦గు సీసాలు కూడా లేవు.
ఇ౦టికి వెళ్లి ఎడుస్తు నిద్ర పోయ, చెతీలొ ఉన్న పాత ఆవకాయ సీసా వాసన చూస్తూ.
----------------------------------------------------------
నూతన స౦వత్సర శుభాక౦క్షలు
Thursday, December 31, 2009
Wednesday, December 9, 2009
మా చంద్రబోస్ పాట
ఇంకా సినిమాలో ఇంజినీర్ల మీద జోక్లు రాని రోజులు అవి. అతి ఉత్సాహంగ పెద్ద విశ్వ విద్యాలయం లో ఇంజనీరింగ్ చేరాను. ఒక మూడు నేల్లలు పరిచయాలు , కొత్త కొత్త ఆటలు. ఆటలో ఒక ఆట మాత్రం నాకు మహా ఇష్టం. మా సీనియర్ ఒక కొవ్వొత్తి వెలిగించేవాడు నన్ను ట్యూబ్ లైట్ వెలిగించామనేవాడు . ఆయన ఉఫ్ అని ఉది కొవ్వొత్తి ఆపేస్తే నేను ఉఫ్ అని ఉది ట్యూబ్ లైట్ ఆపాలి ఎవరు ముందు ఆపేస్తే వాలు గెలిచినట్టు. గెలిచినా వాళ్ళకి ఓడిన వాళ్ళు పార్టీఇవ్వాలి . బాగా ఉంది కదా ఆట. దీని మాముల్గా ఇంగ్లీష్ బాషలో ర్యాగ్గింగ్ అంటారు. ఈ పరిచయాలు మితిమించి మాకు మోక్షం కలగకుండా ఒక చిన్న గ్రిల్ కట్టి దానికో తాళం వేసారు.
అలా మూడు నేల్లలు గడిచేసరికి చాల పరిచయాలు చేసుకున్నాం. కానీ ఒకే క్లాసు లో ఉండే వాళ్ళకి అంత గొప్పగా పరిచయాలు లేవు . అందుకే అందరు కలిసి టూర్ వెళ్ళాలి అని ప్లాన్ వేసారు. ప్రిన్సిపాల్ కాలు గడ్డలు పట్టుకున్నాం. అయన తిట్లకి సిగ్గుపడ్డం , ప్రశ్నలకి ఆయసపడ్డం చివరకి ఒపుకుంటే బయటపడడం. టూర్ అనగానే మేము రాము అనడానికే ఒక టీం ఉంటుంది . ఆ టీమునే తెలుగు బాషలో అమ్మాయిలు అంటారు. నేను రాను మా నాన్న ఒప్పుకోడు , మా పక్కింటాయన ఒప్పుకోడు అని కథలు చెప్తారు.
ఇలాంటి అప్పుడే సిగ్గు. శరం. బుద్ది. జ్ఞానం వదిలేసి చాల పన్లు చేయాల్సి ఉంటుంది. మొదట అమ్మాయిలని ఒప్పించాలి , అంటే హిట్లేర్ లో చిరంజీవి లాగా నేను ఉంటాను మీకు అని నమ్మకం కలిగించాలి. వాళ్ళ అమ్మ బాబుల్ ని ఒప్పించాలి ఇది చెప్పడానికి వీజీయే కానీ మేనేజ్ చేయడమే కష్టం. తలకి నీట్గా కోబరి నూనే పెట్టుకొని నల్ల ప్యాంటు వేసుకొని తెల్ల చొక్కా ఇన్-షర్టు చేసి వెళ్ళాలి. వెళ్ళేది అంత అబ్బాయిలే అయిన మొతం అమ్మాయిలే అన్నటు బిల్డుప్ ఇయాలి. ఇవ్వని అయ్యాక ఒక నాలుగు ఐదు ఫోన్ నుంబెర్స్ ఇవ్వాలి ఎప్పుడు వాళ్ళ బాబుకి మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు మాట్లాడానికి. ఇక్కడితో అయిపోదు ... ఆ అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి లైన్ వేస్తున్న ఆ వీడి రౌడీ గారిని , కాలేజీ లో చేరగానే లైన్ వేయడం మొదలు పెట్టిన సీనియార్ని , పక్క బ్రాంచ్లో లైన్ వేసే అబ్బాయిల్ని ఒప్పించాలి. ఇవ్వని అయ్యి బయల్దేరాపోతుండగా గుర్తుకు వస్తాడు ఒక వ్యక్తి. అ వ్యక్తికి బహునామదేయుడు.. కొందరు ఎ.టి. యం అని కొందరు నస అని కొందరు బోర్ అని అంటుంటారు. వాడుక బాషలో ఆయనే నాన్న అంటారు. అప్పుడు కోడ డబ్బులు ఉంటె గుర్తుకు రాడు , కానీ టూర్ ఉత్సాహం లో ఎని డబ్బులు సరిపోవు కదా. ఇంకో విషయం మేము వెళ్ళే టూర్ ఎక్కడకి ... అరకు. ఎడ్యుకేషనల్ టూర్ కి అరకుకి ఏమి సంబంధం అని అడిగితే మాత్రం చకలగిలి పెట్టి చంపేస్తా.
అని అడ౦కులు దాటి బస్సు ఏక్యం . గోవింద గోవింద అన్న అరుపుల మధ్య బయల్దేరింది బస్సు . ఎప్పుడో గాని స్నానాలు చేయని అబ్బాయిలు స్నానాలు చేసి, ఎప్పుడు మేకప్ చేసుకునే అమ్మాయిలు కొంచెం ఎక్కువ చేసుకొని కూర్చున్నారు బస్సులో. కాలేజీ ఆవరణం దాటింది నా కర్మ కాళింది. ఇప్పటిదాక మనుషులలాగా ఉన్న అబ్బాయిలు కోతులలాగా మారారు. ఒక్కడు కెవ్ అన్ని అరిస్తే ఇంకోడు బో అని అరుస్తున్నాడు. తల్లుపులు కిట్టికిలు పట్టుకొని వేలాడుతుంది ఒక బ్యాచ్. ఇంతలో డ్రైవర్ అరుస్తున్నాడు. విషయం ఏమిటంటే మా వాడు వెళ్లి నేను డబ్బులు ఇచ్చాను మర్యాదగా నీ సీట్ నాకు ఇవ్వు అన్నడు . ఈ తుఫానుకే తట్టుకోలేక పోతుంటే .. 2012 .. అదే తెలుగు లో యుగాంతం మొదలు అయ్యింది. ఇప్పటి దాక ఆకాశ లోకాలలో విహరిస్తున్న అమ్మాయిలు ఈ లోకానికి వచ్చేసారు. ఒక్కకరు వెళ్లి ఒక్కొకో అబ్బాయితో కూర్చున్నారు. టూరుకి పంపడానికి ఇంతమంది ఎందుకు ఒపుకోవలో అప్పుడే అర్థం అయ్యింది నాకు.
ఇక చేసేది లేక నోరుమూసుకొని వెళ్లి క్లీనర్ సీట్లో కూర్చొని ఏమి జరుగుతోందో చూస్తున్న. అమ్మాయిలు వాళ్ళ చిన్నపుడు పోగొట్టుకున్న పాపడి బిళ్ళ దగ్గర మొదలుపెట్టి ఈ మధ్యనే వరదలో కొట్టుకుపోయిన తన ఫేవరెట్ చున్నీ వరకు ఏదో సోది చెప్తున్నారు. అబ్బాయిలు అంత ఎంతో సరదాగా వి౦టునట్టు నట్టిస్తున్నారు. ఇంతలో ఎవరో అమ్మాయికి తన టాలెంట్ చూపించాలి అన్న ఉత్సాహం మొదలు అయ్యింది . వెంటనే అమ్మాయిల చెవిలో ఏదో గుస గుస గుస అంతే అందరు ఏక కంట౦తో అంత్యాక్షరి అన్నారు. ఆ గ్రూప్ లీడర్ వాళ్ళ వీధి చిత్ర అంట మన కర్మ . పాడుతా తీయగా ప్రోగ్రాంకి వెళ్తే పాడుతా చేదుగా పెట్టినప్పుడు పిలుస్తాను అన్నారు అంట అప్పటిదాకా కాలిగా ఉండకుండా ఇలా నలుగురికి వినిపించి పేరు తెచుకోవాలి అని ఆమె ఆశయం . అప్పుడే డ్రైవర్ ఒక ధర్మ సందేహం అడిగాడు ఈ అమ్మాయిలకి అంత్యాక్షరి తప్ప వేరే ఆట రాధా అని. వాళ్ళకి ఆ ఆటకంటే జీవితాలతో ఆడుకోవటం బాగా తెలుసు అని వర్ గారికి తెలియదు లెండి .
ఆ పక్క టీంలో చిత్ర అయితే ఈ పక్క అందరి దగ్గర టాలెంట్ చూపడానికి ముందుకు దుక్యాడు కవి ద్ర బోస్.. టెన్షన్ పడదు చంద్రబోస్ మాతో చదవలేదు .వాడికి ఆ పేరు రావడానికి కారణం ముందు ముందు మీకేతెలుస్తుంది.
మాఘ మాసం ఎపుడ్దోస్తుందో
మౌన రాగాల్లేని ణాలో
మంచు మబ్బు కమ్ము కొస్తుందో
మత్తు మత్తు ఎన్ని ఎల్లో
ఎవరంటే ఏటమ్మా వివరాలే గుట్టమ్మ
చికుబుకు చికు చిన్నోడోయమ్మ
ఆహ ఓహో అని మన చంద్రబోస్ అబో వాయ్యో అన్ని నేను.
ఇక మన చంద్రబోస్ టైం ... "మా" తో "మా" తో పడాలి అన్నారు కోరుస్ లో అమ్మాయిలు అంత
మందాకినీ మందాకినీ .. నీతో కొంచెం ఉందే పని
మందాకినీ ఈ చాందిని.. ఎక్కడికో చెప్పు మనం వేల్లేదని
కొంచెం అల పక్కకొస్తే దారే చెప్తా
కోకో కోలా తాగిపిస్తా నీచేతే ఉడత
ఛీ నా ఫస్ట్ సినిమాకి చక్రి మ్యూజిక్ కొట్ట. లేకపోతే ఈ పాట ఏమిటి ఆ లిరిక్స్ ఏమిటి. మీకు అర్థం అయ్యింది మన వాడికి చంద్రబోస్ అని . ఎక్కడ ఏమి కావాలి అంటే అది పాడేస్తాడు. జనరల్గా మన వాడికి కొంచెం జ్ఞాపక శక్తీ ఎక్కువలె.
త త ... త తో పడాలి అన్నాడు... మన చంద్రబోస్
తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం
అల సాగుతుంటే మేఘాల రాగం ఇల చేరుకుంటే..
తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం
నెక్స్ట్ మా తో..
చంద్రబోస్..
మా ఇంటి పెరటి జామ్ బనులని కుశలం అడిగే
మా తోట కోతేమో నీకోసమే చూసే
నిన్ను చుసేసాక ఇక ఆపలేక ఒంటికే కొవ్వు పట్టిందని
పెద్ద శబ్దం ... సడన్ బ్రేక్ .. క్లినేర్ ఒక పక్క వాంతులు .. ఇట్టు పక్క డ్రైవర్ ఫిట్స్ వచ్చిన వాడిలాగా కొట్టుకుంటున్నాడు. బస్సులో కొంత మంది చెవులు , కొంత మంది కళ్ళు చాల మంది ముకులు మూసుకున్నారు.
ఇక నేను జీవితంలో మల్లి ఆ టూర్ కి వెళ్ళలేదు .. మా క్లాసు లో ఎవరు ఎప్పుడు అంత్యాక్షరి పేరు ఎత్తలేదు

Subscribe to:
Posts (Atom)