Friday, January 22, 2010

జైలులో జంపింగ్.

హలో నా పేరు జంపింగ్ జనార్ధన్. కాని అందరు నన్ను జంపింగ్ అని పిలుస్తారు. నేను పుట్టగానే ఒక పదిహేను నిముషాలు ఏడవలేదు, నవ్వలేదు , కదలలేదు. నేను ఎందుకు పనికి రాను అని మా నాన్న డిసైడ్ అయిపోయాడు అప్పుడే నేను కదిలా .కదలగానే మా నాన్న మిస్టర్. పెర్ఫేక్ట్ , మిస్టర్. పెర్ఫేక్ట్ నిన్ను నేను చేస్తా మిస్టర్. పెర్ఫేక్ట్ అని పాట పాడాడు . ఆయనకీ ఏమి తెలుసు మనం పూర్వ జన్మలో టీవీ 9 రిపోర్టర్ అని వాలని ఎప్పటికి మార్చలేము అని. ఆ కలలతోనే ఒక రోజు మా నాన్న టీవీ చూస్తున్న నా దగ్గరకి వచ్చి రేయి పెద్దతే ఏమవుతావు అన్ని అడిగాడు. నేను పోలీసు ఆఫీసర్ అవుతాను అన్న. మహా ఆనందంతో ఎందుకు నాన్న అన్నాడు. అప్పుడు అయితే నస పెట్టె అందరు తండ్రులని జైలులో పెట్టచు కదా నాన్న అన్న.

ఆ తర్వాత ఒక శుభ ముహూర్తం చూసి బడిలో చేర్చారు. భయపడుతూనే, ఇంతక ముందు అడిగిన ప్రశ్నే మల్లి అడిగాడు మా నాన్న. ఈ సారి కొంచెం వెరైటీగా టీచర్ అవుతాను అన్న. దీనికి ఏమి చెప్తానో అని ఎందుకు అన్నాడు. టీచర్ అయితే క్లాస్సులో కూడా నిద్ర పొవచు నాన్న అని సమాధానం ఇచ్చా . మా నాన్నకి ఏమి అయిందో తెలిదు కాని సుత్తి వీరభద్ర రావు లాగా చొక్కా చించుకున్నాడు. నాన్న చొక్కా తీయడానికి గుండిలు ఉపయోగించాచు నాన్న అన్న.

మా నాన్నకి భయం పట్టుకింది ఇలాగే ఉంటే చివరికి తెలుగు సినిమా హీరోగా తప్ప ఎందుకు పనికి రాను అని. వెంటనే నా పెళ్లి కుదిర్చారు. అవును నా పెళ్లి కుదిర్చారు. అమ్మాయి ఎవరో కాదు నేను ఎంతో ప్రేమతో రెండు మూడు సార్లు రాయతో కొట్టిన సుబ్బారావు అంకుల్ కూతురు సుందరి. సుందరి గురించి చాలా చెప్పాలి. సుందరి నేను పుట్టిన ఆరు నేల్లలకి పుట్టింది . అందరు నాకు పెళ్ళాం పుట్టింది అన్నారు. బ్రహ్మ సుందరి వీపు మీద జంపింగ్ పెళ్ళాం అని రాసాడు, లేక పోతే అందరికి ఎలా తెలిసిపోయిందో.

సుందరి పేరు నేను ఫస్ట్ టైము విన్న సంఘటనా నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజు ఎప్పుడు లేనిది మా నాన్న స్వీట్లు తెచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే నాకు, అమ్మ కి స్వీట్ ఇచ్చి తను ఒకటి తిన్న తర్వాత ఒకటి మిగిలింది. మా అమ్మ అది చూసి మూర్చ పోయింది. లేచిన తర్వాత మా అమ్మకి చెప్పాడు సుందరి ఈ రోజు మొదటి సారి మా నాన్నని మామ అని పిలిచి ఈ స్వీట్ బాక్స్ ఇచ్చింది అని. మా అమ్మ ముందే చెప్పచు కదండీ మీరు ఎక్కడ మామ్ములు మనిషి అయ్యారు అన్న ఆనందం ముర్చపోయాను అనవసరంగా అంది.

తర్వాత చాలా రోజులు మా నాన్న రోజు ఏదో ఒకటి చెప్పేవాడు సుందరి గురించి . సుందరి నా వెనక పరిగితింది ,సుందరి నన్ను చూసి నవ్వింది ( అప్పుడే తెలిసి పోయిందా మీరు జోకర్ అని అనుకున్న మనస్సులో ) , సుందరి పుస్తకం తీసుకొని ఏదో రాస్తోంది , సుందరి చీదింది , సుందరి తుమ్మింది, సుందరి దగ్గింది అలా . ఇంకా నన్ను మొదటి రోజు స్కూలో చేర్పించే అప్పుడే ఆ అమ్మాయిని కూడా స్కూలో చేర్పించారు. నన్ను చూడగానే నువ్వేనా ఎందుకు పనికి రాని అంకుల్ కొడుకువి అంది. స్కూలో అందరు నవ్వారు. ఆ రోజే బుక్ తీసుకొని సుందరి పేరు రాసేసి దాని ఒక వందసార్లు కొట్టేసా. ఆ పక్కనే దానికి కొత్త పేరు పెట్ట శసే (శంకలో సేగ్గడ ). ఇవ్వని కాకుండా ఇంకా చాలా చెడ్డ లక్షణాలు ఉన్నాయి శసేకి ఏ రోజు కూడా హోం వర్క్ రాయకుండా రాదు, టీచర్ అడిగిన అనిట్టికి టక్కుమని జవాబు చెప్తుంది, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ . వీటి అనిట్టికి అంటే పెద్ద చెడ్డ అలవాటు ఏమిటి అంటే హ్యాండ్ రైటింగ్ చాలా చాలా నీటుగా రాస్తుంది. దీంతో నిన్నటి దాక ఇంట్లో జరిగేదే స్కూలో కూడా మొదలు అయ్యింది. సుందరిని చూసి రాయి, సుందరిని చూసి నేర్చుకో , సుందరి లాగా నీటుగా ఉండు. దాంతో కోపం పెరిగిపోయి రోజు ఉదయానే ఒక కాగితం మీద సుందరి పేరు రాసి దాని తగలపెట్టి నాలో కోపాని చల్లరుస్తున్న.

ఇక మూడో క్లాస్లోనే మా పెళ్లికి కారణం, ఇలాగే కంటిన్యూ అయితే నాకు భవిష్యతులో శసేతో పెళ్లి కాదు అని. కాని మా నాన్న అందరికి చెప్పే కారణం వాళ్ళ అమ్మ చనిపోయే లోపు నా పెళ్లి చేయాలి అని . దీని వాళ్ళ మా నాన్నకి వచ్చే అవకాశం ఏమిటి అంటే నాకు శసేని కాపలా పెట్టచు స్కూల్లో అని. ఆ రోజు సెప్టెంబర్ 30, 1993 తెల్లవారు జామున 03:56 కి. ఆ రోజు అదే టైముకి లాటుర్ అనే ఊర్లో బూకంపం వచ్చి పది వేల మంది పోయారు, ఆ బూకంపంలో బతికిన ముప్పై వేల మంది మేము ఇద్దరం చావడానికి ఇంకా పూజలు చేస్తున్నారు.

ఆ రోజు నుండి నా బాత్రూమ్లో , నేను నిద్రపోయేటప్పుడు తప్ప మిగత టైము అంత నా వెంటనే ఉంది శసే. నేను అబ్బాయిలతో ఉన్న కూడా నా వెనకాలే ఉండేది. అందుకే అందరు నన్ను పాడు అయిన పాత టీవీ చూసినట్టు చూసే వారు, పారేయాల వద్ద అని. ఈ గొడవ తప్పించుకోవడానికి చాలా కష్టపడి జాగ్రతగా తప్పులు లేకుండా ముందరి వాడి దాంట్లో కాపి కొట్టి మంచి మార్కులు తెచ్చుకున్న. మా నాన్న ఆనందంతో ఎగిరి ఫుట్బాల్ ప్లేయర్ కొట్టినట్టు మా ఫ్యాన్ని కొడితే అది గిరగిర తిరుగుతూ వెళ్లి బయట పడింది. తలకి దెబ్బ తగిలి అన్నాడో మాముల్గా అన్నాడో తెలియదు కాని ఎప్పటికి ఇంక శసే నా వెనకే ఉంటుంది అన్నాడు. వెంటనే నా కళ్ళ ముందు శసే హాహాకారం చేస్తూ నడుస్తోంది , చేతిలో ఒక బెల్టు పట్టుకొని పోతోంది. అలా ఆ గొలుసుని ఫాలో అవతు వెనకకి వెళ్తే అ బెల్టుకి రెండో చివర నా మేడలో ఉన్న చైన్ కట్టేసుంది.

ఆ రోజు నుంచే నేను శసే బానిసను అయ్యిపోయా. రూల్స్ మీద రూల్స్ పాస్ చేసేది . టీవీలో వచ్చే అని సిరియల్స ఫాలో కావలి, క్రికెట్ ఛానల్ పెట్టకూడదు , ఐటెం సాంగ్స్ వస్తే టీవీ అప్పేయాలి. ఉదయానే లేవాలి , రోజు పళ్ళు తోముకోవాలి స్నానం చేయాలి. ఉదయానే లేవమన్నావు ఓకే రాత్రి తొందరగా నిద్ర పోయి లేస్తా, పళ్ళు తోముకోమన్నావు రోజు కాకపోయినా రెండు రోజులకి ఒక సారి ట్రై చేస్తా మరి రోజు స్నానం చేయాల నా వల్ల కాదు అన్న. ఫైర్ ఇంజెన్ కూత వినిపించింది ఇల్లంతా నీలు ఏమిటా అంటే శసే ఏడుస్తోంది . లాట్టేరిలో కోటి రూపాయలు దొరికిన వాడిలాగా ఆనందపడ్డ మా నాన్నని చూడగానే ఒక నమ్బెర్లో మిస్ అయ్యిన వాడిలాగా పెట్ట మొహం. ఆ రోజు ఉదయానే నన్ను చెక్ చేయడామే పనిగా పెట్టుకుంది. మనం దొరుకుతామ ఒళ్ళంతా స్సెంట్ కొట్టేసి, నోట్లో మింట్ వేసుకొని ఒంటి మీద అలా అలా నీలు చల్లుకొని వచ్చేవాడ్ని.

ఒక రోజు మా మాస్టారు నీకు ఏమి ఆటలు వచ్చు అన్నాడు. నేను ఏమి చెప్పకుండా అలానే ఉండిపోయా . మా మాస్టారు తిట్లదండకం మొదలు పెట్టాడు. శసే లేచి కుంధుడుగుమ్మ , బారాకట్ట, చింత పిక్కలు , అచంగాయలు అన్ని వచ్చు అంది. క్లాస్సు అంత తెగ నవ్వారు . ఇన్ని బాధల మధ్యలో నాకు దొరికే ఒకే ఉపసమనం బాత్రూం. ఎక్కువ సేపు బాత్రూమ్లో గడపడం మొదలు పెట్టాను.

చూస్తుండగానే నా భానిసత్వానికి ఒక ఏడు యేలు గడిచాయి. ఏడు యేలు అయ్యింది ఇంక వద్దలచు కదా ఈ శని అనుకుంటూ లేచా . ఆ రోజే మా మొదటి రోజు కాలేజిలో ఇకనైనా ఎవరు అయిన అమ్మాయికి లైన్ వేయాలి అనుకున్న. కాని శసే జాలి, దయ, కరుణ వల్ల ఒక అమ్మాయి కూడా తల తిప్పి నన్ను చూడలేదు. తానూ ఒకటి తలిస్తే అధిష్టానం ఒకటి తలిచింది అంటారు ఇదే కాబోలు. ప్రైమ్ మినిస్టర్ అయిన ఇంకా సోనియా గాంధి మాట వినే మన్ మోహన్ సింగ్ లాగ ఉంది నా పరిస్థతి. అది రేంజ్లో కల్లెజ్ మూడు యేలు గడిచిపోయాయి. కాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయ్యా. పూణేలో ఉద్యోగం. ఆఫర్ లెటర్ తీసుకొని బయటకి వచ్చే సరికి ఆత్రంగా ఎదురు చూస్తోంది శసే . జాబు వచ్చింది అని చెప్పా. మరి ఏడుస్తున్నావు ఏమిటి అంది. ఇప్పుడు కాదు నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి ఏడుస్తున్నాను అని మనస్సులో అనుకోని లేదే అన్న బయటకి. నా చేతిలో కాగితం లాకొని పూణేనా అని ఫైర్ ఇన్జన్ స్టార్ట్ చేసింది. ఏమి అని తన చేతిలో ఉన్న ఇంకో కాగితంలో చూస్తే తెలిసింది శసేకి జాబు వచ్చింది కాని చెన్నైలో . ఇప్పుడే వస్తాను అని వెళ్లి బాత్రూంలో హ్యాపీగా ఎంజాయ్ చేశా.

అదే ఆనందంతో ఇంటికి వెల్ల . మా వీధి అంత స్వీట్స్ పంచా. నా మీద చాలా రోజులుగా ఆశ పెట్టుకున్న పక్కింటి పారిజాతం మొబైల్ నెంబర్ తీసుకున్న . అందరు నాకు ఉద్యోగం వచ్చినందుకు అనుకున్నారు . శసే ఏడుస్తూనే ఉంది ఇంట్లో. ఉత్తరాలతో మాట్లాడుకునే అందరి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పేసా. రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చా. ఇంట్లో అంత ఏదో హడవుడి హంగామా. పంతులు గారు వచ్చి ఉన్నారు. ఈరోజు నుంచి మూడో రోజు మంచి మూహుర్తం అన్నాడు. ఉద్యోగం వచ్చింది అని ఏది అయిన వ్రతం చేస్తున్నరులే అనుకున్న. శాస ఏడుపు మొహం చూడడానికి ఆమె రూమ్లోకి వెల్ల. ఆశ్చర్యం ఏడుపులు లేవు. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటోంది . ఎప్పుడు లేనిది మీద మీదకి వస్తోంది. వచ్చి చెవిలో ఒక వార్త చెప్పి సిగ్గు పడుతూ వెళ్ళిపోయింది. బాత్రూమ్లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్న. అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నన్ను పట్టించుకోకుండా. ఇంతక ముందు తీసుకున్న అమ్మాయి మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి విషయం చెప్పా. ఆ అమ్మాయి జంపింగ్ నువ్వు ఇప్పటి దాక ఎన్ని జమ్పింగులు అయిన చేయచు కాని ఈ మూడు రోజుల తర్వాత జమ్పింగులు చేస్తే డైరెక్టుగా హేల్లుకే జమ్పింగు చెయ్యాలి అని చెప్పి ఫోన్పెట్టేసింది. ఆ టైములో బాత్రూంలో ఉన్న బేసిన్లో దూకి ఆత్మ హత్య చేసుకుందాం అనుకున్న కాని కుదరలేదు. కన్నీలు తుడిచి తుడిచి తడిసిపోయిన నా పాత డ్రాయార్ ఆరేలోపే ఆ మూడో రోజు వచ్చేసింది.

ఈరోజే ఆ మూడో రోజు ఇప్పుడు నేను పాత జైలు నుండి కొత్త జైలుకి మారపోతున్నాను. కొత్త జైలు గురించి తొందరలో మాట్లాడుకుందాం. బై ... బై ... లెగ్ బై..

ఆగు ఆగు అస్సలు విషయం చెప్పి వెళ్ళు.

ఈ రాత్రే నా జీవితంలో మిగిలిన మిగతా జంపింగ్ జంప్ అయ్యి వెళ్ళిపోయే రాత్రే . మగ వాళ్ళని అందరిని ఆడవాలు కంట్రోల్ చెయ్యడానికి ఉపయోగించుకున్నే రాత్రే . ఆ రోజే మొదటి రాత్రి. మొద్దుగా దానే శోభనం అంటారు.
అదే ఈ రాత్రే నా శోభనం .. నా శ్రాద్ధం .